Thursday, December 26, 2024

మాణిపూర్ భారతదేశంలో అంతర్భాగమే

లోక్‌సభలో రాహుల్ గాంధీ ప్రసంగం త‌ర్వాత‌.. కేంద్ర మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి స్మృతి ఇరానీ వీరావేశంతో మాట్లాడారు. రాహుల్ ప్రధాని మోడీపైన మాట్లాడిన తీరు అసంబద్ధంగా ఉందన్నారు. ఈశన్య రాష్ట్రాలపై తమ ప్రభుత్వానికి చెప్పలేనంత ప్రేమ ఉందని ఆ ప్రాంతాల అభివృద్ధికి మోడీ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. మణిపూర్ రాష్ట్రాన్ని విడగొట్టి జాత్యాహంకారని కి పాల్పడ‌ద్దామని చెప్పటం హాస్యస్పదంగా ఉంద‌ని.. మణిపూర్ భారత్ అంతర్భాగమని రాహుల్ మాట్లాడిన తీరును ఎండకట్టారు.

విపక్షాలకు తమపై తమకు విశ్వాసం లేదని దేశ ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉన్న తమ ప్రభుత్వం పై అవిశ్వాసం పెట్టడం అర్ధం లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అస్సాం, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో మహిళల‌కు ఎంత అన్యాయం జరిగిందో, ఎటువంటి హింసలు అనుభవించారో అందరికి తెలిసిందే అన్నారు. ఎమర్జెన్సీ సమయంలో కాంగ్రెస్ ప్ర‌భుత్వం ప్రతిపక్షాల‌ను ప్రజలను మహిళ‌ల‌ను ఎలా అవమానించారో అంద‌రికీ తెలుస‌ని తీవ్ర ఆవేశంతో చెప్పుకొచ్చారు.

* మోడీ మణిపూర్ విషయంలో చోటు చేసుకున్న ఘటనలపై ఎంక్వయిరీ కోసం సీబీఐకి అప్పచెప్పటాన్ని చూస్తే.. మణిపూర్ ప్రజలను ఆదుకోవడానికేన‌ని గుర్తు చేశారు. ఆయ‌న చేస్తున్న ప్రయత్నాలు అభినందనీయ‌మ‌న్నారు. ఇప్పటికే అల్లర్లకు, అఘాత్యాల‌కు పాల్ప‌డిన‌ వారిని గుర్తించి అరెస్ట్ చేశామన్నారు. దేశంలో మహిళాభివృద్ధికి, వారి సంక్షేమానికి, దళిత, ఆదివాసీ మహిళలు, బాలికల అభివృద్ధికి 5 వేల కోట్లతో 42 ప్రాజెక్టులు సిద్ధం చేశారన్నారు. బాలికలను పాఠశాలల్లో చేర్పించి డ్రాపౌట్ లేకుండా చేశామన్నారు. బాలికలకు డిఫెన్సె స్కూల్ ఏర్పాటు చేసింది మోడీ ప్రభుత్వమే అన్నారు. నిర్భయ చట్టంలోని నిందితుల కుటుంబాలకు ఆర్థిక సహాయం కుట్టు మిషన్లు పంచిన చరిత్ర కాంగ్రెస్ ది అని ఎద్దేవా చేశారు. మోడీ ని కీర్తిస్తూ మంత్రి స్మృతి ఇరానీ ప్రసంగిస్తున్న సమయంలో విపక్షాలు సభ్యులు అహో ఓహో అంటుంటే.. స్మృతి ఇరానీ.. మీరూ అలాగే అంటుంటారు.. మేంఇలాగే బీజేపీ బల్లె బల్లె అంటామ‌ని వ్యంగంగా మాట్లాడారు.

ప్ర‌దాన వార్త‌లు

అల్లు అర్జున్ పట్ల రేవంత్ రెడ్డి దారుణంగా వ్యవహరిస్తున్నారన్న డీకే అరుణ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com