Thursday, November 28, 2024

పొలిటికల్​ బాంబులు పేలుతాయి

  • ప్రధాన నాయకులు అరెస్ట్
  • రెవెన్యూ, హౌసింగ్, స‌మాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి

రాష్ట్రంలో కీలక నేతలను అరెస్ట్​ చేసే అవకాశం ఉందని, కేవలం ఒకటీ, రెండు రోజుల్లోనే పొలిటికల్​ బాంబులు పేలుతాయని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి అన్నారు. దీపావ‌ళి రాక‌ముందే మంత్రి పొంగులేటి రాజ‌కీయ సంచ‌ల‌నాలు సృష్టించే పొలిటిక‌ల్ బాంబ్‌ల‌ను పేల్చేశారు. సియోల్‌లో హ‌న్ న‌ది పున‌రుజ్జీవ‌న ప‌రిస్ధితుల‌ను అధ్యయ‌నం చేయ‌డానికి వెళ్లిన మంత్రి పొంగులేటి అక్కడ ఓ తెలుగు జాతీయ ఛాన‌ల్ ప్రతినిధికి ఇచ్చిన ప్రత్యేక ఇంట‌ర్వ్యూలో సంచ‌ల‌న వ్యాఖ్యలు చేశారు. ఫోన్ ట్యాపింగ్‌, కాళేశ్వరం ప్రాజెక్ట్, ధ‌ర‌ణి వంటి సుమారు 8 నుంచి 10 ప్రధాన పాయింట్లలో ఈ చ‌ర్యలు ఉంటాయ‌న్నారు. దీనికి సంబంధించి ఫైళ్లు పూర్తి సాక్ష్యాధారాల‌తో సిద్ధమ‌య్యాయ‌ని మంత్రి వివ‌రించారు. సియోల్ నుంచి మ‌రో రెండు రోజుల్లో హైద‌రాబాద్ చేరేస‌రిక‌ల్లా చ‌ర్యలు ప్రారంభ‌మ‌య్యే అవ‌కాశాలు ఉన్నాయ‌న్నారు.

కేవ‌లం క‌క్ష సాధింపులా కాకుండా.. పూర్తిగా ఆధారాల‌తో చ‌ర్యలు ఉంటాయ‌ని, ఎంత‌టివారినైనా ఉపేక్షించేదిలేద‌న్నారు. తొంద‌ర‌ప‌డి ఎటువంటి ఆధారాలు లేకుండా చర్యలకు వెళ్లబోమ‌న్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు సంబంధించి విచార‌ణ దాదాపు పూర్తయిందని, మొత్తానికి ఫోన్ ట్యాపింగ్‌, కాళేశ్వరం ప్రాజెక్ట్, ధ‌ర‌ణి వంటి అంశాలు ట్రాక్‌లో ఉన్నాయ‌ని మంత్రి పొంగులేటి చెప్పారు. ప్రజ‌లు ఇంత‌వ‌ర‌కు ఎటువంటి చ‌ర్యలు లేవ‌ని భావించ‌వ‌ద్దని, వారు కోరుకునే విధంగా పూర్తి ఆధారాల‌తో ముఖ్యంగా ఫైళ్లు సాయంతో ముందుకు వెళ్లబోతున్నామ‌ని మంత్రి ప్రకటించారు.

కాగా, సియోల్​ పర్యటనలో ఉన్న మంత్రి.. రాజకీయ వర్గాల్లో సంచలనం రేకెత్తించే విధంగా మాట్లాడటంతో ఒక్కసారిగా వేడి పెంచింది. ఇప్పటికే హైడ్రా, మూసీ వంటి అంశాలతో పాటుగా లీగల్​ ఫైట్లతో రాష్ట్రంలో రాజకీయ ఆసక్తిని పెంచుతున్నాయి. ఇలాంటి సమయంలో కీలక విచారణ సాగుతున్న​అంశాలపై మంత్రి పొంగులేటీ ఈ బాంబు పేల్చారు. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టులో కమిషన్​.. బహిరంగ విచారణ చేస్తున్నది. ఇటు ఫోన్​ ట్యాపింగ్​లో నిందితులకు రెడ్​ కార్నర్​నోటీసులు కూడా జారీ అయ్యాయి. ధరణిలో సైతం చాలా మార్పులు తీసుకువస్తున్నారు. ప్రభుత్వ భూములను అప్పటి బీఆర్ఎస్​ నేతలు కబ్జా చేశారనే ఫిర్యాదులున్నాయి. ఇలాంటి నేపథ్యంలో మంత్రి వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

అధికారంలోకి వచ్చాక వడ్డీతో సహా చెల్లిస్తాం అన్న కేటీఆర్ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular