Friday, April 4, 2025

కెసిఆర్ కాలం చెల్లిన మెడిసిన్

  • ఆయన చేసిన కామెంట్లను పట్టించుకోవాల్సిన అవసరం లేదు
  • రఘురామిరెడ్డి చాలా మంచి అభ్యర్థి
  • రాజ్యసభ ఎంపి రేణుకా చౌదరి

కెసిఆర్ కాలం చెల్లిన మెడిసిన్ అని, ఆయన చేసిన కామెంట్లను పట్టించుకోవాల్సిన అవసరం లేదని రాజ్యసభ ఎంపి రేణుకా చౌదరి కీలక వ్యాఖ్యలు చేశారు. ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి రఘురామిరెడ్డి చాలా మంచి అభ్యర్థి అని ఆమె ప్రశంసించారు. అభ్యర్థి విషయంలో ఉమ్మడి జిల్లాలోని కీలక నేతల అందరి వద్ద అభిప్రాయాలు సేకరించాకే అధిష్టానం నిర్ణయం తీసుకుందన్నారు. అధిష్టానం నిర్ణయం తీసుకున్న తర్వాత ఎవరూ తోకలు ఊపడానికి వీళ్లేదని ఆమె తెలిపారు. అభ్యర్థుల ప్రకటన విషయంలో ఆలస్యం ఏం జరగలేదన్నారు. ప్రభుత్వాలు కూల్చడం కాదు, ముందు తన జాతకం ఎలా ఉందో చూసుకోవాలి అని కెసిఆర్‌కు ఆమె కౌంటర్ ఇచ్చారు.

కెసిఆర్‌కు అధికార దాహం ఎక్కువైందని ప్రజలకు తెలిసిన తర్వాతనే గద్దె దింపేశారని ఆమె అన్నారు. అధికారదాహం ఒక రోగం అని దానిని తాము ఉచితంగానే నయం చేస్తామన్నారు. ప్రజలు పదేళ్లు అవకాశం ఇచ్చినా ఏనాడూ ఫాంహౌజ్ వదిలి బయటకు రాని వ్యక్తి ఇంటర్వ్యూలు ఇవ్వడానికి మాత్రం వస్తున్నారని ఆమె ఎద్దేవా చేశారు. ఇంటర్వ్యూ పేరిట స్టూడియోకు రప్పించిన ఆ న్యూస్ ఛానల్‌కు కంగ్రాట్స్ అని రేణుకా చౌదరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇకనైనా కెసిఆర్ జోస్యం చెప్పడం మానేయాలని ఆమె హితవు పలికారు.
Tags: Rajya Sabha MP,MP Renuka Chowdhury,comments on kcr

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com