Saturday, January 4, 2025

రైతు భరోసాకు కోతలు పెట్టేందుకు కుస్తీ

  • రైతులు సెల్ఫ్ ‌డిక్లరేషన్‌ ఇవ్వడమేంటి?
  • పోలీసుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారు: మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు

రైతు భరోసా పథకానికి కోతలు పెట్టేందుకు  వ్యవసాయ మంత్రి, ఆర్థిక మంత్రి ముఖ్యమంత్రి కుస్తీ పడుతున్నారని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు అన్నారు.  రైతు భరోసా కోసం రైతులు సెల్ఫ్ ‌డిక్లరేషన్‌ ఇవ్వాలని చెప్పడం రైతులను అవమానపరచడం కాదా? ఆయన ప్రశ్నించారు. సంగారెడ్డి సదాశివపేట లో అయ్యప్ప స్వామి మహా పడి పూజకు హరీష్‌ ‌రావుతో పాటు ఎమ్మెల్యేలు చింత ప్రభాకర్‌, ‌మాణిక్‌ ‌రావు, స్థానిక నాయకులు హాజరయ్యారు. అనంతరం సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మాజీ మంత్రి హరీష్‌ ‌మీడియాతో మాట్లాడారు. అందరికీ అన్నం పెట్టే రైతుకు షరతులు పెట్టడం సరికాదని అన్నారు.

వానకాలం, యాసంగికి కలిపి ఎకరానికి రూ.15000 చొప్పున రైతు భరోసా ఇవ్వాలని డిమాండ్‌ ‌చేశారు. పత్తి సాగు చేసే రైతులకు పెట్టుబడి సహాయం ఒకేసారి ఇస్తామని ప్రభుత్వం లీకులు ఇస్తున్నదని, పసుపు, అల్లం, చెరకు రైతులకు ఒకేసారి మాత్రమే రైతు భరోసా ఇస్తామంటే రైతు కడుపు కొట్టడమేనని అన్నారు. ముఖ్యమంత్రి మీ మాట నమ్మి 2 లక్షల పైన ఉన్న రుణాలను అప్పు తెచ్చి కట్టిన రైతులకు ఇంకా రుణమాఫీ కాలేదు. వ్యవసాయ కూలీలకు 28వ తారీఖు నాడే 12,000 రూపాయలు ఇస్తామని మాట తప్పారు.వ్యవసాయ కూలీలకు కోత పెట్టేందుకు వారి సంఖ్యను తగ్గించేందుకు కుట్ర జరుగుతోంది. ఎలాంటి షరతులు లేకుండా ఉపాధి హామీ కార్డు ద్వారా పనిలోకి పోతున్న కోటి నాలుగు లక్షల మందికి ఏడాదికి 12000 రూపాయలు ఇవ్వాలి అని హరీష్‌ ‌రావు డిమాండ్‌ ‌చేశారు.

అకాల వర్షాల వల్ల పత్తి రైతులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు. పత్తి దిగుబడి తగ్గింది. వర్షం ఆధారంగా పత్తిని సాగు చేస్తారు. ఎక్కువమంది దళిత గిరిజన బీసీ రైతులే ఉంటారు.వాళ్ళ కడుపు కొట్టకండి.సంవత్సరానికి ఒకేసారి పండిన పంటైనా సరే దానికి పెట్టుబడి ఎక్కువ. చెరుకు పత్తి పసుపు ఇతర హార్టికల్చర్‌ ‌పంటలు సంవత్సరానికి ఒకసారి పండినా వాటిక అయ్యే ఖర్చు ఎక్కువ. కాంగ్రెస్‌ ‌పార్టీ అధికారంలోకి వొచ్చిన తర్వాత కోతలు తప్ప రైతులకు ఇచ్చిందేమీ లేదు.  రుణమాఫీ సగం మందికి అయింది. అన్ని పంటలకు బోనస్‌ అన్ని కేవలం ఒక సన్నాలకు మాత్రమే బోనస్‌ ఇస్తామంటున్నారు. పంటల బోనస్‌ ‌విషయంలో పది పంటలకు బోనస్‌ ఇస్తామని ఒక్క పంటకే బోనస్‌ అని అందులో సన్న రకాలకే బోనసిస్తామని అన్నారు.

రైతుబంధు వానకాలం ఎగ్గొట్టారు. యాసంగి ఎగ్గొట్టే కుట్ర చేస్తున్నారు. పంటలకు బీమా అసెంబ్లీ స్పీచ్లో చెప్పారు. వాన కాలంలో అడిగితే ఏసంగిలో ఇస్తామన్నారు యాసంగిలో అడుగుతే మల్ల వచ్చే సంవత్సరం చూస్తామని అంటున్నారు.  రైతులకు వ్యవసాయ పనిముట్లు ఇస్తామన్నారు,ఇవ్వలేదు. పాడి రైతులకు ఐదు రూపాయల ప్రోత్సాహమన్నారు అది లేదు. 24 గంటల కరెంటు అన్నారు 16 గంటలకు నుంచి కరెంటు ఇవ్వడం లేదు. కాంగ్రెస్‌ ‌పార్టీ రైతులకు ఇచ్చిన ఒక్క హామీ అయినా నిలబెట్టుకున్నారా? 2 లక్షల పైనున్న రుణాన్ని అప్పులు తెచ్చి మరి కడితే ఇప్పటివరకు రుణమాఫీ కాలేదు. రైతుల పైన మిత్తి భారం పడుతుంది. వారికి ఏం సమాధానం చెబుతారు అని హరీష్‌ ‌రావు నిలదీశారు.

క్రైమ్‌ ‌రేట్‌ ‌లో ఎల్లో జోన్‌ ‌లోకి తెలంగాణ
క్రైమ్‌ ‌రేట్‌ ‌లో తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు ఎల్లో జోన్లకు వెళ్లిందని, ఇది బాధాకరమైన విషయమన్నారు. దేశానికే ట్రైనింగ్‌ ఇచ్చిన పోలీసులను ఈరోజు రేవంత్‌ ‌రెడ్డి రాజకీయ కక్ష సాధింపు కోసం వాడుకుంటున్నాడని, తెలంగాణ పోలీసుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నాడని మండిపడ్డారు .పోలీసు లోగోలను మార్చుడు కాదు పోలీసులకు అవసరమైన సాంకేతికతను నిధులను అందించాలి.ఆరోగ్య భద్రత కార్డు కింద రాష్ట్రంలో ఈ సంవత్సరం ఎంత మంది పోలీసులకు చికిత్స అందించారో వైట్‌ ‌పేపర్‌ ‌రిలీజ్‌ ‌చేయండి. ఏక్‌ ‌పోలీస్‌ ఏమైంది అని ప్రశ్నించారు.  తొలగించిన పోలీసులను, సస్పెండ్‌ ‌చేసిన పోలీసులను తిరిగి ఉద్యోగాలకు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ ‌చేశారు.

ప్ర‌దాన వార్త‌లు

గోటితో పోయే దాన్ని గోడ్డ‌లి వ‌ర‌కు తెచ్చారు... బ‌న్నీ అరెస్ట్‌ వివాదంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com