Sunday, April 6, 2025

ఆయిల్‌ ‌సీడ్‌ ‌కార్పొరేషన్‌ ‌చైర్మన్‌ ‌గా జంగా బాధ్యతల స్వీకరణ

  • హాజరైన మంత్రులు ఉత్తమ్‌, ‌పొన్నం ప్రభాకర్‌, ఎమ్మెల్యే రేవూరి, సిరిసిల్ల
  • భారీగా తరలివచ్చిన అభిమానులు, కార్యకర్తలు

రాష్ట్ర ఆయిల్‌ ‌సీడ్‌ ‌కార్పొరేషన్‌ ‌చైర్మన్‌ ‌గా జంగా రాఘవరెడ్డి బుధవారం హైదరాబాద్‌ ‌బషీర్‌ ‌బాగ్‌ ‌పరిశ్రమల భవన్‌ ‌లో  అట్టహాసంగా అభిమానుల మధ్య బాధ్యతలు స్వీకరించారు. మంత్రులు ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి పొన్నం ప్రభాకర్‌ ‌కుర్చీలో కూర్చోబెట్టి అభినందనలు తెలిపారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. దీంతో పరిశ్రమ భవన్‌ ‌కోలాహలంగా మారింది. ఈ సందర్భంగా జంగా రాఘవ రెడ్డి మాట్లాడుతూ..

ఉమ్మడి వరంగల్‌ ‌జిల్లా డీసీసీబీ చైర్మన్‌ ‌గా జిల్లాలోని రైతులకు న్యాయం చేశానని, అదేవిధంగా బ్యాంకు అభివృద్ధికి కూడా కృషి చేశానని తెలిపారు. కార్పొరేషన్‌ ‌పదవిని కూడా అందరికీ ఉపయోగపడేలా చేస్తానని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి, మంత్రులు ఇచ్చిన ఈ అవకాశాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకొని ప్రజలకు న్యాయం చేస్తానని రాఘవరెడ్డి హామీ ఇచ్చారు. తమ శాఖ అభివృద్ధికి ఎల్లవేళలా కృషి చేస్తానని చెప్పారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌ ‌రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలకు కృతజ్ఞతలు తెలిపారు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com