“మన ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ (AAA) తొలి జాతీయ సదస్సుకు మీ అందరికీ ఆహ్వానం పలకడం ఎంతో ఆనందంగా ఉంది—మన సాంస్కృతిక సంప్రదాయాలను, వారసత్వాన్ని ఘనంగా జరుపుకునే ఈ వేడుకలో మీరు అందరూ పాల్గొనాలని ఆహ్వానిస్తున్నాను. ఈ ఏడాది సదస్సు మరుపురాని సాంస్కృతిక కార్యక్రమాలతో అద్భుతంగా ఉండబోతోంది. సాంప్రదాయ నృత్య ప్రదర్శనలు, వీనుల విందైన సంగీత ప్రదర్శనలు, ప్రముఖ తెలుగు సినీ సంగీత దర్శకులచే అబ్బురపరిచే సంగీత కచేరీలు అలరించబోతున్నాయి.
మన సదస్సుకు ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రముఖ తెలుగు చిత్ర నటుడు హాజరై ఈ ప్రత్యేక సందర్భాన్ని మనతో కలిసి పండగలా జరుపుకోబోతున్నారు.
మన సంస్కృతికి ప్రతిరూపం రంగవల్లులు. తెలుగు లోగిళ్ళలో పండగ కళ తీసుకొచ్చే ‘ముగ్గుల పోటీ’ని ప్రపంచవ్యాప్త పోటిగా నిర్వహిస్తున్నాం. అలాగే షార్ట్ వీడియోలని ఆకట్టుకునేలా రూపొంచేవారి కోసం ‘రీల్స్ పోటీ’ కూడా ఉంది. దీంతో పాటు aspiring filmmakers కోసం ‘షార్ట్ ఫిల్మ్ పోటీ’ నిర్వహిస్తున్నాం, మీ ప్రత్యేక కథలను ప్రదర్శించడానికి ఈ అవకాశం వినియోగించుకోండి. సంగీత పోటీలు కూడా మీ ప్రతిభను వెలుగులోకి తీసుకొచ్చి, ఈ వేడుకలో మీ భాగస్వామ్యాన్ని మరింత ప్రత్యేకంగా మారుస్తాయి. విజేతలకు భారీ ప్రైజ్ మనీ కూడా ఉంది.
మరి మన ఆంధ్రప్రదేశ్ వంటకాల గురించి మర్చిపోవద్దు! అన్ని జిల్లాల ప్రత్యేక ఆహార పదార్థాలతో, రుచికరమైన ప్రత్యేక వంటలు, పిండి వంటలు, పచ్చళ్ళతో పాటు మరెన్నో రుచుల ద్వారా మన ఆంధ్ర సమాజపు ఆహారపు అలవాట్లను రుచి చూపిస్తున్నాం.
AAA సంస్థ, AAA మొదటి జాతీయ సదస్సు గురించి మరిన్ని వివరాలకు, దయచేసి https://nationalconvention1.theaaa.org వెబ్ సైట్ ని సందర్శించండి. అన్ని పోటీల కోసం ప్రైజ్ మనీ వివరాలు, Registration, Submission గడువు తేదీలు తెలుసుకొని, వివరాలు నమోదు చేయండి. త్వరలోనే మీకు ఫ్లయర్లు, పేపర్ ప్రకటనలు, సోషల్ మీడియా పోస్టులు రానున్నాయి. అందులో అన్ని వివరాలు ఉంటాయి, మీరు పోటీల్లో పాల్గొనడానికి అవసరమైన సమాచారం అందులో కూడా ఉంటుంది.
ఈ సదస్సు కేవలం ఒక కార్యక్రమం కాదు; ఇది మన సంస్కృతి పట్ల ప్రేమను, అనుబంధాన్ని, కృతజ్ఞతను తెలియజేయడానికి ఒక అవకాశం. కాబట్టి మీ ఆలోచనలను, ప్రతిభను ప్రదర్శించి, ఈ సదస్సును మరుపురాని విధంగా మార్చే ప్రయత్నంలో మాతో కలిసి పాల్గొనండి. మీ అందరి ప్రతిభను చూడటానికి, మిమ్మల్ని కలుసుకోవడానికి ఎదురుచూస్తున్నాను. ధన్యవాదాలు!”