Monday, May 13, 2024
Home Blog Page 132

‘అమరన్’- పవర్ ఫుల్ టీజర్ విడుదల

0

ఉలగనాయగన్ కమల్ హాసన్, సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ ప్రెజెంట్స్ – శివకార్తికేయన్ #SK21 పాన్ ఇండియా మూవీ టైటిల్ ‘అమరన్’- పవర్ ఫుల్ టీజర్ విడుదల

హీరో శివకార్తికేయన్ పుట్టినరోజు సందర్భంగా రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ (“RKFI),  సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ మోస్ట్ ఎవైటెడ్ ప్రాజెక్ట్ “SK21” టైటిల్‌ను రివిల్ చేశారు. టైటిల్, ప్రధాన పాత్రను రివీల్ చేస్తూ కాశ్మీర్ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం టీజర్ ఫిబ్రవరి 16న లాంచ్ చేశారు.  ఈ చిత్రానికి “అమరన్” అనే పవర్ ఫుల్ టైటిల్ పెట్టారు.

ఉలగనాయగన్ కమల్ హాసన్, సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, ఆర్ మహేంద్రన్ నిర్మిస్తుండగా, వకీల్ ఖాన్  గాడ్ బ్లెస్ ఎంటర్‌టైన్‌మెంట్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.రాజ్‌కుమార్ పెరియసామి  దర్శకత్వం వహిస్తున్న  ఈ చిత్రం మేజర్ ముకుంద్ వరదరాజన్ నిజ జీవిత సంఘటనల స్ఫూర్తితో,  రాహుల్ సింగ్, శివ్ అరూర్ రాసిన “ఇండియాస్ మోస్ట్ ఫియర్‌లెస్” సిరీస్‌లోని ఒక అధ్యాయం ఆధారంగా రూపొందించబడింది.

రచయిత-దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామి “అమరన్” చిత్రానికి కథ-స్క్రీన్‌ప్లే కోసం చాలా రిసెర్చ్ చేసి రూపొందిస్తున్నారు. ఇది ఇండియన్ సినిమా మాస్టర్ పీస్‌గా మారడానికి సిద్ధంగా ఉంది.

స్టార్ హీరో శివకార్తికేయన్.. నిజ జీవిత హీరో ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రంలో ఒక ప్రత్యేకమైన పాత్రలో అద్భుతమైన నటనతో ఆకట్టుకోనున్నారు. మునుపెన్నడూ చూడని డిఫరెంట్ అవతార్ లో కనిపిస్తునంరు. మోస్ట్ ట్యాలెంటెడ్ సాయి పల్లవి ఈ చిత్రంలో హీరోయిన్.

అద్భుతమైన టెక్నికల్ టీం ఈ సినిమా కోసం పని చేస్తుంది. స్టార్ కంపోజర్  జి వి ప్రకాష్ మ్యూజిక్ అందిస్తున్నారు,  రాజీవ్ ప్రొడక్షన్ డిజైనర్, సినిమాటోగ్రాఫర్ సిహెచ్ సాయి, ఎడిటర్ ఆర్. కలైవానన్, యాక్షన్ డైరెక్టర్ స్టీఫన్ రిక్టర్, అమృత రామ్ , సమీరా సనీష్‌ కాస్ట్యూమ్ డిజైనర్లు.

‘మేజర్’ లాంటి విజయవంతమైన చిత్రంతో తెలుగు చిత్రసీమలో అరంగేట్రం చేసిన సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ ‘అమరన్’తో తమిళ సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టింది.

రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ 51వ ప్రొడక్షన్ గా వస్తున్న అమరన్, 2022లో ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో తుఫాను సృస్టించిన వారి 50వ వెంచర్ “విక్రమ్” బాటలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కావడానికి సిద్ధమౌతోంది. ప్రొడక్షన్ చివరి దశలో వున్న అమరన్ 2024 వేసవిలో ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ లో విడుదల కానుంది.

