33 శాఖలు…52,235 దరఖాస్తులు….
అర్హులకే ఈ జిఓను వర్తింపచేయాలని ప్రభుత్వం నిర్ణయం
స్క్రూటీని పారదర్శకంగా చేయాలని అన్ని శాఖలకు ప్రభుత్వం ఆదేశం
అధికంగా స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి 20,209 దరఖాస్తులు
హోం శాఖ నుంచి 11,417 కేసులు, వైద్య, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ నుంచి 4,833,
రెవెన్యూ నుంచి 2,676 దరఖాస్తుల రాక
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు 317 జిఓ కింద తమను బదిలీ చేయాలని కోరుతూ ప్రభుత్వానికి భారీగా దరఖాస్తులు చేసుకున్నారు. ఇప్పటివరకు 33 శాఖలు కలిపి 52,235 ఉద్యోగుల దరఖాస్తులు జిఏడికి వచ్చాయి. గతంలో ఉద్యోగల విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం 317 జీఓ బాధిత ఉద్యోగుల కోసం వెబ్ పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈనెల 18వ తేదీన 317 జీఓపై కేబినేట్ సబ్ కమిటీ సమావేశం కానున్న నేపథ్యంలో అన్ని శాఖల స్పెషల్ సిఎస్‌లు, ప్రిన్సిపల్ సెక్రటరీలు, సెక్రటరీలు ఉద్యోగులకు సంబంధించి పూర్తి సమాచారం ఇవ్వాలని జిఎడి ఆదేశాలు జారీ చేసింది.
ఈ నేపథ్యంలోనే పూర్తి సమాచారంతో సమావేశానికి ఆయా శాఖల అధికారులు హాజరుకానున్నారు. అయితే ప్రభుత్వానికి వచ్చిన విజ్ఞప్తుల్లో స్పౌస్ కేసుల కింద- 4,984, మెడికల్ కేటగిరీ -కింద 1,573 మ్యూచువల్ కేటగిరీ కింద- 841, సెంట్రల్ గవర్నమెంట్ స్పౌస్ కేటగిరీ -కింద 344, లోకల్ కేటగిరీ కింద 30,291, ఇతర కేటగిరీల కింద – 14,202 వచ్చాయి. ఇందులో అత్యధికంగా స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి 20,209, హోం శాఖ నుంచి 11,417 కేసులు, వైద్య, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ నుంచి 4,833, రెవెన్యూ నుంచి 2,676 కేసులు, లా అండ్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ నుంచి ఒక్కో దరఖాస్తు చేసుకున్న ఉద్యోగులు చేసుకున్నారు.
అర్హుల్లో 5 నుంచి 10 వేల మంది మాత్రమే…
అయితే భారీగా వచ్చిన దరఖాస్తుల్లో 5 నుంచి 10 వేల మంది ఉద్యోగులకు మాత్రం నష్టం జరిగిందని తెలుస్తోంది. అయితే ఈ దరఖాస్తుల విషయంలో పూర్తి స్థాయి విచారణ చేసిన అనంతరమే ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది. అయితే భారీగా వచ్చిన దరఖాస్తుల వల్ల ఇన్ని రోజులుగా నష్టపోయిన ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగవద్దని ప్రభుత్వం భావిస్తున్నట్టుగా సమాచారం. అందులో భాగంగానే దరఖాస్తుల విషయంలో స్క్రూటీని, విచారణను సమగ్రంగా చేపట్టాలని, ఆయా శాఖలు ఇచ్చే నివేదిక కూడా పారదర్శకంగా ఉండాలని ప్రభుత్వం ఆదేశించినట్టుగా తెలిసింది.
