జీఓ 317, జీఓ 46 సమస్యల పరిష్కారం కోసం కొత్త వెబ్ పోర్టల్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అందులో భాగంగా ఉద్యోగుల నుంచి ఫిర్యాదులను స్వీకరించడానికి GO317and 46issues. telangana.gov.in అనే వెబ్ పోర్టల్‌ను ఏర్పాటు చేసినట్టు ప్రభుత్వం తెలిపింది.
సిఎం రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జీఓ 317, 46ల బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. మార్చి 14వ తేదీన దామోదర రాజనర్సింహ, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ నేతృత్వంలో కేబినెట్ సబ్ కమిటీని సిఎం ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలోనే కేబినెట్ సబ్ కమిటీ సూచనల మేరకు కొత్త వెబ్ పోర్టల్ ఏర్పాటు చేశారు.