శ్రీరంగ నీతులు లిరిక‌ల్ సాంగ్ విడుద‌ల

0

యువ‌త‌రం భావోద్వేగాల‌తో, సినిమాలోని పాత్ర‌ల‌తో త‌మ‌ను తాము ఐడెంటిఫై చేసుకునే క‌థ‌ల‌తో, స‌హ‌జంగా సాగే మాట‌లు, మ‌న‌సుకు హ‌త్తుకునే స‌న్నివేశాల‌తో వ‌చ్చే సినిమాలు చాలా అరుదుగా వుంటాయి. ఇటీవ‌ల విడుద‌లైన  శ్రీ‌రంగ‌నీతులు. ఈ చిత్రం టీజ‌ర్ చూసిన ప్ర‌తి ఒక్క‌రికి త‌ప్ప‌కుండా ఇదే ఫీల్ క‌లుగుతుంది. టీజ‌ర్‌తో  అంద‌రి మ‌న్న‌న్న‌లు పొందిన ఈ చిత్ర యూనిట్ తాజాగా ఈ చిత్రం నుంచి విన‌రా విన‌రా చెబుతా విన‌రా ఈ కాలం శ్రీ‌రంగ‌నీతులు అంటూ కొన‌సాగే సినిమా టైటిల్ సాంగ్‌ను శ‌నివారం విడుద‌ల చేసింది. శ్రీ‌మ‌ణి సాహిత్యం అందించిన ఈ పాట‌కు అజ‌య్ అర‌సాడ సంగీతాన్ని అందించారు.
వైవిధ్య‌మైన సినిమాల‌తో  త‌మ‌కంటూ ఓ గుర్తింపును  క్రియేట్ చేసుకున్న సుహాస్‌, కార్తీక్‌ర‌త్నం,
రుహానిశ‌ర్మ‌, విరాజ్ అశ్విన్‌  ముఖ్య‌తార‌లుగా రూపొందుతున్న చిత్రం శ్రీ‌రంగనీతులు. ప్ర‌వీణ్‌కుమార్ వీఎస్ఎస్ ద‌ర్శ‌కుడు. రాధావి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై వెంక‌టేశ్వ‌ర‌రావు బ‌ల్మూరి  ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిత్రీక‌ర‌ణ పూర్తిచేసుకున్న ఈ చిత్రం విడుద‌ల‌కు సిద్ధ‌మైంది.  ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడ చిత్ర విశేషాల‌ను తెలియ‌జేస్తూ ఈత‌రం యువ‌త వారి ఆలోచ‌న‌ల‌ను, వారి ఎమోష‌న్స్‌ను ఏ విధంగా వుంటున్నాయి అనేది ఈ చిత్రంలో వుండే  పాత్రల ద్వారా చూపిస్తున్నాం.

యూత్‌ఫుల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతున్న చిత్రంలో సినిమాలో వుండే  ఆస‌క్తిక‌ర‌మైన కథ‌, కథ‌నాల‌ను ప్రేక్ష‌కుల‌ను ఎంట‌ర్‌టైన్ చేస్తూనే మ‌న‌సుకు హ‌త్తుకుంటాయి. కొత్త‌ద‌నంతో పాటు పూర్తి క‌మ‌ర్షియ‌ల్ అంశాల‌తో రూపొందించిన చిత్ర‌మిది అన్నారు. నిర్మాత మాట్లాడుతూ నేటి యువ‌త ఆలోచ‌న‌లు, కుటుంబ బంధాలు..ఎంటర్‌టైన్‌మెంట్ ఇలా అన్ని అంశాల క‌ల‌యిక‌తో ద‌ర్శ‌కుడు చిత్రాన్ని అంద‌ర్ని అల‌రించే విధంగా తెర‌కెక్కించాడు.   త‌ప్ప‌కుండా చిత్రం అంద‌రి ఆద‌ర‌ణ పొందుతుంద‌నే న‌మ్మ‌కం వుంది. త్వ‌ర‌లోనే విడుద‌ల తేదిని ప్ర‌క‌టిస్తాం  అన్నారు.  ఈ చిత్రానికి డీఓపీ: టీజో టామీ, సంగీతం: హ‌ర్షవ‌ర్థ‌న్ రామేశ్వ‌ర్‌, అజ‌య్ అర‌సాడ‌, ఎడిటింగ్‌: శ‌శాంక్ ఉప్ప‌టూరి.

కాంగ్రెస్ లోకి ఈటల?

0

టీఎస్, న్యూస్

మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ కాంగ్రెస్ లో చేరుతున్నారన్న వార్త రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. కాంగ్రెస్ నాయకులు మైనంపల్లి హనుమంతరావు, మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి తో ఈటల రాజేందర్ చర్చలు జరుపుతున్న ఫోటో వైరల్ గా మారింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఈటలకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. పార్లమెంటు ఎన్నికల్లో అత్యధిక సీట్లు గెలవడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తుంది.

