Friday, May 10, 2024
Home Blog Page 131

‘సుందరం మాస్టర్’ చిత్రం పెద్ద విజయాన్ని సాధించాలి

0

డిఫరెంట్ చిత్రాలను ఆదరించే ప్రేక్షకుల సహకారంతో ‘సుందరం మాస్టర్’ చిత్రం పెద్ద విజయాన్ని సాధించాలి : ‘సుందరం మాస్టర్’ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో మెగ్టాసార్ చిరంజీవి

ఆర్ టీ టీం వర్క్స్, గోల్ డెన్ మీడియా పతాకాలపై మాస్ మహారాజా రవితేజ, సుధీర్ కుమార్ కుర్రు నిర్మిస్తున్న చిత్రం ‘సుందరం మాస్టర్’. ఈ చిత్రంలో హర్ష చెముడు, దివ్య శ్రీపాద ప్రధాన పాత్రలు పోషించారు. కళ్యాణ్ సంతోష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఫిబ్రవరి 23న విడుదల కాబోతోంది. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ట్రైలర్‌ను రిలీజ్ అయింది. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో చిత్రయూనిట్ మాట్లాడుతూ..

వీడియో సందేశం ద్వారా చిరంజీవి మాట్లాడుతూ.. ‘ ‘సుందరం మాస్టర్’ ట్రైలర్ చాలా బాగుంది. హర్ష కోసమే ఈ పాత్ర పుట్టినట్టుగా ఉంది. తనకు తాను, తన టాలెంట్‌ను తాను నమ్ముకుని హర్ష ఈ స్థాయికి వచ్చాడు. ఈ రోజు హీరో స్థాయికి ఎదిగాడు. హర్షను నమ్మి నిర్మాత సుధీర్, దర్శకుడు కళ్యాణ్ సంతోష్ ఈ చిత్రాన్ని తీశారు. ఆసాంతం వినోదాత్మకంగా ఈ చిత్రం ఉంటుందని అర్థం అవుతోంది. కామెడీనే కాకుండా ఎమోషన్ కూడా ఇందులో ఉందని చెబుతున్నారు. ఇలాంటి వినూత్న ప్రయోగాలను ఆడియెన్స్ ఎప్పుడూ ఆదరిస్తారు. ఈ చిత్రం పెద్ద విజయాన్ని సాధించాలి’ అని అన్నారు.

హర్ష చెముడు మాట్లాడుతూ.. ‘మా లాంటి కొత్త వాళ్లని, చిన్న సినిమాను ఎంకరేజ్ చేస్తూ ట్రైలర్ రిలీజ్ చేసిన మెగాస్టార్ చిరంజీవి గారికి థాంక్స్. సుందరం మాస్టర్ సినిమా చాలా కొత్త పాయింట్‌తో రాబోతోంది. నేను ఇండస్ట్రీలోకి వచ్చి పదేళ్లు అవుతోంది. ప్రతీ సారి ఏదో కొత్తగా చేయాలని ప్రయత్నిస్తుంటాను. ఈ కథ నా దగ్గరకు వచ్చింది. నాకు నచ్చింది.. కాబట్టి చేశాను. నేను చేయగలిగిన పాత్రలే ఉంటే తప్పకుండా చేస్తాను. సుందరం మాస్టర్ పాత్రను చూస్తే మనలో ఒకరిని చూసినట్టుగానే అనిపిస్తుంది. ఈ చిత్రాన్ని థియేటర్లో చూస్తేనే మజా వస్తుంది. అందరినీ ఆలోచింపజేసే చిత్రం అవుతుంది. కామెడీనే కాకుండా అద్భుతమైన డ్రామా కూడా ఉంటుంది. ఈ సినిమా కోసం టీం అంతా చాలా కష్టపడింది. నేచురల్ లొకేషన్‌కు వెళ్లి షూటింగ్ చేశాం. ప్రతీ పాత్రకు ఎంతో ఇంపార్టెన్స్ ఉంటుంది. మా సినిమాను ఆడియెన్స్ తప్పకుండా చూసి ఆదరించాల’ని అన్నారు.

