- హాంకాంగ్, సింగపూర్‌లో కేసులు
ఆసియాలోని అనేక దేశాల్లో కొత్త కోవిడ్-19 పెరుగుతున్నాయి. ప్రధానంగా హాంకాంగ్‌తో పాటూ సింగపూర్‌లో ఈ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. ఈ రోగుల్లో కోవిడ్ లక్షణాలు తీవ్రంగా ఉండడంతో పాటూ మరణాల రేటు కూడా ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. కోవిడ్ అంటే ఇప్పటికీ జనం గజగజా వణికిపోయే పరిస్థితి. 2019 చివర్లో మన దేశంలోకి ఎంటరైన ఈ వైరస్.. సుమారు రెండేళ్ల పాటు ప్రజలను ముప్పు తిప్పులు పెట్టింది. అలాగే ఎంతో మందిని పొట్టనపెట్టుకుని కరోనా పేరు వింటేనే భయంతో చచ్చిపోయే పరిస్థితికి తెచ్చింది. అయితే గత మూడేళ్లుగా ఈ వైరల్ ప్రస్తావన క్రమంగా తగ్గుతూ వచ్చింది. ప్రస్తుతం కరోనా గురించి దాదాపు మాట్లాకోవడమే మానేశారు. అయితే తాజాగా, కొత్త కోవిడ్ కేసులు పెరుగుతుండడంతో మళ్లీ భయాందోళనలు మొదలువుతున్నాయి. ఆసియా దేశాల్లో ఎంటరైన ఈ కొత్త కోవిడ్ తీవ్ర ప్రభావం చూపుతోందన్న వార్తలు అందరినీ ఆందోళనకు గురి చేస్తున్నాయి.
ఆసియాలో కోవిడ్ కేసులు
ఆసియాలోని అనేక దేశాల్లో కొత్త కోవిడ్-19 పెరుగుతున్నాయి. ప్రధానంగా హాంకాంగ్‌తో పాటూ సింగపూర్‌లో ఈ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. హాంకాంగ్‌లోని సెంటర్ ఫర్ హెల్త్ ప్రొటెక్షన్‌లోని కమ్యూనికేషన్ డిసీజ్ బ్రాంచ్ అధికారులు మాట్లాడుతూ నగరంలో కోవిడ్-19 కేసులు పెరిగిపోవడం ఆందోళనకు గురి చేస్తోందని తెలిపారు. ఈ రోగుల్లో కోవిడ్ లక్షణాలు తీవ్రంగా ఉండడంతో పాటూ మరణాల రేటు కూడా ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.
సింగపూర్‌లో కోవిడ్ కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. సుమారు ఏడాది కాలం తర్వాత మేలో ఆ దేశంలో నమోదైన కేసుల వివరాలను ఆరోగ్య శాఖాధికారులు ప్రకటించారు. మునుపటి వారంతో పోల్చితో మే 3 నాటికి కోవిడ్ కేసులు 28% పెరిగి సుమారు 14, 200కి చేరుకున్నాయని వివరించారు. ఆస్పత్రుల్లో కోవిడ్ బాధితులు 30% పెరిగినట్లు చెబుతున్నారు. మనుషుల్లో రోగ నిరోధక శక్తి తగ్గడం వల్లే ఈ కేసులు పెరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. మరోవైపు ఆసియాలో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. హాంకాంగ్‌కు చెందిన ప్రముఖ పాప్ స్టార్ అయిన ఈసన్ చాన్‌కు కోవిడ్ పాజిటివ్ అని తేలండతో తన తైవాన్ కచేరీలను వాయిదా వేసుకున్నట్లు తెలిసింది. అలాగే బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం.. చైనాలోకి కూడా కొత్త కోవిడ్ వ్యాపించినట్లు తెలిసింది.
మే 4 నాటికి ఐదు వారాల వ్యవధిలో కోవిడ్ కేసులు రెట్టింపు అయినట్లు తెలిసింది. అదేవిధంగా థాయిలాండ్‌లో ఈ ఏడాది రెండు రకాల కోవిడ్ వైరల్‌లు వ్యాప్తి చెందినట్లు ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ దేశంలో గత ఏప్రిల్‌లో సాంగ్‌క్రాన్ అనే పండుగ జరిగింది. ఈ సందర్భంగా ప్రజలు గుంపులు గుంపులుగా కలవడం వల్ల కేసులు మరింత పెరిగినట్లు తెలుస్తోంది. అయితే ఈ కొత్త వైరస్ ప్రభావం తీవ్రంగా ఉంటుందనడానికి సరైన ఆధారాలు మాత్రం లేవు.