దరఖాస్తుల వివరాలు ఇలా…
స్కూల్ ఎడ్యుకేషన్‌లో స్పౌస్ కేసులు 3,033, మెడికల్ కేసులు 399, మ్యుచ్‌వల్ కేసులు 203, సెంట్రల్ గవర్నమెంట్ స్పౌస్ కేటగిరీ -కింద 165, లోకల్ 11,271 కేసులు, ఇతరులు 5,138 కేసులు మొత్తం 20, 209 దరఖాస్తులు స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి ప్రభుత్వానికి అందాయి. హోంశాఖ నుంచి స్పౌస్ కేసులు 392, మెడికల్ 330, మ్యుచ్‌వల్ 300, సెంట్రల్ గవర్నమెంట్ స్పౌస్ కేటగిరీ -కింద 16, లోకల్ 7,351 కేసులు, ఇతరులు 3,028 కేసులు మొత్తం 11,417 మంది దరఖాస్తు చేసుకున్నారు. వైద్య, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ నుంచి స్పౌస్ కేసులు 317, మెడికల్ 268, మ్యుచ్‌వల్ 45, సెంట్రల్ గవర్నమెంట్ స్పౌస్ కేటగిరీ -కింద 51, లోకల్ 2,356 కేసులు, ఇతరులు 1,796 కేసులు మొత్తం 14,833 మంది ఉద్యోగులు, రెవెన్యూ నుంచి స్పౌస్ కేసులు 216, మెడికల్ 102, మ్యుచ్‌వల్ 63, సెంట్రల్ గవర్నమెంట్ స్పౌస్ కేటగిరీ -కింద 15, లోకల్ 1,481 కేసులు, ఇతరులు 799 కేసులు మొత్తం 2,676 మంది ఉద్యోగులు, పంచాయతీ రాజ్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ స్పౌస్ కేసులు 177, మెడికల్ 94, మ్యుచ్‌వల్ 56, సెంట్రల్ గవర్నమెంట్ స్పౌస్ కేటగిరీ -కింద 08, లోకల్ 1,415 కేసులు, ఇతరులు 640 కేసులు మొత్తం 2,390 మంది ఉద్యోగులు,
సోషల్ వెల్ఫేర్ నుంచి స్పౌస్ కేసులు 158, మెడికల్ 44, మ్యుచ్‌వల్ 38, సెంట్రల్ గవర్నమెంట్ స్పౌస్ కేటగిరీ -కింద 20, లోకల్ 1,175 కేసులు, ఇతరులు 362 కేసులు మొత్తం1,797 మంది ఉద్యోగులు, అటవీ, పర్యావరణ నుంచి స్పౌస్ కేసులు 82, మెడికల్ 51, మ్యుచ్‌వల్ 52, సెంట్రల్ గవర్నమెంట్ స్పౌస్ కేటగిరీ -కింద 08, లోకల్ 732 కేసులు, ఇతరులు 310 కేసులు మొత్తం 1,235 మంది ఉద్యోగులు, ట్రైబుల్ వెల్ఫేర్ కింద స్పౌస్ కేసులు 111, మెడికల్ 36, మ్యుచ్‌వల్ 23, సెంట్రల్ గవర్నమెంట్ స్పౌస్ కేటగిరీ -కింద 08, లోకల్ 650 కేసులు, ఇతరులు 320 కేసులు మొత్తం 1,140 మంది ఉద్యోగులు, హయ్యర్ ఎడ్యుకేషన్ కింద స్పౌస్ కేసులు 57, మెడికల్ 25, మ్యుచ్‌వల్ 11, సెంట్రల్ గవర్నమెంట్ స్పౌస్ కేటగిరీ -కింద 15, లోకల్ 564 కేసులు, ఇతరులు 193 కేసులు మొత్తం 865 మంది ఉద్యోగులు, పశుసంవర్ధక, మత్య శాఖలో స్పౌస్ కేసులు 22, మెడికల్ 10, మ్యుచ్‌వల్ 03, సెంట్రల్ గవర్నమెంట్ స్పౌస్ కేటగిరీ -కింద 05, లోకల్ 383 కేసులు, ఇతరులు 218 కేసులు మొత్తం 641 మంది ఉద్యోగులు, మైనార్టీ వెల్ఫేర్‌లో స్పౌస్ కేసులు 117, మెడికల్ 22,
మ్యుచ్‌వల్ 06, సెంట్రల్ గవర్నమెంట్ స్పౌస్ కేటగిరీ -కింద 04, లోకల్ 363 కేసులు, ఇతరులు 104 కేసులు మొత్తం 616 మంది ఉద్యోగులు, వ్యవసాయ, కో ఆపరేటివ్ శాఖలో స్పౌస్ కేసులు 36, మెడికల్ 17, మ్యుచ్‌వల్ 07, సెంట్రల్ గవర్నమెంట్ స్పౌస్ కేటగిరీ -కింద 10, లోకల్ 358 కేసులు, ఇతరులు 179 కేసులు మొత్తం 607 మంది ఉద్యోగులు, ఇరిగేషన్ శాఖలో స్పౌస్ కేసులు 22, మెడికల్ 27, మ్యుచ్‌వల్ 0, సెంట్రల్ గవర్నమెంట్ స్పౌస్ కేటగిరీ -కింద 0, లోకల్ 361 కేసులు, ఇతరులు 118 కేసులు మొత్తం 528 మంది ఉద్యోగులు, పురపాలక శాఖలో స్పౌస్ కేసులు 27, మెడికల్ 26, మ్యుచ్‌వల్ 09, సెంట్రల్ గవర్నమెంట్ స్పౌస్ కేటగిరీ -కింద 0, లోకల్ 291 కేసులు, ఇతరులు 146 కేసులు మొత్తం 499 మంది ఉద్యోగులు ఇలా మొత్తం 33 శాఖల నుంచి ఉద్యోగులు 317 జిఓ కింద తమను బదిలీ చేయాలని దరఖాస్తు చేసుకున్నారు.