దివ్య శ్రీపాద మాట్లాడుతూ.. ‘ట్రైలర్ అందరికీ నచ్చుతుంది. ఫీమేల్ లీడ్‌గా ఇది నా మొదటి థియేట్రికల్ రిలీజ్. హర్ష ద్వారా ఈ కథ విన్నాను. విన్న వెంటనే బాగా నచ్చింది. హిట్ అవుతుందని అప్పుడే ఫిక్స్ అయి కంగ్రాట్స్ కూడా చెప్పాను. హర్ష ఈ చిత్రంతో అందరికీ గుర్తుండిపోతాడు. సుందరం మాస్టారు చాలా రోజులు గుర్తుంటాడు. మైనా అనే ఇంత మంచి పాత్రను రాసినందుకు, ఆ పాత్రను నాకు ఇచ్చిన దర్శకుడికి థాంక్స్. అందరూ మా సినిమాను తప్పకుండా చూడండి’ అని అన్నారు.

డైరెక్టర్ కళ్యాణ్ సంతోష్ మాట్లాడుతూ.. ‘ఈ సినిమా కోసం నేను చాలానే రీసెర్చ్ చేశాను. ట్రైబల్ విలేజ్‌‌లో అందరూ ఇంగ్లీష్ అంత ఫ్లూయెన్స్‌గా ఎలా మాట్లాడుతారు అనే దానికి ఓ కారణం ఉంటుంది. అదేంటో సినిమా చూస్తే తెలుస్తుంది. నా చుట్టూ పక్కల చూసిన మనుషుల్ని చూసే ఈ కథను రాసుకున్నాను. ప్రీ ప్రొడక్షన్‌కే చాలా టైం పట్టింది. ఈ సినిమాకు డబ్బు కంటే టైంను ఎక్కువగా పెట్టాం.

నిర్మాత సుధీర్ కుమార్ మాట్లాడుతూ.. ‘రవితేజ గారితో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించాను. ఆయన సహకారం ఎప్పటికీ మరువలేను. ఆల్రెడీ సినిమాను చూశాను. మూవీ చాలా బాగా వచ్చింది. మేం అంతా మెగాస్టార్ చిరంజీవి గారి అభిమానులు. ఆయన ఫోటో పెట్టుకునే షూటింగ్ స్టార్ట్ చేశారు. ఈ రోజు ఆయన మా ట్రైలర్‌ను రిలీజ్ చేయడం ఆనందంగా ఉంది’ అని అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ శ్రీచరణ్ పాకాల మాట్లాడుతూ.. ‘చిన్న సినిమా పెద్ద సినిమా అనేది ఉండదు. ఇది చాలా ప్రయోగాత్మకమైన సినిమా. ఈ సినిమా కోసం ప్రాణం పెట్టి పని చేశాం. ఈ చిత్రంలో చాలా ఎమోషన్ ఉంటుంది. దర్శకుడు కథ చెప్పినప్పుడు, సినిమా చూసినప్పుడు నెక్ట్స్ లెవెల్ అనిపించింది. హర్ష, దివ్య ఇలా అందరూ అద్భుతంగా నటించారు. కొత్తగా ఉండాలనే బాబా సెహగల్ గారితో పాట పాడించాం’ అని అన్నారు.

కెమెరామెన్ దీపక్ మాట్లాడుతూ.. ‘కళ్యాణ్ ఈ పాయింట్‌ను చెప్పినప్పుడు, కథను నెరేట్ చేసినప్పుడు ఎమోషనల్‌గా అయ్యాను. మనిషి అనే వాడు ఎలా పరిణతి చెందుతున్నాడు అనేది చక్కగా చూపించారు. ఇంత మంచి కథను నమ్మి తీసిన నిర్మాత సుధీర్ గారికి థాంక్స్’ అని అన్నారు.

