Friday, May 2, 2025

మెదీని అధికారం నుంచి దించుతాన్న ఖర్గేకు ప్రధాని ఫోన్

కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆదివారం స్వల్ప అస్వస్థతకు గురైయ్యారు. జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఓ సభలో ప్రసంగిస్తున్న సమయంలో ఖర్గే సొమ్మసిల్లి క్రింద పడిపోబోయారు. సభా వేదికపై ఆయన పక్కనే ఉన్న భద్రతా సిబ్బంది, పార్టీ నేతలు ఆయనను పట్టుకుని నీళ్లు తాగించారు. ఆ తర్వాత కోలుకున్న ఖర్గే తన ప్రసంగాన్ని కొనసాగించారు. ప్రధాని మోదీని ఉద్దేశించి ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం తనకు 83 ఏళ్లు అవుతున్నాయని.. అప్పుడే మరణించబోనని అన్నారు. ప్రధాని మోదీని అధికారం నుంచి దించే వరకు తాను చనిపోనని కామెంట్ చేశారు. జమ్ముకశ్మీర్‌కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని అన్నారు.
ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అస్వస్థతకు గురయ్యారనిన సమాచారం తెలియగానే ప్రధాని నరేంద్ర మోదీ ఆయనకు ఫోన్ చేసి  ఆరోగ్య పరిస్థితి గురించి వాకబు చేశారు. ఈ సందర్బంగా తన ఆరోగ్య పరిస్థితి గురించి మోదీకి వివరించారు ఖర్గే. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. మోదీని అధికారం నుంచి దించే వరకు తాను మరణించనని మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యలు చేసిన కాసేపటికే ప్రదాని నుంచి ఫోన్ రావడం కాకతాళీయమే అయినా రాజకీయవర్గాల్లో ఆసక్తికరంగా మారింది.

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com