టీఎస్, న్యూస్:ఎమ్మెల్సీ కవితను సీబీఐ అదుపులోకి తీసుకోవడాన్ని సవాల్ చేస్తూ ఆమె తరఫున న్యాయవాది సీబీఐ ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కవిత సీబీఐ అరెస్టుపై అత్యవసర విచారణ జరపాలని కవిత తరఫున న్యాయవాది మోహిత్‌రావు కోర్టును కోరారు. అయితే, ప్రత్యేక జడ్జి మనోజ్‌కుమార్ బెంచ్ ముందు దరఖాస్తు పిటిషన్ దాఖలు చేశారు. అయితే, ఈ కేసులో ఎలాంటి ఉపశమనం ఇవ్వలేనని జడ్జి తెలిపారు. కేసు గురించి తనకు ఎలాంటి విషయాలు తెలియవని.. తన ఎదుట అత్యవసర తీర్పులపైనే వాదనలు జరుగుతున్నాయని జడ్జి పేర్కొన్నారు.
Also Read: Phone Tapping Case: ఇక ఫైనల్ లిస్ట్
శుక్రవారం రెగ్యులర్ కోర్టు ముందు దరఖాస్తు చేయాలని న్యాయమూర్తి సూచించారు. ఇదిలా ఉండగా.. కవితను సీబీఐ గురువారం కస్టడీ లోకి తీసుకున్నది. Judicial custody in Tihar Jail తీహార్ జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న కవితను సీబీఐ ప్రత్యేక కోర్టు అనుమతితో ఈ నెల 6న కవితను ప్రశ్నించిన విషయం తెలిసిందే. తాజాగా ఆమెను అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొంది.