Friday, May 10, 2024
Home Blog

సిట్’ ట్రైలర్ విడుదల

0

హీరోగా పలు సినిమాలతో పలకరించిన అరవింద్ కృష్ణ మరియు రజత్ రాఘవ ఇప్పుడు సస్పెన్స్ థ్రిల్లర్ సిట్ – స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్)అనే చిత్రంతో రాబోతున్నారు. ఎస్‌ఎన్‌ఆర్‌ ఎంటర్‌టైన్మెంట్స్, వైజాగ్ ఫిలిం ఫ్యాక్టరీ, వాసిరెడ్డి సినిమాస్ బ్యానర్స్ పై సంయుక్తంగా ఈ సిట్ సినిమాని నాగిరెడ్డి, తేజ్ పల్లి, గుంటక శ్రీనివాస్ రెడ్డి నిర్మాణంలో తెరకెక్కిస్తున్నారు. విజయ్ భాస్కర్ రెడ్డి దర్శకత్వంలో ఈ సిట్ సినిమా తెరకెక్కుతుంది. సిట్ చిత్రంలో అరవింద్ కృష్ణ పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా కనిపిస్తుండగా రజత్ రాఘవ్ కీలక పాత్రని పోషిస్తున్నారు. నటాషా దోషి ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుండగా రుచిత సాధినేని, అనుక్ రాథోడ్, కౌశిక్ మేకల.. పలువురు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

తాజాగా ఈ సిట్ చిత్ర ట్రైలర్ ని యువ హీరో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ విడుదల చేశారు. విశ్వక్ సేన్ ట్రైలర్ చూసి చాలా ఆసక్తికరంగా ఉందని మూవీ యూనిట్ ని అభినందించారు. ఇక ఈ సిట్ చిత్ర ట్రైలర్ ను చూస్తుంటే..మొదట ఓ అమ్మాయి మర్డర్ కేసు నుంచి ఓపెన్ అయ్యి ఆ తర్వాత సస్పెన్స్ థ్రిల్లర్ గా సాగింది. ఒక అమ్మాయిని రేప్ చేసి మర్డర్ చేస్తే ఆ కేసు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ దగ్గరికి వస్తే అరవింద్ కృష్ణ ఎలా డీల్ చేశాడు అని సస్పెన్స్, థ్రిల్లర్ ఎలిమెంట్స్ కథాంశంతో ఈ సినిమా ఉండబోతున్నట్టు తెలుస్తుంది.

తండేల్’ నుంచి సాయి పల్లవి బర్త్ డే స్పెషల్

0

నాగ చైతన్య, సాయి పల్లవిల జోడి ఇంతకు ముందు ‘లవ్ స్టోరీ’తో ప్రేక్షకులను మంత్రముగ్దులను చేసింది. చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందుతున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘తండేల్’ లో వారి అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్, కెమిస్ట్రీతో మనల్ని ఆలరించబోతున్నారు. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ సమర్పణలో అత్యంత భారీ బడ్జెట్‌తో బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
సాయి పల్లవి పుట్టినరోజు. నిన్న ఒక అందమైన పోస్టర్‌ను విడుదల చేసిన మేకర్స్ ఈ రోజు ఒక ప్రత్యేకమైన పుట్టినరోజు వీడియోను విడుదల చేశారు. వీడియో ప్రారంభంలో సాయి పల్లవి మునుపటి సినిమాల్లోని ఐకానిక్ పాత్రలను ప్రజెంట్ చేస్తోంది. ఆ తర్వాత ఆమెను తండేల్ బుజ్జి తల్లి (సత్య)గా పరిచయం చేశారు. సాయి పల్లవి అద్భుతమైన నటి.