ఇందులో భాగంగా బిజెపిని టార్గెట్ చేస్తున్నట్లు అవగతం అవుతుంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్, హుజరాబాద్ నియోజకవర్గాల నుండి బరిలో నిలిచి ఈటల ఓడిపోయారు. అప్పటికే తెలంగాణ బిజెపిలో అంతర్గత విభేదాలు తీవ్రస్థాయిలో కొనసాగుతున్నాయి. బండి సంజయ్ – ఈటల వర్గీయుల మధ్య రాజకీయ వైరం ఉన్న విషయం అందరికీ విధితమే. ఈటల రాజేందర్ గత కొంతకాలంగా బిజెపి కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. బిజెపిలోనే కొంతమంది నేతలు పనిగట్టుకుని వ్యతిరేక ప్రచారం చేస్తున్నారని పలు ఇంటర్వ్యూలలో అసహనాన్ని వ్యక్తం చేశారు. పట్న మహేందర్రెడ్డి, మైనంపల్లి హనుమంతరావు, ఈటల రాజేందర్ ముగ్గురు ఉన్న ఫోటో ఇప్పుడు వైరల్ గా మారడంతో కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లడానికి ప్రయత్నిస్తున్నట్లు స్పష్టమవుతుంది .

మైండ్ బ్లోయింగ్ యాక్షన్ సీన్ తో వార్ 2

0

ఫైటర్ చిత్రం విడుదలైన నెలలోనే స్టార్ హీరో హృతిక్ రోషన్ తన తదుపరి చిత్రం కోసం కసరత్తులు మొదలు పెట్టారు. జనవరి 25న విడుదలైన ఫైటర్ చిత్రం థియేటర్స్ లో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న సంగతి తెలిసిందే. హృతిక్ నటించబోయే తదుపరి చిత్రం ఏదో కాదు ఫాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న వార్ 2. రీసెంట్ ఇంటర్వ్యూలో సైతం హృతిక్ ఈ చిత్ర షూటింగ్ గురించి మాట్లాడారు. అతిత్వరలో వార్ 2 మొదలు కాబోతోంది. బహుశా నాకు ఊపిరి తీసుకునే టైం కూడా ఉండదేమో అని తెలిపారు.

2019లో విడుదలైన వార్ చిత్రంలో హృతిక్ ఏజెంట్ కబీర్ పాత్రలో అదరగొట్టారు. ఆ మూవీ గురించి ఆడియన్స్ ఇప్పటికీ మాట్లాడుకుంటున్నారు. హృతిక్, టైగర్ ష్రాఫ్ కలసి నటించిన ఆ చిత్రం అంతలా ప్రభావం చూపింది. దీనితో వార్ 2పై ఆసక్తి పెరిగిపోయింది. వచ్చే వారమే వార్ 2 షూటింగ్ ప్రారంభం కాబోతున్నట్లు తాజాగా చిత్ర యూనిట్ అఫీషియల్ గా ప్రకటించారు.

వార్ 2 లో ఈ సరి హృతిక్ తో పాటు యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా నటిస్తున్నాడు అని చెప్పగానే అంచనాలు తారా స్థాయికి చేరాయి. ఈ స్పై యూనివర్స్ లో తారక్ భాగం కాబోతుండడం ఆసక్తిగా మారింది. యష్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని దర్శకుడు అయాన్ ముఖర్జీ రూపొందిస్తున్నారు.ఈ చిత్రంలో హృతిక్ రోషన్ ని మరింత కొత్తగా చూపించబోతున్నట్లు తెలుస్తోంది. హృతిక్ రోషన్ ఫిబ్రవరి 23 నుంచి వార్ 2 షూటింగ్ లో జాయిన్ అవుతారు. ఈ ఫస్ట్ షెడ్యూల్ లో దర్శకుడు అయాన్ ముఖర్జీ.. హృతిక్ రోషన్ ఇంట్రడక్షన్ సీన్ ని రెండు వారాల పాటు చిత్రికరించబోతున్నారు. ఆడియన్స్ కి గూస్ బంప్స్ తెప్పించే విధంగా మైండ్ బ్లోయింగ్ యాక్షన్ తో హృతిక్ ఇంట్రడక్షన్ ఉండబోతోందట.