‘ఊరు పేరు భైరవకోన’ ప్రీమియర్స్ కు యూనిమస్ గా బ్లాక్ బస్టర్ రెస్పాన్స్

0

‘ఊరు పేరు భైరవకోన’ ప్రీమియర్స్ కు యూనిమస్ గా బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ రావడం చాలా ఆనందాన్ని ఇచ్చింది:  బ్లాక్ బస్టర్ ప్రీమియర్స్ సక్సెస్ ప్రెస్ మీట్ లో హీరో సందీప్ కిషన్ & టీం

యంగ్ ట్యాలెంటెడ్ సందీప్ కిషన్ మ్యాజికల్ ఫాంటసీ అడ్వెంచర్ మూవీ ‘ఊరు పేరు భైరవకోన’. విఐ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు. కావ్య థాపర్, వర్ష బొల్లమ్మ కథానాయికలుగా నటించారు. హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా లావిష్ స్కేల్ లో నిర్మించారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై అనిల్ సుంకర సగర్వంగా సమర్పిస్తున్నారు. బాలాజీ గుత్తా ఈ చిత్రానికి సహ నిర్మాత.  ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకులలో హ్యుజ్ బజ్‌ను క్రియేట్ చేశాయి. ఇప్పటికే ప్రదర్శించిన ప్రీమియర్స్ కు బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం శుక్రవారం (ఫిబ్రవరి16) ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపధ్యంలో చిత్ర బృందం బ్లాక్ బస్టర్ ప్రీమియర్స్ సక్సెస్ ప్రెస్ మీట్ ని నిర్వహించింది.

బ్లాక్ బస్టర్ ప్రీమియర్స్ సక్సెస్ ప్రెస్ మీట్ లో హీరో సందీప్ కిషన్ మాట్లాడుతూ.. దాదాపు వంద  ప్రీమియర్ షోలు పడ్డాయి. థియేటర్స్ కి వచ్చిన ప్రతి ఒక్క ఆడియన్ కి థాంక్స్. పాటలు, ట్రైలర్ కు మీరు ఇచ్చిన రెస్పాన్స్, మా మీద మీరు పెట్టుకున్న నమ్మకానికి చాలా రుణపడి వున్నాం. ముందుగా చెప్పినట్లే ప్రిమియర్ షో టికెట్ వున్న వారు ఆ టికెట్ తో 20శాతం డిస్కౌంట్ వివాహభోజనంభు లో రిడీమ్ చేసుకోవచ్చు. ఇది నా తరపున ప్రేక్షకులకు చిరు కానుక. ప్రీమియర్స్ కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. నా పెర్ఫార్మెన్స్ ని చాలా మెచ్చుకున్నారు. ఇది చాలా గొప్ప ఆనందాన్ని ఇచ్చింది. మా టీం అందరికీ థాంక్స్.  ప్రీమియర్స్ చూసిన ఆడియన్స్ యూనిమస్ గా సినిమా హిట్, చాలా బావుందని అన్నారు.  చిన్నపిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకూ చూడటానికి ఒక ఫాంటసీ రొమాంటిక్ ఎంటర్ టైనర్ ని తీశాం. ఫ్యామిలీ ఆడియన్స్ అంతా చూసే సినిమా ఇది. ప్రేక్షకులందరీ రెస్పాన్స్ కోసం ఎదురుచుస్తున్నాం” అన్నారు

నిర్మాత అనిల్ సుంకర మాట్లాడుతూ.. ‘ఊరు పేరు భైరవకోన’ ప్రీమియర్స్ అద్భుతమైన స్పంధన వస్తోంది. ఈ స్పంధన ముందే ఊహించాం. సందీప్, ఆనంద్, రాజా.. టీం అంతా చాలా హార్డ్ వర్క్ చేశారు. సెట్స్ అద్భుతంగా వున్నాయి. సంగీత దర్శకుడు శేఖర్ చంద్ర గొప్ప మ్యూజిక్ ఇచ్చారు. ప్రీమియర్స్ ఈ రేంజ్ లో సక్సెస్ అవ్వడం, ప్రతి ఒక్కరూ సినిమా చాలా అద్భుతంగా వుందని చెప్పడం చాలా పాజిటివ్ సైన్. ప్రీమియర్స్ టార్గెట్ కోటి రూపాయిలకి పైగా హిట్ చేయడం ఆనందాన్ని ఇచ్చింది. రేపు థియేటర్స్ కూడా అద్భుతంగా వుండబోతుంది” అన్నారు.

దర్శకుడు విఐ ఆనంద్ మాట్లాడుతూ.. ప్రీమియర్స్ కు వచ్చిన ఆడియన్స్ అందరికీ థాంక్స్. అన్నీ షోస్ హౌస్ ఫుల్ అయ్యాయి.  మూవీ చుసిన అందరూ అభినందించడం ఆనందాన్ని ఇచ్చింది. నేను చెప్పిన కథ చూసి మొహంలో ఎక్సయిట్ మెంట్ కోసం దర్శకుడినయ్యాను. ఆ ఎక్సయిట్మెంట్ ని ప్రిమియర్స్ రోజు ప్రతి ఆడియన్ మొహంలో చూశాను. ఇది గొప్ప ఆనందాన్ని ఇచ్చింది.  శుక్రవారం సినిమా విడుదలౌతుంది. తప్పకుండా అందరూ చూడాలి’ అని కోరారు.

నిర్మాత రాజేష్ దండా మాట్లాడుతూ… రెండున్నరేళ్లు పాటు కష్టపడి ఈ సినిమా చేశాం. ఇదొక డిఫరెంట్ మూవీ. ఈ మధ్య కాలంలో ఫాంటసీ థ్రిల్లర్ తెలుగులో రాలేదు. సినిమా కంటెంట్ పై వున్న నమ్మకంతో వంద షోస్ పెయిడ్  ప్రీమియర్స్ వేశాం. కోటి రూపాయిలు పైన గ్రాస్ రావడం అనేది ఈ సినిమాకి వున్న క్రేజ్ కి నిదర్శనం. ఇంత మంచి సినిమాని నిర్మించే అవకాశం ఇచ్చిన దర్శకుడు విఐ ఆనంద్ గారికి, ఫ్యామిలీ మెంబర్ లా అన్నిట్లో తోడు వుండే అనిల్ గారికి,  హీరో అనిల్ గారికి.. టీం అందరికీ ధన్యవాదాలు. అందరూ సినిమా చూసి పెద్ద సక్సెస్ ఇవ్వాలని కోరుకుంటున్నాను”

హీరోయిన్ కావ్యా థాపర్ మాట్లాడుతూ.. ఇది చాలా స్పెషల్ మూవీ. దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు. టీం అందరూ ఎంతగానో సపోర్ట్ చేశారు. సందీప్ కిషన్ గ్రేట్ హ్యూమన్ బీయింగ్, యాక్టర్. తప్పకుండా ఈ సినిమా ప్రేక్షకులందరికీ నచ్చుతుంది” అన్నారు.

హీరోయిన్ వర్ష బొల్లమ్మ మాట్లాడుతూ.. ఓ కామన్ ఆడియన్ లా ప్రీమియర్స్ చూశాను. ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. సినిమా అవుట్ అండ్ అవుట్ ఎంజాయ్ చేస్తున్నారు. సినిమా యూనిట్ అందరికీ థాంక్స్. అందరూ సినిమాకి సపోర్ట్ చేయాలి’ అని కోరారు. ఈ ప్రెస్ మీట్ లో చిత్ర యూనిట్ సభ్యులంతా పాల్గొన్నారు.

బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో ఇండియ‌న్ సినిమా త‌ర‌పున అల్లు అర్జున్ ప్రాతినిధ్యం

0

ఇటీవ‌ల పుష్ప చిత్రంలో ఉత్త‌మ న‌ట‌న‌కు గాను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ జాతీయ పుర‌స్కారం అందుకున్న సంగ‌తి తెలిసిందే.భార‌త‌దేశంలో సినీ రంగంలో అత్యున్న‌త పుర‌స్కారంగా భావించే ఈ ఉత్త‌మ‌న‌టుడి పుర‌స్కారం అందుకున్న ఏకైక తెలుగు న‌టుడుగా అల్లు అర్జున్ రికార్డు క్రియేట్ చేసిన సంగ‌తి తెలిసిందే.అయితే తాజాగా ఐకాన్ స్టార్ మ‌రో అరుదైన గౌర‌వాన్ని పొందారు.

అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా భావించే బెర్లిన్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్లో ఇండియ‌న్ సినిమా త‌ర‌పున ప్రాతినిధ్యం వ‌హించే అవ‌కాశం అల్లు అర్జున్‌కు ద‌క్కింది.ఈ సంద‌ర్భంగా ఆయ‌న బెర్లిన్ 74వ ఇంట‌ర్నేష‌న్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో పాల్గొనేందుకు గురువారం జర్మ‌నీకి ప‌య‌న‌మయ్యారుపుష్ప చిత్రంతో ఆయ‌న ప్ర‌తిభ ప్ర‌పంచ‌మంత‌టా గుర్తించిన సంగ‌తి తెలిసిందే.ఆగ‌స్టు 15న విడుద‌ల కానున్న‌పుష్ప‌-2 ,చిత్రంలో ఆయ‌న ప్ర‌పంచ‌మంత‌టా మ‌రింత పాపులారిటిని పొంద‌నున్నారు.

శివకార్తికేయన్-ఏఆర్ మురుగదాస్ పాన్ ఇండియా ఎంటర్‌టైనర్

0

శివకార్తికేయన్ హీరోగా, ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో శ్రీ లక్ష్మీ మూవీస్ పాన్ ఇండియా స్థాయిలో భారీగా నిర్మిస్తున్న చిత్రం నిన్న పూజా కార్యక్రమాలో లాంఛనంగా ప్రారంభమైయింది. తెలుగు, తమిళ్ లో గ్రాండ్ గా రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ ఈ ఉదయం మొదలైయింది.

అనేక బ్లాక్‌బస్టర్ చిత్రాలను అందించి ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో టాప్ లీగ్ యాక్టర్ శివకార్తికేయన్ హీరోగా రాబోయే యాక్షన్ చిత్రం గురించిన వార్తలను విన్న అభిమానులు థ్రిల్ అయ్యారు. షూటింగ్ ప్రారంభమైనట్లు అధికారికంగా ధృవీకరించడం అభిమానులకు గొప్ప ఆనందాన్ని ఇచ్చింది.

దర్శకుడు ఏఆర్ మురుగదాస్ తన పాపులర్ స్టొరీ టెల్లింగ్ స్టయిల్ లో, యునిక్ సెట్టింగ్‌తో చిత్రాన్ని రూపొందించాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ రాబోయే మాస్టర్‌పీస్ హై యాక్షన్-ప్యాక్డ్ అనుభూతిని అందిస్తుంది.

వరుసగా బ్లాక్‌బస్టర్ హిట్‌లను అందజేస్తున్న హీరో శివకార్తికేయన్ కెరీర్‌లో ఇది బిగ్గెస్ట్, గ్రాండియస్ట్ చిత్రం కానుంది. శివకార్తికేయన్ ఇంతకు ముందు చూసినట్లుగా కాకుండా పూర్తిగా ప్రత్యేకమైన, స్టైలిష్  అవతార్ లో కనిపిస్తారు. ట్యాలెంటెడ్ కన్నడ నటి రుక్మిణి వసంత్ ఈ చిత్రంలో కథానాయికగా నటించనున్నారు.

శ్రీ లక్ష్మీ మూవీస్ సంస్థ పాన్ ఇండియా స్థాయిలో భారీ ఎత్తున ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. మ్యూజిక్ కంపోజర్ రాక్‌స్టార్ అనిరుధ్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. సినిమాటోగ్రాఫర్ సుదీప్ ఎలామన్ సినిమాటోగ్రఫీ, శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్, అరుణ్ వెంజరమూడు ఆర్ట్ డైరెక్షన్ వహిస్తున్నారు. ఈ చిత్రానికి మాస్టర్ దిలీప్ సుబ్బరాయన్ కొరియోగ్రాఫ్ చేయనున్నారు.

ఈ సినిమా ఫస్ట్ లెగ్ షూటింగ్ ఇప్పటికే ప్రారంభమై శరవేగంగా సాగుతోంది. మిగతా నటీనటులు, సాంకేతిక నిపుణుల గురించి త్వరలో తెలియజేయనున్నారు మేకర్స్.

‘పద్మ వ్యూహంలో చక్రధారి’

0

యంగ్ ట్యాలెంటెడ్ ప్రవీణ్ రాజ్ కుమార్ హీరోగా శశికాటిక్కో, ఆషు రెడ్డి కీలక పాత్రలలో సంజయ్‌రెడ్డి బంగారపు దర్శకత్వంలో ఓ యూనిక్ ప్యూర్ లవ్ ఎమోషనల్ డ్రామా రూపొందుతోంది. కె.ఓ.రామరాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘పద్మ వ్యూహంలో చక్రధారి’అనే ఆసక్తికరమైన టైటిల్ పెట్టారు. ఈ సందర్భంగా టైటిల్ లాంచ్ ప్రెస్ మీట్ నిర్వహించారు.

ప్రెస్ మీట్ లో ముఖ్య అతిదిగా వచ్చిన దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య మాట్లాడుతూ..’పద్మ వ్యూహంలో చక్రధారి’ టైటిల్ , పోస్టర్ చాలా ఆసక్తికరంగా వున్నాయి. ప్రవీణ్ రాజ్ కుమార్, ఆషు రెడ్డి, శశికా టిక్కో, మదునందన్, భూపాల్ రాజు. చిత్ర బృందం అందరికీ ఆల్ ది బెస్ట్. ఈ సినిమా ఖచ్చితంగా మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం వుంది” అన్నారు,

దర్శకుడు కృష్ణ చైతన్య మాట్లాడుతూ.. ‘పద్మ వ్యూహంలో చక్రధారి’ పేరు చాలా యునిక్ గా వుంది. కంటెంట్ కూడా భిన్నంగా వుంటుంది. ప్రవీణ్ రాజ్ కుమార్ చాలా హార్డ్ వర్క్ చేశారు. ఈ సినిమాలో పని చేసిన అందరికీ ఆల్ ది బెస్ట్. సినిమా పెద్ద విజయం సాధించాలి’ అని కోరారు

ప్రవీణ్ రాజ్ కుమార్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరికి ఫస్ట్ లవ్ వుంటుంది. కొందరు సక్సెస్ అవుతారు, కొందరు ఫెయిల్ అవుతారు. అయితే తన ఫస్ట్ లవ్ వద్దే ఆగిపోయిన ఓ వ్యక్తి అక్కడి నుంచి ఎలా బయటికి వచ్చాడనే పాత్రలో మధునందన్ కనిపిస్తారు. ఆ పాత్ర చాలా గుర్తుండిపోతుంది. ఆషు కూడా చాలా చక్కగా నటించింది. ఈ సినిమాలో పని చేసిన అందరికీ ధన్యవాదాలు. ఈ వేడుకకు వచ్చిన దర్శకుడు కృష్ణ చైతన్య గారికి, శ్రీరామ్ ఆదిత్య, వీర శంకర్ గారు, సుబ్బారెడ్డి అన్నకి థాంక్స్’ తెలిపారు

ఈ చిత్ర దర్శకుడు సంజయ్‌రెడ్డి బంగారపు మాట్లాడుతూ.. ‘పద్మ వ్యూహంలో చక్రధారి’ మంచి కంటెంట్ తో తీసిన సినిమా. చాలా కష్టపడి తీశాం. రాయలసీమ ప్రాంతం అంటే ఇన్నాళ్లు గొడవలు ఫ్యాక్షన్ ఇవే చూశారు ఈప్రాంతంలో ఉన్న  స్వఛ్చమైన ప్రేమని చూపించబోతున్నాం గ్రామీణ నేపథ్యంలో జరిగే ఈ కథని ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాం’ అని కోరారు.

శశికా మాట్లాడుతూ.. ఇందులో సత్య అనే పాత్రలో కనిపిస్తాను. చాలా మంచి కథ, కథనాలతో రూపొందిన ఈ చిత్రం తప్పకుండా ప్రేక్షకులని అలరిస్తుందనే నమ్మకం వుంది. ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు” తెలిపారు.

ఆషు రెడ్డి మాట్లాడుతూ.. ఇందులో పద్మ అనే పాత్ర చేస్తున్నాను. చాలా భిన్నమైన పాత్ర ఇది. ఇంత మంచి పాత్ర నాకు ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు’ తెలిపారు.

దర్శకుడు వీరశంకర్ మాట్లాడుతూ.. కొత్తగా వచ్చిన నిర్మాతలకు మా వంతు హెల్ప్ చేయడానికి ప్రయతిస్తాం. కొత్తగా వచ్చిన నిర్మాతలకు సానుకూల వాతావరణం కల్పించి ఆదరించాలని ఇండస్ట్రీని కూడా కోరుతున్నాను. పద్మ వ్యూహంలో చక్రధారి’ చిత్రo బృందానికి అభినందనలు” తెలిపారు

మధునందన్ మాట్లాడుతూ.. చాలా ప్యాషన్ తో ఈ సినిమాని నిర్మించారు. ఇందులో నా పాత్ర చాలా వైవిధ్యంగా వుంటుంది. దర్శకుడు చాలా యునిక్ కథని ఎంచుకున్నాడు. మంచి భావోద్వేగాలతో కూడిన ఈ సినిమా తప్పకుండా అందరినీ అలరిస్తుందనే నమ్మకం వుంది అన్నారు.