ఆమె ఏడ్చినప్పుడు మనల్ని ఏడిపించి, నవ్వితే మన ముఖాల్లో చిరునవ్వు తెప్పించే పెర్ఫార్మర్. వీడియోలో పిల్లలతో సరదాగా సమయం గడపడం, వారితో ఆడుకోవడం ఆమెలోని మంచి హ్యూమన్ బీయింగ్ ని సూచిస్తున్నాయి. వీడియో చివరిలో నాగ చైతన్య, సాయి పల్లవి మధ్య ఒక అందమైన సన్నివేశాన్ని చూపుతుంది. గొప్ప నటిగానే కాకుండా గ్రేట్ హ్యూమన్ బీయింగ్ గా ఉండే సరికొత్త సాయి పల్లవిని ఈ పుట్టినరోజు స్పెషల్ వీడియో మనకు పరిచయం చేస్తోంది. సాయి పల్లవి ప్రెజెన్స్ సినిమాకు హ్యుజ్ మైలేజ్ ఇస్తుంది. చై, సాయిపల్లవి జోడి మరో సారి తెరపై మ్యాజిక్ క్రియేట్ చేస్తుందని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. క్రియేటివ్ డైరెక్టర్ చందూ మొండేటి దర్శకత్వంలో ‘తండేల్’ అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌ని ఇవ్వబోతోంది. ప్రేమకథే కాకుండా ఈ సినిమాలో చాలా అంశాలు ఉన్నాయి.

‘మాయావన్’ స్ట్రైకింగ్ టీజర్ విడుదల

0

హీరో సందీప్ కిషన్, క్రియేటివ్ డైరెక్టర్ సివి కుమార్ వారి కాంబినేషన్‌లో వచ్చిన సెన్సేషనల్ హిట్ ప్రాజెక్ట్‌జెడ్/మాయవన్‌ తర్వాత సెకండ్ పార్ట్ కోసం మరోసారి చేతులు కలిపారు. ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అత్యంత భారీ బడ్జెట్‌తో ‘మాయవన్‌’ పేరుతో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ మాయవన్ వరల్డ్ నేపధ్యంలో వుంటుంది. ఈ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్‌ను అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ సమర్పిస్తోంది. రాంబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. కిషోర్ గరికిపాటి (జికె) ఎగ్జిక్యూటివ్ నిర్మాత.

సందీప్ కిషన్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, మేకర్స్ ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ లుక్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. ఈరోజు వారు సినిమా టీజర్‌ను విడుదల చేశారు. టీజర్ మాయవన్ ప్రపంచాన్ని, అందులోని ప్రధాన పాత్రలను కూడా పరిచయం చేస్తుంది. మంచులో ఉన్న సైన్స్ ల్యాబ్‌ను చూపడంతో టీజర్ ఓపెన్ అయ్యింది. అక్కడ మెదడును ఒక వ్యక్తి నుండి మరొకరికి బదిలీ చేయడానికి ప్రయోగాలు జరుగుతున్నాయి. నీల్ నితిన్ ముఖేష్ పోషించిన సూపర్‌విలన్‌కు సూపర్ పవర్స్ ఉన్నాయి, అయితే సందీప్ కిషన్ పోషించిన సామాన్యుడు కూడా చివరికి కొన్ని పవర్స్ తో వస్తాడు. ఆకాశ రంజన్ కపూర్‌తో సందీప్ కిషన్ లవ్ ట్రాక్‌ను కూడా చూపించారు. టీజర్ ఇంటెన్స్ యాక్షన్ బ్లాక్‌తో యాక్షన్-ప్యాక్డ్ నోట్‌తో ముగుస్తుంది. టీజర్ సినిమాపై చాలా క్యురియాసిటీని కలిగిస్తుంది. సందీప్ కిషన్ అద్భుతమైన స్టంట్స్ చేస్తూ మ్యాన్లీగా కనిపించారు. సి.వి.కుమార్ వండర్ ఫుల్ వరల్డ్ ని సృష్టించారు. విజువల్స్ కన్నుల పండగలా వున్నాయి.

పవన్‌ సినిమాల డేట్స్‌

0

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ రాజకీయ క్షేత్రంలో బిజీగా ఉన్నారు. 2024 ఎన్నికలలో కూటమిని అధికారంలోకి తీసుకురావడానికి, జనసేన పార్టీకి బలమైన ప్రాతినిధ్యం ఉండేలా చేయడానికి గట్టి ప్రయత్నం చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. మే 13న ఎన్నికల పోలింగ్ జరగనుంది. పోలింగ్ తర్వాత రాజకీయ నాయకులు అందరూ ఎన్నికల రిజల్ట్ వరకు రిలాక్స్ అవుతారు. ఎన్నికల ఫలితాల తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొంత గ్యాప్ తీసుకొని పెండింగ్ సినిమా షూటింగ్ లు పూర్తి చేసే పనిలో ఉంటారనే టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సుజిత్ దర్శకత్వంలో ఓజీ, క్రిష్, జ్యోతికృష్ణ దర్శకత్వంలో హరిహరవీరమల్లు, హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు చేస్తున్నారు.