స్టార్ హీరో నాగ చైతన్య చేతుల మీదుగా డిఫరెంట్ థ్రిల్లర్ “ఆరంభం” టీజర్ రిలీజ్

0

మోహన్ భగత్, సుప్రిత సత్యనారాయణ్, భూషణ్ కళ్యాణ్, రవీంద్ర విజయ్ కీలక పాత్రల్లో నటిస్తున్న సినిమా “ఆరంభం”. ఈ సినిమాను ఏవీటీ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై అభిషేక్ వి.టి
నిర్మిస్తున్నారు. అజయ్ నాగ్ వి దర్శకత్వం వహిస్తున్నారు. ఒక డిఫరెంట్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఆరంభం సినిమా టీజర్ ను స్టార్ హీరో నాగ చైతన్య ఇవాళ రిలీజ్ చేశారు. టీజర్ ఇంట్రెస్టింగ్ గా ఉందన్న నాగ చైతన్య మూవీ టీమ్ కు బెస్ట్ విశెస్ అందించారు.

హీరో నాగ చైతన్య మాట్లాడుతూ – థ్రిల్లర్, యాక్షన్ ఎలిమెంట్స్ తో “ఆరంభం” టీజర్ చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. కొన్ని క్యారెక్టర్స్ లో గ్రే షేడ్స్ ఉన్నాయి. సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ కొత్తగా ఉన్నాయి. టీజర్ బ్యాక్ గ్రౌండ్ లో రామాయణ స్టోరీ నెరేట్ చేస్తూ ఇంటర్ కట్స్ లో వేసిన విజువల్స్ తో టీజర్ డిఫరెంట్ గా కట్ చేశారు. “ఆరంభం” మూవీ టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్. అన్నారు.

ఇప్పటిదాకా వినని ఒక కథ చెబుతానంటూ ఒక మహిళ చెప్పే కథతో “ఆరంభం” టీజర్ మొదలైంది. శ్రీరాముడు తన అవతారం చాలించి వైకుంఠానికి వెళ్లే సమయం వస్తుంది. హనుమంతుడు తనను వెళ్లనివ్వడని తెలిసి శ్రీరాముడు తన ఉంగరాన్ని ఒక పుట్టలో జారవిడుస్తాడు. ఆ ఉంగరం తెచ్చేందుకు హనుమంతుడు పుట్టలోకి వెళ్లడం, అలా వెళ్తూ పాతాళలోకం చేరుకుంటాడు.అక్కడ వాసుకి హనుమంతుడికి దారి చూపించడం జరుగుతుంది. హనుమంతుడికి పాతాళలోకంలో అనేక ఉంగరాలు కనిపిస్తాయి. వీటిలో శ్రీరాముడి ఉంగరం ఏదని వాసుకిని హనుమంతుడు అడగగా..ఇవన్నీ శ్రీరాముడివే అని వాసుకి చెబుతుంది. ఈ కథ వాయిస్ ఓవర్ వస్తుండగా…”ఆరంభం” టీజర్ లో జైలు, ఒక కేసు వివరాలు, ఇతర క్యారెక్టర్స్, జరగనివి జరిగినట్లు అనిపించే డెజావు ఏంటి అనే అంశాలు చూపించారు. ఇవన్నీ టీజర్ పై ఆసక్తిని కలిగిస్తున్నాయి. త్వరలోనే ఈ సినిమాను థియేటర్స్ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మూవీ టీమ్ ప్లాన్ చేస్తున్నారు.

నటీనటులు – మోహన్ భగత్, సుప్రిత సత్యనారాయణ్, భూషణ్ కళ్యాణ్, రవీంద్ర విజయ్, లక్ష్మణ్ మీసాల, బొడ్డేపల్లి అభిషేక్, సురభి ప్రభావతి తదితరులు

టెక్నికల్ టీమ్
ఎడిటర్ – ఆదిత్య తివారీ, ప్రీతమ్ గాయత్రి
సినిమాటోగ్రఫీ – దేవ్ దీప్ గాంధీ కుండు
మ్యూజిక్ – సింజిత్ యర్రమిల్లి
డైలాగ్స్ – సందీప్ అంగడి
సౌండ్ – మాణిక ప్రభు సిఎస్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – వినయ్ రెడ్డి మామిడి
సీఈవో – ఉజ్వల్ బీఎం
పీఆర్ ఓ – జీఎస్ కే మీడియా
బ్యానర్ – ఏవీటీ ఎంటర్ టైన్ మెంట్
ప్రొడ్యూసర్ – అభిషేక్ వి.టి
దర్శకత్వం – అజయ్ నాగ్ వీ

