కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల వైఖరితో నైతిక విలువలు కోల్పోయి దిగజారుడు రాజకీయాలతో తెలంగాణ రాజకీయాలని భ్రష్టు పట్టించారు
కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు జుగుప్సాకరమైన, వ్యక్తిగత ఆరోపణలతో ఒకరిపైఒకరు బురదజల్లుకుంటూ బాధ్యతారహితంగా రాజకీయాలను కలుషితం చేస్తున్నారు.
తెలంగాణలో ఇచ్చిన హామీలు, గ్యారంటీలు అమలు చేయలేదు. సీఎం రేవంత్ రెడ్డి మహారాష్ట్ర ఎన్నికల్లో ఏ మొహం పెట్టుకుని ప్రచారం చేస్తున్నారు..?
కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఇచ్చిన గ్యారంటీలు, హామీలు అమలు చేశామనేలా… మహారాష్ట్రలో తెలంగాణ ముఖ్యమంత్రి పేరిట పత్రికల్లో ప్రకటనలు చేస్తోంది.
కాంగ్రెస్ పార్టీ అంటేనే అబద్ధాలకు కేరాఫ్.
కిషన్ రెడ్డి గుజరాత్ కా గులాం అంటూ ముఖ్యమంత్రి మాట్లాడుతున్నడు.
నేను ఎవరికీ గులాం కాదు.. భారతీయులకు బీజేపీ పార్టీకి మాత్రమే గులాంను.
దేశ స్వాతంత్ర్య పోరాటంలో అహింసాయుతమైన పద్ధతిలో కీలక పాత్ర పోషించిన జాతిపిత మహాత్మగాంధీ గారు పుట్టిన గుజరాత్ కు గులాంనే..
నా తెలంగాణను రక్షించిన సర్దార్ పటేల్ గారు పుట్టిన గడ్డ గుజరాత్ కి గులాంనే..
భారతదేశంలో 25 కోట్ల మంది ప్రజలను దారిద్ర్యరేఖ నుంచి బయటకు తీసకువచ్చిన దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు పుట్టిన గడ్డ గుజరాత్ కు గులాంనే.
మీలాగా నకిలీ గాంధీ కుటుంబానికి గులాంను కాదు..
మీరు ఇటలీకి గులాం. ఇటలీ దేశం నుంచి వచ్చి దేశాన్ని చీల్చిన రాజకీయ నాయకులకు గులాం మీరు.
కాంగ్రెస్ వైఫల్యాలు, అక్రమ వ్యవహారాలు, భూదందాలను ప్రశ్నిస్తే జవాబు చెప్పే సత్తాలేక.. వ్యక్తిగతంగా బురదజల్లే ప్రయత్నం చేస్తున్నరు.