ఈ మూడు సినిమాలు ఈ ఏడాదిలోనే పూర్తి చేసేస్తారనే ప్రచారం నడిచింది. అయితే ప్రస్తుతం మరో కొత్త టాక్ తెరపైకి వచ్చింది. ఎన్నికల తర్వాత పవన్ కళ్యాణ్ మూడు నెలల పాటు గ్యాప్ తీసుకోనున్నారంట. ఏ విధంగా చూసుకున్న సెప్టెంబర్ లేదా అక్టోబర్ నుంచి మాత్రమే అతను కమిట్ అయిన సినిమాలకి కాల్ షీట్స్ ఇవ్వనున్నారనే మాట వినిపిస్తోంది. ఓజీ మూవీ సెప్టెంబర్ 27న రిలీజ్ చేస్తామని ప్రకటించారు. అలాగే హరిహర వీరమల్లు ఈ ఏడాది ఆఖరులో రిలీజ్ అవుతుందని రీసెంట్ గా టీజర్ తో కన్ఫర్మ్ చేశారు. అయితే ఇప్పుడు ఈ రెండు చిత్రాలు 2024లో ప్రేక్షకుల ముందుకి వచ్చే ఛాన్స్ లేనట్లు కనిపిస్తోంది. ఓజీ మూవీ రిలీజ్ ని 2025 ఆరంభంకి వాయిదా వేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగే హరిహర వీరమల్లు సినిమా 2025 సమ్మర్ లో ఉండొచ్చనే మాట వినిపిస్తోంది.

పవన్ కళ్యాణ్ ఇచ్చే డేట్స్ బట్టి ఈ సినిమాల రిలీజ్ ఆధారపడి ఉంటుందని ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోన్న మాట. పవన్ కళ్యాణ్ ఓజీ రిలీజ్ వెనక్కి వెళ్లడం వలన అది ఎన్టీఆర్ దేవర చిత్రానికి కలిసొస్తుందని సినీ విశ్లేషకులు అంటున్నారు. దేవర మూవీ అక్టోబర్ 10న రిలీజ్ కన్ఫర్మ్ అయ్యింది.

కాంగ్రెస్‌లో చేరిన అజ్మీరా ఆత్మరాం నాయక్

0

కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ముఖ్యమంత్రి రేవంత్

అజ్మీరా ఆత్మరాం నాయక్‌కు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. అజ్మీరా ఆత్మారాం నాయక్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు. ఆయన 2018,2023 ఎన్నికల్లో రెండు దఫాలుగా బిజెపి తరపున అసిఫాబాద్ నియోజవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఈ నేపథ్యంలోనే ఆయన రాష్ట్ర కార్యవర్గ సభ్యత్వానికి, ప్రాథమిక కేఏసీల సభ్యత్వానికి రాజీనామా చేసి గురువారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ దీపాదాస్ మున్షీని అజ్మీరా ఆత్మరాం నాయక్ గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. అజ్మీరా ఆత్మరాం నాయక్ పాటు సేవాలాల్ సేన రాష్ట్ర ఉపాధ్యక్షుడు భారతీయ జనతా పార్టీ గిరిజన మోర్చా ఆసిఫాబాద్ అసెంబ్లీ ఇంచార్జ్ గుగులోతు రవి నాయక్, మైనార్టీ మోర్చా జిల్లా అధ్యక్షుడు మహబూబ్ అలీలతో పాటు సేవాలాల్ సేన జిల్లా నాయకులు జరుకుల తిరుపతి భారతీయ జనతా పార్టీ యువ నాయకులు మోహన్ వడ్డెర సంఘం జిల్లా అధ్యక్షులు బోదాసు వెంకటి సురేష్ తదితరులు కాంగ్రెస్ పార్టీలో చేరారు.

ఇక మిగిలింది రెండు రోజులే…!

