Friday, April 4, 2025

ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మంత్రి పొన్నంకు, సిఎస్‌కు, వినతిపత్రం

మంత్రి పొన్నంకు, సిఎస్‌కు, త్రిసభ్య కమిటీ సభ్యులకు వినతిపత్రం అందజేత
ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర స్థాయిలో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాలను ఏర్పాటు చేయాలి: టిజిఓ, టిఎన్జీఓ నాయకుల డిమాండ్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఉద్యోగ సంఘాల నాయకులు (టిజిఓ, టిఎన్జీఓ) రవాణా, బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని, ప్రొఫెసర్ కోదండరాంలను గురువారం కలిసి వినతిపత్రం అందించారు.

ఈ సందర్భంగా సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారిని, త్రిసభ్య కమిటీ సభ్యులు చిన్నారెడ్డి, కోదండరాంలకు వినతిపత్రాలను అందచేశారు. ప్రధానంగా ఉద్యోగుల పెండింగ్ డిఏల మంజూరు, హెల్త్ కార్డ్, 317 జిఓ సమస్యలు, సిపిఎస్ రద్దు, ఆంధ్రలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగుల 144 మందిని వెనక్కి తీసుకురావడం, గచ్చిబౌలి ఇళ్ల స్థలాలు బిటి ఎన్జీఓ సొసైటీకి ఇప్పించడం, ఉద్యోగుల పెండింగ్ బిల్లులు మంజూరు, నూతన జిల్లాలకు అదనపు క్యాడర్‌స్టెంత్‌ను మంజూరు చేయడం, ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర స్థాయిలో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాలను ఏర్పాటు చేయాలని ఉద్యోగ సంఘాల నాయకులు కోరారు.

సిఎంఓ ప్రధాన కార్యదర్శిని కలిసిన నాయకులు
అనంతరం ముఖ్యమంత్రి ప్రధాన కార్యదర్శి శేషాద్రిని ఉద్యోగ సంఘాల నాయకులు కలిసి తమ సమస్యల పరిష్కరించాలని అంశాల వారీగా ఆయనతో విన్నవించుకున్నారు. దీనికి శేషాద్రి సానుకూలంగా స్పందించి ముఖ్యమంత్రి దృష్టికి ఉద్యోగుల సమస్యలను తీసుకెళ్లి వాటిని పరిష్కరించడానికి తన పూర్తి సహకారాన్ని అందజేస్తానని ఉద్యోగ సంఘాల నాయకులకు హామీనిచ్చారు. ఆయనతో పాటు త్రిసభ్య కమిటీ సభ్యులైన డాక్టర్ జి.చిన్నారెడ్డి, ప్రొఫెసర్ కోదండరాంలతో నాయకులు, ప్రతినిధులు సమావేశమయ్యారు.

ఈ కార్యక్రమంలో టిఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్, టిజిఓ అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాస రావు, టిజిఓ ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, అసోసియేట్ అధ్యక్షులు కస్తూరి వెంకటేశ్వర్లు, ముత్యాల సత్యనారాయణ గౌడ్, హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు ముజీబ్ హుస్సేనీ, నగరశాఖ శ్రీకాంత్, మల్లారెడ్డి, టిజిఓ నాయకులు పరమేశ్వర రెడ్డి, నరహరిరావు, శ్రీనివాస మూర్తి, సచివాలయం సంఘ నుంచి శ్రీనివాస్ రెడ్డి, జనార్దన్ రెడ్డి, నరహరి రావు, నాల్గో తరగతి అధ్యక్షులు గడ్డం జ్ఞానేశ్వర్, డ్రైవర్ సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com