తారాగణం: ప్రవీణ్ రాజ్ కుమార్, శశికాటిక్కూ, ఆషు రెడ్డి, మధునందన్ , భూపాల్ రాజు, ధనరాజ్, రూప లక్ష్మి , మాస్టర్ రోహన్, మురళీధర్ గౌడ్ , మహేష్ విట్టా, వాసు వన్స్ మోర్, బేబీ  ప్రేక్షిత, అబ్బా టీవీ హరి,

దర్శకత్వం: సంజయ్‌రెడ్డి బంగారపు
నిర్మాత.: కె.ఓ. రామరాజు
డీవోపీ: జి.అమర్
సంగీతం: వినోద్ యజమాన్య
ఎడిటర్: SB ఉద్ధవ్
కథ, మాటలు..దర్శన్
కొరియోగ్రఫీ..భాను
ఫైట్స్..నందు
పీఆర్వో : తేజస్వి సజ్జా

 

‘బంగారు గుడ్డు’- ఫస్ట్ లుక్

0

బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు హీరోగా గోపీనాథ్ నారాయణమూర్తి దర్శకత్వంలో న్యూ నార్మల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ, పీవీఎస్ గరుడ వేగ లాంటి సూపర్ హిట్ అందించిన జ్యోస్టార్ ఎంటర్‌ప్రైజెస్‌ బ్యానర్స్ పై కేఎం ఇలంచెజియన్ & ఎం. కోటేశ్వర రాజు తెలుగు, తమిళ ద్విభాష చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హోల్సమ్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి ‘బంగారు గుడ్డు’ అనే క్యాచి టైటిల్ పెట్టారు.

మంచి భావోద్వేగాలతో కూడిన వినోదంతో రూపొందుతున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్, టైటిల్ పోస్టర్ వాలంటైన్స్ డే సందర్భంగా రిలీజ్ చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్ చాలా క్యిరియాసిటీని పెంచింది. వాలంటైన్స్ డే రోజున టైటిల్ లుక్ ని ఎందుకు విడుదల చేశామో సినిమా చూసినప్పుడే ప్రేక్షకులకు అర్ధమౌతుందని దర్శకుడు చెప్పారు.

సంపూర్ణేష్ బాబు బాబుతో పాటు కామెడీ కాదల్ రోబో శంకర్, సురభి శుక్లా, మొట్టై రాజేందర్, చరణ్‌రాజ్, దువ్వాసి మోహన్, సురేఖా వాణి, లొల్లు సభ మారన్, లొల్లు సభ శేషు, లొల్లు సభా మనోహర్, రాములు ఇతర కీలక పాత్రలు పోహిస్తున్నారు. అలనాటి హీరోయిన్ కిరణ్, సంగీత దర్శకుడు షమీర్ టాండన్ ట్యూన్ చేసిన అద్భుతమైన డ్యాన్స్ నంబర్ తో రీఎంట్రీ ఇస్తున్నారు.

ప్రముఖ గీత రచయిత కబిలన్ కొన్ని చాలా మంచి సాహిత్యాన్ని రాశారు. రాకేందు మౌళి తెలుగులో లిరిక్స్ అందిస్తున్నారు. శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ డైరెక్టర్ రైటర్ మోహన్ తెలుగు డైలాగ్స్ రాశారు. ఈ చిత్రానికి అఖిల్ శశిధరన్ సినిమాటోగ్రఫీ అందించారు.

రాయితీపై ట్రాఫిక్ చలాన్ల చెల్లింపున‌కు నేటితో ముగియనున్న గ‌డువు..