0

గ్రామాలు, పట్టణాల్లో హోరెత్తుతున్న ఎన్నికల ప్రచారం

ఉధృతమైన అన్ని పార్టీల పర్యటనలు

ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయే వరకు

నిత్యం సమావేశాలతో అభ్యర్థుల బిజీ

పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి మిగిలింది ఇక రెండురోజులే…ఈ నెల 13వ తేదీన లోక్‌సభ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఎన్నికల ప్రచారం 11వ తేదీ సాయంత్రం ఐదు గంటలతో ముగియనుంది. ఈ రెండు రోజుల వ్యవధిలో అన్ని పార్టీల నాయకులు తమ ప్రచారాన్ని మరింత ఉధృతం చేశారు. ఇప్పటికే కాంగ్రెస్, బిజెపి, బిఆర్‌ఎస్ అధినేతలు అన్ని జిల్లాలో పర్యటిస్తూ ప్రచారాన్ని ఉధృతం చేయగా, గడువు దగ్గర పడుతుండటంతో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బిజెపి, బిఆర్‌ఎస్ అభ్యర్థులు తమ ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయే వరకూ నిత్యం సమావేశాలతో బిజీబిజీగా ఉంటున్నారు

రాత్రి సమయంలో కార్నర్ మీటింగ్‌లు

నిత్యం ఓటర్లను కలవడానికి అభ్యర్థులు ఉదయం నుంచే తిరుగుతున్నారు. ఎండలు మండుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో గ్రామాలు, పట్టణాల్లో ద్వితీయ శ్రేణి నాయకులతో ప్రచారం చేయిస్తున్నారు. అలాగే రాత్రి సమయాల్లో మున్సిపాలిటీల్లోని ప్రధాన కూడళ్లలో కార్నర్ మీటింగ్‌లు పెడుతూ అభ్యర్థులు ఓట్లను అభ్యర్థిస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో ప్రధాని నరేంద్రమోడీ, సిఎం రేవంత్‌రెడ్డి, మాజీ సిఎం కెసిఆర్ వారివారి పార్టీల అభ్యర్థులకు మద్ధతుగా పలుసార్లు ప్రచారం నిర్వహించారు. సమయం దగ్గరపడిన కొద్ది అభ్యర్ధులందరూ ప్రజాక్షేత్రంలోనే ఉంటున్నారు. పలు నియోజకవర్గాల్లో ద్వితీయ శ్రేణి నాయకులు సైతం ప్రచారంలో పాల్గొనడం విశేషం.

గడపగడపకు ప్రచారం..

ఉదయం 5 గంటల నుంచి రాత్రి 10గంటల వరకు ప్రధాన పార్టీల అభ్యర్థులు ఓటర్లను కలుస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ప్రతి ఇంటికి వెళ్లి తమకు మద్ధతు ఇవ్వాలని వారు కోరుతున్నారు. బిఆర్‌ఎస్ అభ్యర్థి గతంలో వారు చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్తూ ప్రజల మద్దతు కూడగట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇక కాంగ్రెస్ అభ్యర్థి పార్టీ ఈ నాలుగు నెలల్లో అమలు చేస్తున్న ఆరు గ్యారంటీ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. బిజెపి అభ్యర్థి కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వివరిస్తూ ప్రజల్లోకి వెళ్తున్నారు. ప్రతి పార్టీ కార్యకర్తలు, నాయకులు ఇంటింటికీ తిరుగుతూ కరపత్రాలు పంపిణీ చేయడంతోపాటు, తమకే ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థిస్తుండడం విశేషం. ఒకరిని మించి ఒకరు ప్రచారం చేస్తూ ప్రతి నిమిషం ప్రజల్లోనే గడుపుతూ అభ్యర్థులు ప్రజా క్షేత్రంలో ఉంటున్నారు.

హోరెత్తుతున్న మైకులు

ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రతి గ్రామం, పట్టణం మైకులతో హోరెత్తుతోంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు వివిధ వాహనాలను ఏర్పాటు చేసుకొని డీజే మోతలతో వివిధ రకాల పాటలను ప్రచారం చేస్తున్నారు. ప్రతి గ్రామం, మున్సిపాలిటీల్లో తిరుగుతూ ప్రజలకు పాటల ద్వారా అభివృద్ధిని వివరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మూడు ప్రధాన పార్టీలు బహిరంగ సభలు, రోడ్ షోలతో హోరెత్తిస్తున్నాయి. ఆయా పార్టీల నాయకత్వం రోజుకు రెండేసి నియోజకవర్గాలను చుట్టేస్తూ బలమైన వర్గాలే లక్ష్యంగా హామీలు గుప్పిస్తున్నాయి. మరోపక్క గడువులోగా అధిష్టాన పెద్దలతో బహిరంగ సభల నిర్వహణ ద్వారా ఓటర్లను తమ వైపు తిప్పుకొనే వ్యూహాలను అన్ని పార్టీలు అమలు చేస్తున్నాయి.

