పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క
రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి అయితేనే అందరి కష్టాలు తీరుతాయని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఆదివాసీ ప్రాంతాల్లోని ఖనిజ సంపదను అదానీ, అంబానీలకు బిజెపి కట్టబెట్టిందని ఆమె విమర్శించారు. సింగరేణిని ప్రైవేటీకరణ చేశారన్నారు. మరోవైపు అధికారం కోల్పోగానే కెసిఆర్‌కు రైతులు గుర్తొచ్చారని మంత్రి ఎద్దేవా చేశారు. ఓటమిని జీర్ణించుకోలేక ఎవరినో ఉద్ధరిస్తానని బయలుదేరారని ఆమె విమర్శించారు.
Also Read: Phone Tapping case: 40 మంది మహిళలపై లైంగిక వేధింపులు
ఫోన్ ట్యాపింగ్, ఢిల్లీ లిక్కర్ కేసులను డైవర్ట్ చేసేందుకు దొంగ దీక్షలు చేస్తున్నారని మంత్రి సీతక్క మండిపడ్డారు. ఎవరెన్ని డ్రామాలు చేసినా తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ఓటేయాలని నిర్ణయం తీసుకున్నారన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో 14 సీట్లకు పైగా గెలుచుకుంటామని ఆమె ధీమా వ్యక్తం చేశారు. మెజార్టీ స్థానాల్లో బిఆర్‌ఎస్ మూడో స్థానానికి పరిమితం కాబోతుందన్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత బిఆర్‌ఎస్ క్రమంగా కనుమరుగు కావడం ఖాయమన్నారు.