రాజేంద్ర ప్రసాద్ లవ్@65 ట్రైలర్ రిలీజ్

0

రాజేంద్ర ప్రసాద్, జయప్రద, విఎన్ ఆదిత్య, టీజీ విశ్వ ప్రసాద్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ లవ్ @ 65 ట్రైలర్ లాంచ్

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఒకే సమయంలో చాలా సినిమాలను నిర్మిస్తోంది, యూనిక్ కంటెంట్‌తో చిన్న నుండి మీడియం-రేంజ్ సినిమాలను కూడా రూపొందిస్తున్నారు. రాజేంద్ర ప్రసాద్, జయప్రద ప్రధాన పాత్రల్లో నటించిన లవ్ @ 65 అటువంటి  సరికొత్త కంటెంట్ ఓరియెంటెడ్ మూవీ. బ్లాక్‌బస్టర్‌లను అందించిన దర్శకుడు విఎన్ ఆదిత్య టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ హిలేరియస్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ కు దర్శకత్వం వహిస్తున్నారు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత. ఈరోజు, మేకర్స్ ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్‌ ని విడుదల చేశారు.

ఆయనకి డెబ్బై నిండాయి. ఆవిడకి ఓ అరవై ఐదుదాక వుంటాయి. ఈ ఇద్దరూ కాలనీ నుండి పారిపోయిన ఆసక్తికరమైన సన్నివేశంతో ట్రైలర్ ప్రారంభమవుతుంది. విచారణలో, వారు ఒకరినొకరు ప్రేమిస్తున్నారని, వారి జీవితాంతం ఒకరితో ఒకరు గడపాలని నిర్ణయించుకున్నారని తేలుతుంది. హిలేరియస్ ఎంటర్ టైన్ మెంట్ తో పాటు, మనసును  కదిలించే భావోద్వేగాలు కూడా ఉన్నాయని ట్రైలర్ చూస్తుంటే అర్ధమౌతుంది.

ఈ చిత్రంలో కార్తీక్ రాజు, స్పందన, క్రిష్, నిహంత్రీ రెడ్డి, నారాయణరావు, ప్రదీప్, సాయి శ్రీనివాస్, ప్రీతి నిగమ్ ముఖ్య పాత్రలు పోషించగా, అజయ్, సునీల్ ప్రత్యేక పాత్రల్లో కనిపించనున్నారు.

సుధీర్ చింటూ కథను అందించగా, లక్ష్మీ భూపాల డైలాగ్స్ అందించారు. శ్యామ్ తుమ్మలపల్లి సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. జునైద్ సిద్ధిఖీ ఎడిటర్. సినిమా త్వరలో విడుదలకు సిద్ధమమౌతుంది.

నటీనటులు: రాజేంద్ర ప్రసాద్, జయప్రద, కార్తీక్ రాజు, స్పందన, అజయ్ (అతిథి పాత్ర), సునీల్ (స్పెషల్ ఎప్పిరియన్స్ ), క్రిష్, నిహంత్రీ రెడ్డి, నారాయణరావు, ప్రదీప్, సాయి శ్రీనివాస్, ప్రీతి నిగమ్ తదితరులు.

సాంకేతిక విభాగం:
స్క్రీన్ ప్లే, దర్శకత్వం: వి ఎన్ ఆదిత్య
నిర్మాత: టి జి విశ్వ ప్రసాద్
బ్యానర్: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ
సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల
కథ: సుధీర్ చింటూ
డైలాగ్స్: లక్ష్మీ భూపాల
డీఓపీ: శ్యామ్ తుమ్మలపల్లి
సంగీతం: అనూప్ రూబెన్స్
ఎడిటర్: జునైద్ సిద్ధిఖీ
ఆర్ట్ డైరెక్టర్: జి ఎం శేఖర్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కొల్లి సుజిత్ కుమార్
కొరియోగ్రఫీ: ఎన్ఎస్ఎల్ ప్రవీణ
సాహిత్యం: లక్ష్మీ భూపాల
పీఆర్వో: వంశీ-శేఖర్

దసరా సందర్భంగా ‘దేవర’ అక్టోబర్ 10న విడుదల

0

దసరా సందర్భంగా మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన ‘దేవర’ అక్టోబర్ 10న విడుదల