రాత్రి వేళల్లోనూ..

ఎండలతో ఉష్ణోగ్రతలు పెరిగి సభలు, ప్రచార కార్యక్రమాలకు ఇబ్బందిగా మారడంతో సభలు, సమావేశాలకు జనసమీకరణ, నిర్వహణ అభ్యర్థులకు కష్టతరంగా మారింది. ఇన్ని రోజులుగా ఉదయం వేళల్లో ప్రాంగణాల్లో సభలను అభ్యర్థులు నిర్వహించుకుంటూ వచ్చారు. ప్రచారానికి గడువు దగ్గర పడుతుండటంతో సాయంత్రం రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. చీకటి పడ్డాక ప్రచార సమయం ముగిసే వరకు అభ్యర్థులు గ్రామాల్లో పర్యటిస్తున్నారు. గడువు దగ్గరపడే కొద్దీ ఎండను దృష్టిలో పెట్టుకొని ఉదయాన్నే రోజువారి ప్రణాళిక మేరకు ఆయా గ్రామాలకు వెళ్లి ఉపాధి కూలీలు, రైతులను కలుస్తున్నారు.

చేరికలపై దృష్టి సారిస్తూ..

పార్టీలు ఓటర్లపై ప్రభావం చూపే అంశాలపై దృష్టి పెట్టాయి. బలాన్ని పెంచుకొనే క్రమంలో ఇతర పార్టీల్లో అసంతృప్తులకు గాలం వేస్తూ చేరికలను ప్రోత్సహిస్తున్నాయి. బలమైన సామాజికవర్గాల్లో పెద్ద మనుషులను మూడు పార్టీల అభ్యర్థులు కలుస్తూ అంతర్గత సమావేశాలు నిర్వహిస్తున్నారు.

0

జూన్ 4వ తేదీన ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పడుతుంది

కేంద్రంలో అధికారంలోకి రాగానే రైతులకు మద్ధతు ధర

ఆగస్టు 15వ తేదీ నాటికి రెండు లక్షల రుణమాఫీ

అధికారంలోకి వస్తే మహిళలను లక్షాధికారులను చేస్తాం

డిగ్రీ చదివిన ప్రతి ఒక్క నిరుద్యోగికి శిక్షణ ఇస్తాం

నిరుద్యోగులకు శిక్షణ భృతి కింద రూ.8500లు అందచేస్తాం

నర్సాపూర్, సరూర్‌నగర్ జనజాతర సభలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ

దేశంలో జూన్ 4వ తేదీన ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పడుతుందని, ఆగస్టు 15వ తేదీన నాటికి 30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని, కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే రైతులకు మద్ధతు ధర గ్యారంటీగా ఇస్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ హామీనిచ్చారు. గురువారం నర్సాపూర్, సరూర్‌నగర్‌లో జరిగిన జనజాతర సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ అధికారంలోకి వస్తే ఉపాధి హామీ కూలీ వేతనం రోజుకు రూ.400 వందలకు పెంచుతామని, ఆగస్టు 15 నాటికి రెండు లక్షల రుణమాఫీ జరుగుతుందని, మద్ధతు ధరను చట్టబద్ధత చేస్తామని ఆయన తెలిపారు. తెలంగాణ ప్రజలకు ఏం కావాలో ఢిల్లీలో తాను చేసి పెడతానని ఆయన హామీనిచ్చారు. తాము అధికారంలోకి వస్తే మహిళలను లక్షాధికారులను చేస్తామని రాహుల్ హామీ ఇచ్చారు.

