ఎంపీ ఈటల రాజేందర్ ఓ రియల్ ఎస్టేట్ బ్రోకర్ చెంపపై కొట్టడం సంచలనంగా మారింది. పోచారంలోని ఏకశిలానగర్‌లో కొందరు రియల్ ఎస్టేట్ బ్రోకర్లు తమ భూములను ఆక్రమించుకున్నారంటూ పలువురు మంగళవారం ఈటలను ఆశ్రయించారు. దీంతో కోపానికి గురై బ్రోకర్ చెంప చెల్లుమనింపించారు. ఈ సందర్భంగా ఎంపీ ఈటల రాజేందర్ ఉగ్ర రూపం చూపించారు.
ఓ రియల్ ఎస్టేట్ బ్రోకర్ చెంప చెల్లుమనిపించారు. పోచారం మున్సిపాలిటీ పరిధిలోని ఏకశిలా నగర్‌లో రియల్ ఎస్టేట్ బ్రోకర్లు పేదల భూములు ఆక్రమించుకొని ఇబ్బందులకు గురి చేస్తున్నారని స్థానికులు ఈటలకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈటల ఘటనా స్థలానికి వెళ్లి రియల్ ఎస్టేట్ బ్రోకర్లపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిని చెంప దెబ్బ కొట్టారు. ఈటలతో పాటు స్థానికులు, బీజేపీ కార్యకర్తలు సైతం బ్రోకర్లను కొట్టడం కలకలం రేపుతోంది.
ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడుతూ.. పేదల భూములను ఆక్రమించుకుని దౌర్జన్యం చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. అధికారులు బ్రోకర్లకు కొమ్ము కాస్తున్నారని ఆరోపించారు. పోలీస్ కమిషనర్ కు బ్రోకర్లను కలవడానికి సమయం ఉంటుంది.. కానీ, తమను కలవడానికి ఉండదని ఫైర్ అయ్యారు. దొంగ పత్రాలను సృష్టించిన అధికారులను జైల్లో పెట్టాలని డిమాండ్ చేశారు.