0

హైదరాబాద్: రాయితీపై ట్రాఫిక్ చలాన్ల చెల్లింపున‌కు నేటి (గురువారం) అర్ధ‌రాత్రితో గ‌డువు ముగియ‌నుంది. వాహ‌నాల పెండింగ్ చ‌లాన్ల‌పై రాష్ట్ర ప్ర‌భుత్వం భారీ రాయితీ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.

మ‌రోసారి గ‌డువు పొడిగింపు ఉండ‌ద‌ని గ‌తం లోనే అధికారులు తేల్చి చెప్పారు. పెండింగ్ చ‌లాన్ల చెల్లింపుల‌కు నేడు (గురువారం) అర్ధ‌రాత్రి 11:59 గంట‌లకు గ‌డువు ముగియ‌నుంది.

గ‌తేడాది డిసెంబర్ 26 నుంచి పెండింగ్ చలాన్లపై రాయితీ వర్తింప జేసింది ప్ర‌భుత్వం. ఇప్ప‌టికే రెండు సార్లు ప్ర‌భుత్వం గ‌డువు పొడిగింది. ఇక‌పై గ‌డువు పొడిగించ‌బోమ‌ని స్ప‌ష్టం చేసింది.

టూ వీలర్స్‌తో పాటు త్రీవీలర్స్ పై 80 శాతం రాయితీని ఇచ్చింది. కార్లతో పాటు ఇతర వాహనాలకు 60 శాతం రాయితీని ప్రకటించింది. ఇక ఆర్టీసీ బస్సులపై 90 శాతం రాయితీని కల్పించింది సర్కార్..

ప్రేమికుల రోజున ఎమోషనల్ గ్లిమ్స్ తో వచ్చిన “రామం రాఘవం” 

0
స్లేట్ పెన్సిల్ స్టోరీస్ బ్యానర్ పై ప్రభాకర్ ఆరిపాక సమర్పణలో పృథ్వి పొలవరపు నిర్మాణం లో   తెరకెక్కుతున్న ద్విభాష చిత్రం “రామం రాఘవం”.  నటుడు ధనరాజ్ మొదటిసారి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రముఖ నటుడు సముద్రఖని ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.
ప్రేమికుల రోజు సందర్భంగా రామం రాఘవం చిత్ర గ్లిమ్స్ ను హీరో ఉస్తాద్ రామ్ పోతినేని తన ట్విట్టర్ ఖాతాలో డిజిటల్ విడుదల చేసి చిత్రం పెద్ద విజయాన్ని అందుకోవాలని ఆకాంక్షించారు.. అలాగే ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ మీడియా గ్లిమ్ ను రిలీజ్ చేసిన అనంతరం మాట్లాడుతూ… ధనరాజ్ నటుడిగా బిజీగా ఉన్నా.. ఒక మంచి కథను ప్రేక్షకులకు చెప్పాలనే ఉద్దేశంతో రామం రాఘవం సినిమాను తీశారు. గ్లిమ్ చాలా ఆసక్తికరంగా ఉంది, ఎమోషనల్ జర్నీ తో రాబోతున్న ఈ చిత్రం పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను. ప్రేమికుల రోజును తండ్రి కొడుకుల మధ్య ఉన్న బాండింగ్ ను కళ్ళకు కట్టినట్లు చిత్రీకరించిన గ్లిమ్స్ విడుదల చెయ్యడం కొత్తగా ఉందని అభిప్రాయ పడ్డారు.
ఈ సినిమాలో మోక్ష, హరీష్ ఉత్తమన్, సత్య, పృద్వి,  శ్రీనివాసరెడ్డి, చిత్రం శ్రీను, ప్రమోదిని, రాకెట్ రాఘవ, రచ్చ రవి, ఇంటూరి వాసు, తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి విమానం దర్శకుడు శివ ప్రసాద్ యానాల కథ ను సమకూర్చగా అరుణ్ చిలువేరు సంగీతం అందిస్తున్నాడు, మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్. దుర్గా ప్రసాద్ ఈ సినిమాకు కెమెరామెన్. ఇందులోని పాటలను రామజోగయ్య శాస్త్రి రాస్తున్నారు హైదరాబాద్,  అమలా పురం, రాజమండ్రి, రాజోలు, చెన్నై పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటున్న. ‘రామం రాఘవం’తమిళ తెలుగు భాషలలో ఒకేసారి విడుదల కానుంది.