మహిళల అకౌంట్‌లో లక్ష రూపాయలు వేస్తాం

మహిళల అకౌంట్‌లో లక్ష రూపాయలు వేస్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ తెలిపారు. ప్రపంచంలో ఏ ప్రభుత్వం కూడా ఇలా చేయలేదని విప్లవాత్మకమైన మార్పునకు తాము శ్రీకారం చూడతున్నామన్నారు. నిరుద్యోగుల కోసం తాము అద్భుతమైన పథకాన్ని తీసుకువస్తున్నామని రాహుల్ తెలిపారు. డిగ్రీ చదివిన ప్రతి ఒక్కరికి శిక్షణ ఇచ్చి ఉద్యోగం కల్పిస్తామన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే వరకు శిక్షణ భృతి కింద రూ.8500లను అందిస్తామని రాహుల్ హామీనిచ్చారు. ప్రభుత్వ కాలేజీలు, వర్సిటీల్లో ఈ ప్రక్రియ ఉంటుందన్నారు. దేశంలోని పేదల జాబితా తయారు చేస్తామని ఇందుకోసం తెలంగాణలో ప్రతి గ్రామానికి వెళ్తామని, రైతులు, కూలీలు, దళితులు, ఆదివాసీల జాబితాను కూడా తయారు చేస్తామని, ప్రతి కుటుంబం నుంచి ఒక మహిళ పేరును ఎంపిక చేసి ఆ మహిళ ఖాతాలో రూ లక్ష వేస్తామని, ఇలా ప్రతి నెలా రూ. 8,500ల చొప్పున జమ చేస్తామని రాహుల్ తెలిపారు.

ప్రజల సొమ్ము 25 మందికి పంచిన మోడీ

బిజెపి గెలిస్తే రాజ్యాంగం రద్దు చేస్తారని, భారత రాజ్యాంగం కేవలం పుస్తకం కాదని, అది పేద ప్రజల చప్పుడని రాహుల్‌గాంధీ పేర్కొన్నారు. రిజర్వేషన్లు వచ్చింది మన రాజ్యాంగం వల్లేనని, ప్రజలకు అధికారం ఇచ్చింది ఈ రాజ్యాంగమేనని, ఈ రాజ్యాంగం కోసం అంబేద్కర్, గాంధీ, నెహ్రూ లాంటి వాళ్లు తమ చెమటను, రక్తాన్ని దారపోశారని ఆయన అన్నారు. ఎందరో త్యాగాల ఫలితంగా రూపుదిద్దుకున్న రాజ్యాంగాన్ని కాంగ్రెస్ పార్టీ రక్షిస్తుందని ఆయన పేర్కొన్నారు. బిజెపి నేతలు రాజ్యాంగాన్ని సమూలంగా మార్చేస్తామని చెబుతున్నారని, ఈ ఎన్నికలు రెండు అలయన్స్ ల మధ్య జరుగుతున్నాయని రాహుల్ తెలిపారు. ఒకటి రాజ్యాంగాన్ని రక్షించే ఇండియా సమూహమని, రెండోది రాజ్యాంగాన్ని మార్చేయాలనుకునే ఎన్డీఏ అని ఆయన పేర్కొన్నారు. ప్రాథమిక హక్కులన్నీ మనకు రాజ్యాంగం ద్వారానే లభించాయని, అలాంటి రాజ్యాంగాన్ని మార్చితే తాము ఊరుకోబోమని రాహుల్ హెచ్చరించారు. అదానీ, అంబానీ లాంటి 25 మంది కోసం మోడీ రాజ్యాంగాన్ని నడిపారని, ప్రజలకు చెందిన లక్షల కోట్లను పెట్టుబడి దారులకు మోడీ పంచారని ఆయన ఆరోపించారు. పదేళ్ల పాటు ప్రధాని మోడీ అదానీ కోసం పనిచేశారని, దేశంలో విమానాశ్రయాలు, పోర్టుల, ప్రభుత్వ రంగ సంస్థలను ఆదానీకి కట్టబెట్టారని రాహుల్ ఆరోపించారు. దేశంలో సంపదకు కొదవలేదని, ఇన్ని రోజులు ప్రజల డబ్బులను మోడీ పెట్టుబడిదారులకు పంచారన్నారు. మేనిఫెస్టోలో పెట్టిన అన్ని అంశాలను అమలు చేస్తామని, తప్పుడు నిర్ణయాలతో మోడీ నిరుద్యోగం పెంచారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

