Thursday, May 2, 2024

పదేళ్లు పాలించిన బిఆర్‌ఎస్ పార్టీని ప్రజలు బొందపెట్టారు

  • ఎన్నికల తర్వాత ఆ పార్టీ ఉండకపోవచ్చు
  • ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి

బిజెపి, బిఆర్‌ఎస్ పార్టీలపై ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పదేళ్లు పాలించిన బిఆర్‌ఎస్ పార్టీని ప్రజలు బొందపెట్టారని ఆయన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో బిఆర్‌ఎస్ పార్టీ పని అయిపోందని పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఆ పార్టీ ఉండకపోవచ్చని కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో పదేళ్లు అధికారంలోకి ఉన్న బిజెపి తెలంగాణ రాష్ట్రానికి ఏం చేయలేదని ఆయన విమర్శించారు.

వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మతతత్వ బిజెపిని ఓడించేందుకు వామపక్షాలు కలిసిరావాలని ఆయన పిలుపునిచ్చారు. కేంద్రంలో మరోసారి బిజెపి అధికారంలోకి వస్తే దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతోందని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ ఎంపి సీట్లు సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కేంద్రంలో సైతం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతోందని రాహుల్ గాంధీ ప్రధాని అవుతారని ఆయన అన్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బీజేపీ స‌ర్కార్ తెలంగాణ‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర‌ జ‌రుపుతుందా?

Most Popular