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ లేటెస్ట్ భారీ చిత్రం ‘దేవర’. ఈ సినిమాతో ఎన్టీఆర్ మరోసారి మాస్ అవతార్‌లో తన సత్తా చాటడానికి సిద్ధమవుతున్నారు. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. మరో బాలీవుడ్ స్టార్ సైప్ అలీ ఖాన్ కీలక పాత్రలో అలరించబోతున్నారు. డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించబోతున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రూపొందుతోంది. అందులో తొలి భాగం ‘దేవర పార్ట్ 1’ ప్రపంచ వ్యాప్తంగా అక్టోబర్ 10న విడుదల కాబోతోంది.

దసరా సందర్భంగా దేవర పార్ట్ 1 అక్టోబర్ 10న తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతోన్నట్టుగా మేకర్లు ప్రకటించారు. ఈ మేరకు రిలీజ్ చేసిన పోస్టర్ ఒకటి నెట్టింట్లో అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది. ఎన్టీఆర్ పోస్టర్‌ను చూసి ఫ్యాన్స్ సంబరపడుతున్నారు. ఈ పోస్టర్ చూస్తుంటే యాక్షన్ సీక్వెన్స్ హై లెవెల్లో ఉండబోతోన్నాయని, ఎన్టీఆర్‌ను మరింత మాస్ కారెక్టర్‌లో చూపించబోతోన్నారని అర్థమైంది.

ఇది వరకే రిలీజ్ చేసిన దేవర గ్లింప్స్ ఏ రేంజ్‌లో ట్రెండ్ అయిందో.. సోషల్ మీడియాలో ఎలాంటి రికార్డులను క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఎన్టీఆర్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న ‘దేవర’ చిత్రంలో ఇంకా ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, టామ్ షైన్ చాకో, నరైన్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్స్‌పై మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ.కె ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనిరుద్ సంగీత సారథ్యం వహిస్తుండగా శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్‌గా, రత్నవేలు సినిమాటోగ్రాఫర్‌గా, సాబు సిరిల్ ప్రొడక్షన్ డిజైనర్‌గా వర్క్ చేస్తున్నారు.

‘పొట్టేల్’ నుండి పవర్ ఫుల్ మాస్ సాంగ్ ‘వవ్వరే’

0

యువ చంద్ర కృష్ణ, సాహిత్ మోత్ఖూరి, నిసా ఎంటర్‌టైన్‌మెంట్స్, ప్రజ్ఞ సన్నిధి క్రియేషన్స్ ‘పొట్టేల్’ నుండి పవర్ ఫుల్ మాస్ సాంగ్ ‘వవ్వరే’ విడుదల

గ్రామీణ నేపథ్యంలో సాగే సినిమాల్లో ఫ్రెష్ నెస్ , హానెస్టీ ఉంటుంది. పల్లెటూరి వాతావరణంలో జరిగే సినిమాల్లో ఎమోషన్స్ పండితే అద్భుతాలు సృష్టిస్తాయి. సాహిత్ మోత్ఖూరి దర్శకత్వం వహించిన పొట్టేల్  గ్రామీణ నేపథ్యంలో కొత్త కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న చిత్రం. ఈ సినిమా ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్‌కి మంచి స్పందన లభించగా, మొదటి సింగిల్ నాగిరో చార్ట్‌బస్టర్‌గా నిలిచింది. ఈ పాట సినిమాలోని రొమాంటిక్ లేయర్‌ని ఆవిష్కరించింది.

మ్యూజికల్ జర్నీలో భాగంగా రెండో సింగిల్ వవ్వరేతో ముందుకు వచ్చారు మేకర్స్. శేఖర్ చంద్ర స్వరపరిచిన వవ్వరే మాస్ ని కట్టిపడేసి పాట. థంపింగ్ బీట్‌లతో ఒక రూరల్ , మాస్ నంబర్‌ను స్కోర్ చేసారు. కాసర్ల శ్యామ్ తన అద్భుతమైన లిరిక్స్ తో విలేజ్ బ్యూటీ ని వర్ణించారు, ఆస్కార్-విన్నింగ్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తన పవర్ ఫుల్ వాయిస్ తో ఇంపాక్ట్ పెంచాడు. యువ చంద్ర కృష్ణ పల్లెటూరి పాత్రలో పర్ఫెక్ట్ అనిపించుకున్న పాటలో తన డ్యాన్స్ స్కిల్స్ చూపించాడు.