రెండు సిద్ధాంతాల మధ్య ఈ ఎన్నికలు…

ఈ ఎన్నికలు రెండు సిద్ధాంతాల మధ్య జరుగుతున్నాయని రాహుల్‌గాంధీ పేర్కొన్నారు. ఒక వైపు రాహుల్ గాంధీ, సోనియాగాంధీ , ఖర్గే , రేవంత్ రెడ్డిలు ఉన్నారని ఆయన పేర్కొన్నారు. ఆదివాసీలు, గిరిజనులు, వెనుకబడిన వర్గాల కులగణనను చేస్తే నిజాలు బయటకు వస్తాయని రాహుల్ తెలిపారు. దేశంలో యాభై శాతం మంది ఓబిసిలు, 15 శాతం మంది దళితులు, 8 శాతం ఆదివాసీలున్నారని రాహుల్ తెలిపారు. 15 శాతం మైనార్టీలు, 8 శాతం జనరల్ కేటగిరీ ఉన్నారని, వీరిని కలిపితే మొత్తం 90 శాతం అవుతుందన్నారు. దేశంలో తొంభై శాతం ఉన్న ఆదివాసీలు, వెనుకబడిన వర్గాలకు ప్రాతినిధ్యం లేదన్నారు. అందులో భాగంగానే దేశంలో కులగణన చేయాలన్నదే తమ సంకల్పం అన్నారు. దేశంలో వెనుకబడిన వర్గాల వారి శక్తి ఎంతో తేలాల్సి ఉందన్నారు. కులగణన తర్వాత దేశంలో రాజకీయ చైతన్యం వస్తుందని, దేశంలో తొంభై శాతం సంపద రెండు శాతం మంది దగ్గర ఉందని, దేశాన్ని వారే శాసిస్తున్నారని రాహుల్ తెలిపారు.

చారిత్రాత్మక రాజకీయ చైతన్యానికి కాంగ్రెస్ శ్రీకారం

చారిత్రాత్మక రాజకీయ చైతన్యానికి కాంగ్రెస్ శ్రీకారం చుట్టబోతుందని రాహుల్ తెలిపారు. పేదల స్వప్నాన్ని సాకారం చేసి చూపెట్టబోతున్నామని రాహుల్ తెలిపారు. ప్రపంచంలో ఏ దేశంలో ఇలాంటి ప్రయత్నం ఇప్పటివరకు చేయలేదన్నారు. ఒక్క దెబ్బతో దేశంలో పేదరికాన్ని నిర్మూలించ బోతున్నామన్నారు. ప్రధాని మోడీ దేశంలో కోట్లాది మందిని నిరుద్యోగులు గా మార్చారని, మొదటి ఉద్యోగం పక్కా అన్న నినాదంతో ముందుకు వస్తున్నామని రాహుల్ గాంధీ తెలిపారు.

దేశంపై, సమాజంపై, రాజ్యాంగంపై, రిజర్వేషన్‌లపై దాడి చేయాలని  మోడీ, అమిత్ షాలు బయలుదేరారు

  • మత కలహాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని బిజెపి ప్రయత్నిస్తోంది
  • రాజ్యాంగాన్ని, రిజర్వేషన్‌లను రక్షించే బాధ్యత బాహుబలిది
  • నర్సాపూర్, సరూర్‌నగర్‌లో జరిగిన జనజాతర సభలో సిఎం రేవంత్ రెడ్డి

దేశంపై, సమాజంపై, రాజ్యాంగంపై, రిజర్వేషన్‌లపై దాడి చేయాలని మోడీ, అమిత్ షాలు బయలుదేరారని, రాజ్యాంగాన్ని కాపాడుకునేందుకు, రిజర్వేషన్‌లను రక్షించేందుకు బాహుబలిలా రాహుల్‌గాంధీ ముందుకు వచ్చారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్, సరూర్‌నగర్‌లో గురువారం జరిగిన జనజాతర సభలో సిఎం రేవంత్ మాట్లాడుతూ తెలంగాణలోని నాలుగు కోట్ల ప్రజలు రాహుల్‌కు అండగా నిలిచి రిజర్వేషన్లను కాపాడుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. 15 సెకన్ల సమయమిస్తే, మైనార్టీలను లేకుండా చేస్తామని రాష్ట్రానికి వచ్చిన ఓ బిజెపి ఎంపి మాట్లాడారని అతనిపై ప్రధాని చర్యలు తీసుకోవాలని రేవంత్ డిమాండ్ చేశారు. మత కలహాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని బిజెపి ప్రయత్నిస్తోందని ఆయన ధ్వజమెత్తారు. హైదరాబాద్‌లో మత చిచ్చుపెట్టాలని చూస్తున్న కమలానికి, ఓటర్లు బుద్ధి చెప్పాలన్నారు. బిజెపి పెడుతున్న మతచిచ్చు ఉచ్చులో మనం పడొద్దని ఆయన వ్యాఖ్యానించారు.

