Saturday, May 4, 2024

ప్రయాణికులకు శుభవార్త చెప్పిన దక్షిణ మధ్య రైల్వే

నేటి నుంచి జూలై 01వ తేదీ వరకు
మరిన్ని ప్రత్యేక రైళ్లు అందుబాటులోకి…

దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. వేసవి రద్దీ నేపథ్యంలో వివిధ మార్గాలకు ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు తెలిపింది. ఆయా ప్రత్యేక రైళ్లు ఈ నెల 23 నుంచి జూలై ఒకటో తేదీ వరకు అందుబాటులో ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే వివరించింది. ఆయా ప్రత్యేక రైళ్లను ప్రయాణికులు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేసింది. వేసవి సెలవుల నేపథ్యంలో రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకువస్తోంది. తాజాగా సికింద్రాబాద్ -టు ముజఫరాబాద్, ముజఫరాబాద్ -టు సికింద్రాబాద్, గోరక్‌పూర్- టు మహబూబ్‌నగర్, మహబూబ్‌నగర్ టు గోరక్‌పూర్, కొచ్చువెలి- టు షాలిమార్, షాలిమార్- టు కొచ్చువెలి, బెంగళూరు- టు ఖరగ్‌పూర్, భువనేశ్వర్- టు యెహలంక, హుబ్లీ టు గోమతినగర్, తిన్సుకియా- టు బెంగళూరు, జబల్‌పూర్ టు -కన్యాకుమారితో పాటు వివిధ మార్గాల్లో ప్రత్యేక రైళ్లు నడుస్తా యని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.

ముజఫరాబాద్ టు -సికింద్రాబాద్ (05293)ల మధ్య మంగళవారం ఈ నెల 23 నుంచి జూన్ 25వ తేదీ వరకు పది ట్రిప్పులు నడుస్తాయని దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది. సికింద్రాబాద్- టు ముజఫరాబాద్ (05294) ప్రతి గురువారం ఈ నెల 25వ తేదీ నుంచి జూన్ 27వ తేదీ వరకు రైళ్లు అందుబాటులో ఉంటాయని తెలిపింది. గోరక్‌పూర్ టు -మహబూబ్‌నగర్ (05303) మధ్య ఈ నెల 20 నుంచి జూన్ 29వ తేదీ వరకు ప్రతి శనివారం రైలు నడిపించ నున్నట్లు చెప్పింది. మహబూబ్‌నగర్ టు -గోరక్‌పూర్ (05304)ల మధ్య ఈ నెల 22 నుంచి జూలై ఒకటి వరకు ప్రతి సోమవారం రైలు అందుబాటులో ఉంటుందని దక్షిణ మధ్య రైల్వే వివరించింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బీజేపీ స‌ర్కార్ తెలంగాణ‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర‌ జ‌రుపుతుందా?

Most Popular