నిసా ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై నిశాంక్ రెడ్డి కుడితి, ప్రజ్ఞా సన్నిధి క్రియేషన్స్‌పై సురేష్ కుమార్ సడిగే నిర్మిస్తున్న ఈ చిత్రంలో అనన్య నాగళ్ల కథానాయిక. మోనిష్ భూపతి రాజు సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు. కార్తీక శ్రీనివాస్ ఎడిటర్, నార్ని శ్రీనివాస్ ఆర్ట్ డైరెక్టర్.

తారాగణం: యువ చంద్ర కృష్ణ, అనన్య నాగళ్ల, అజయ్, ప్రియాంక శర్మ, తనస్వి చౌదరి, నోయల్ సీన్, చత్రపతి శేఖర్, శ్రీకాంత్ అయ్యంగార్, జీవన్, రియాజ్, విక్రమ్ తదితరులు.

సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం – సాహిత్ మోత్ఖురి
నిర్మాతలు – నిశాంక్ రెడ్డి కుడితి, సురేష్ కుమార్ సడిగె
బ్యానర్లు – నిసా ఎంటర్‌టైన్‌మెంట్స్, ప్రజ్ఞ సన్నిధి క్రియేషన్స్
సంగీతం- శేఖర్ చంద్ర
సినిమాటోగ్రాఫర్ – మోనిష్ భూపతి రాజు
ఎడిటర్ – కార్తీక శ్రీనివాస్
లిరిక్స్  – కాసర్ల శ్యామ్
ఆర్ట్ డైరెక్టర్ – నార్ని శ్రీనివాస్
ఫైట్స్ – పృథ్వీ, రబిన్ సుబ్బు
పీఆర్వో- వంశీ- శేఖర్
డిజిటల్ మీడియా – హ్యాష్‌ట్యాగ్ మనోజ్

‘ఆ ఒక్కటీ అడక్కు’,  ఫస్ట్ లుక్ గ్లింప్స్ విడుదల

0

అల్లరి నరేష్, మల్లి అంకం, రాజీవ్ చిలక, చిలక ప్రొడక్షన్స్ ఫిల్మ్ టైటిల్ ‘ఆ ఒక్కటీ అడక్కు’,  ఫస్ట్ లుక్ గ్లింప్స్ విడుదల, మార్చి 22న థియేట్రికల్ రిలీజ్

అల్లరి ఈజ్ బ్యాక్. అల్లరి నరేష్ తన గత కొన్ని సినిమాలలో కొన్ని సీరియస్ సబ్జెక్ట్‌లను ప్రయత్నించి తన బిగ్గెస్ట్ ఫోర్ట్ – కామెడీకి తిరిగి వచ్చారు. తన 61వ సినిమా కోసం డెబ్యు డైరెక్టర్ మల్లి అంకంతో చేతులు కలిపారు. అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని చిలక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజీవ్ చిలక నిర్మిస్తున్నారు. భరత్ లక్ష్మీపతి సహ నిర్మాత.

ఈ రోజు, మేకర్స్ చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్, గ్లింప్స్ విడుదల చేసారు. అల్లరి నరేష్ ఫాదర్ ఈవీవీ సత్యనారాయణ కెరీర్ లో ఎపిక్ హిట్ గా నిలిచిన చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’,  ఈ పేరుని ఈ చిత్రానికి టైటిల్ గా పెట్టారు. అల్లరి నరేష్ పాత్రను పరిచయం చేయడంతో పాటు, సినిమా ప్రిమైజ్ ని గ్లింప్స్ ఆసక్తికరంగా పరిచయం చేసింది

అల్లరి నరేష్ పాత్ర పేరు గణ, అతని పెళ్లి గురించి కుటుంబ సభ్యులు, ఇరుగుపొరుగు వారు అడుగుతారు. టైటిల్‌ను రివిల్ చేస్తూ “ఆ ఒక్కటీ అడక్కు…” అని వారికి సమాధానమిచ్చాడు. పెళ్లి అనేది పాన్ ఇండియా సమస్య అని చెప్తాడు, అయితే సినిమా తెలుగులో మాత్రమే విడుదల అవుతుంది. టైటిల్ లాగే, గ్లింప్స్ హిలేరియస్ గా నవ్వులుపూయించింది.

ఫరియా అబ్దుల్లా కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో వెన్నెల కిషోర్, జామీ లీవర్, వైవా హర్ష, అరియానా గ్లోరీ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.

అబ్బూరి రవి రైటర్, సూర్య డీవోపీగా పని చేస్తున్న ఈ చిత్రానికి గోపి సుందర్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ చిత్రానికి చోటా కె ప్రసాద్ ఎడిటర్ కాగా, జె కె మూర్తి ఆర్ట్ డైరెక్టర్.

ఈ చిత్రాన్ని మార్చి 22, 2024న విడుదల చేస్తున్నట్లు గ్లింప్స్ ద్వారా మేకర్స్ అనౌన్స్ చేశారు.

తారాగణం: అల్లరి నరేష్, ఫరియా అబ్దుల్లా, వెన్నెల కిషోర్, జామీ లివర్, వైవా హర్ష, అరియానా గ్లోరీ తదితరులు

సాంకేతిక విభాగం:
దర్శకత్వం – మల్లి అంకం
నిర్మాత – రాజీవ్ చిలక
సహ నిర్మాత – భరత్ లక్ష్మీపతి
బ్యానర్ – చిలక ప్రొడక్షన్స్
రచయిత – అబ్బూరి రవి
ఎడిటర్ – చోటా కె ప్రసాద్
డీవోపీ – సూర్య
సంగీతం – గోపీ సుందర్
ఆర్ట్ డైరెక్టర్ – జె కె మూర్తి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – అక్షిత అక్కి
మార్కెటింగ్ మేనేజర్ – శ్రావణ్ కుప్పిలి
మార్కెటింగ్ ఏజెన్సీ – వాల్స్ అండ్ ట్రెండ్స్
పీఆర్వో – వంశీ-శేఖర్
పబ్లిసిటీ డిజైన్ – అనిల్ భాను

పరశురామ్ చేతుల మీదుగా ‘రవికుల రఘురామ’ మూవీ సాంగ్ లాంచ్ 

0
పాజిటివ్ వైబ్ ప్రొడక్షన్ బ్యానర్ తెరకెక్కుతున్న లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ‘రవికుల రఘురామ’. సినిమా నిర్మాణం పట్ల ఎంతో నిబద్ధత ఉన్న శ్రీధర్ వర్మ సాగి నిర్మాణంలో.. ట్యాలెంటెడ్ డైరెక్టర్ చంద్రశేఖర్ కానూరి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది.
యువ హీరో గౌతమ్ సాగి, అందాల భామ దీప్శిఖా జంటగా నటిస్తున్నారు. మంచి వినోదాన్ని అందించే చిత్రం కావాలని నిర్మాత, దర్శకుడు ఎంతో కష్టపడుతున్నారు. డైరెక్టర్ చంద్రశేఖర్ తన సృజనాత్మకత మొత్తం జోడించి ఈ కథకి ప్రాణం పోస్తున్నారు. అలాగే హీరో హీరోయిన్లు కూడా మంచి పెర్ఫామెన్స్ అందిస్తున్నారు.
వీరందరితో పాటు ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా పనిచేస్తున్న సుకుమార్ పమ్మి అద్భుతమైన పాటలు అందిస్తున్నారు. తన సంగీతాన్ని ఈ చిత్రానికి ఒక సోల్ గా మార్చేస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి ‘చందమామే’ అనే బ్యూటిఫుల్ మెలోడీ సాంగ్ రిలీజ్ అయింది. ఈ లిరికల్ వీడియో క్రేజీ డైరెక్టర్ పరశురామ్ చేతుల మీదుగా లాంచ్ కావడం విశేషం.
డైరెక్టర్ పరశురామ్ ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ని అభినందించారు. చందమామే సాంగ్ వింటుంటే చాలా ప్రామిసింగ్ గా అనిపిస్తోంది. లిరిక్స్, ట్యూన్ ఎంతో అందంగా వినసొంపుగా ఉన్నాయి. ఈ పాట ఆకట్టుకోవడమే కాదు సినిమాపై కూడా ఆసక్తిని పెంచేలా ఉంది. ఈ సాంగ్ ఆకట్టుకోవడంతో రవికుల రఘురామ చిత్ర రిలీజ్ కోసం ఆడియన్స్ ఎదురుచూస్తారని చెప్పడంలో సందేహం లేదు.
https://youtu.be/MHEi56cwDRc?si=ykk3dtT28c3mz7UO