బిజెపి ఉచ్చులో పడొద్దు

తెలంగాణ సమాజానికి విజ్ఞప్తి చేస్తున్నా, బిజెపి ఉచ్చులో పడొద్దని సిఎం రేవంత్ విజ్ఞప్తి చేశారు. మత విద్వేషాలు రెచ్చగొట్టే బిజెపి నేతలపై ఎన్నికల అధికారులు కేసులు పెట్టాలని సిఎం రేవంత్ డిమాండ్ చేశారు. కాషాయ పార్టీ తెలంగాణకు ఇచ్చింది, మోడీ తెచ్చింది ఏమీ లేదని, గాడిద గుడ్డు తప్ప అని సిఎం రేవంత్ ఆరోపించారు.

ఈ ఎన్నికలు మనకు జీవన్మరణ సమస్య

పేద ప్రజల కోసం రాహుల్ గాంధీ జీవితాన్ని అంకితం చేశారని, మన రాష్ట్రంలో 14 పార్లమెంట్ స్థానాలు గెలిపించి ఇండియా కూటమిని గెలిపించాలని సిఎం రేవంత్ పిలుపునిచ్చారు. ఈ ఎన్నికలు మనకు జీవన్మరణ సమస్య అని, ఇప్పుడు రాజ్యాంగం ప్రమాదంలో పడిందని ఆయన అన్నారు. రాజ్యాంగాన్ని రక్షించాలంటే కాంగ్రెస్‌ను గెలిపించాలన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బడుగు, బలహీనవర్గాలకు ఇచ్చిన రిజర్వేషన్లపై మోడీ కళ్లు పడ్డాయన్నారు.

మెదక్ పార్లమెంట్ స్థానానికి గొప్ప పేరు

దేశ చరిత్రలో మెదక్ పార్లమెంట్ స్థానానికి గొప్ప పేరుందని, 1980లో మెదక్ నుంచి ఇందిరాగాంధీ బరిలోకి దిగి అధిక మెజార్టీతో గెలిచి ప్రధాని అయ్యారని సిఎం రేవంత్ అన్నారు. ఇందిరాగాంధీ ఎంపిగా ప్రాతినిథ్యం వహించడం వల్లనే మెదక్ పారిశ్రామికంగా అభివృద్ధి చెందిందన్నారు. మెదక్ పార్లమెంట్ లో వేలాది పరిశ్రమలు రావడానికి కారణం మాజీ ప్రధాని ఇందిరాగాంధీ కారణమన్నారు. మెదక్ ఎంపిగా ఉన్నప్పుడే ఇందిరాగాంధీ మరణించారని, గత పదేళ్లుగా బిఆర్‌ఎస్, బిజెపి చేతిలో ఈ ప్రాంతం మగ్గిపోయిందని సిఎం రేవంత్ ఆరోపించారు. దుబ్బాక నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన రఘునందన్ రావు కేంద్రం నుంచి నిధులు తెస్తానని చెప్పి మోసం చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మల్లన్నసాగర్ లో వేలాది మంది రైతుల భూములను ముంచింది బిఆర్‌ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి అని సిఎం రేవంత్ ఆరోపించారు. మన భూములు గుంజుకొని ఆధిపత్యం చెలాయిస్తున్న వెంకట్రామిరెడ్డికి బుద్ధి చెప్పాల్సిన బాధ్యత ఈ ప్రాంతం పై ఉందన్నారు. ఈ ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌కు వెంకటరామిరెడ్డి తప్ప ఇంకో వ్యక్తి దొరకలేదా అంటూ బిఆర్‌ఎస్ నాయకులను సిఎం రేవంత్ ప్రశ్నించారు.

విశ్వనగరంలో బిజెపి వాళ్లు విషం చిమ్ముతున్నారు ?

విశ్వ నగరంలో బిజెపి వాళ్లు విషం చిమ్ముతున్నారని, మనం అన్ని పండుగలు చేస్తున్నాం. హిందూత్వం గురించి బిజెపి వాళ్లు నేర్పాలా అని సిఎం రేవంత్ ప్రశ్నించారు. ఎన్నికలప్పుడే రాముడు, హనుమాన్ జయంతి, బతుకమ్మ పండుగలు బిజెపికి గుర్తుకు వస్తున్నాయన్నారు. దేవుడు గుడిలో ఉండాలి. భక్తి గుండెల్లో ఉండాలి. భిక్షగాళ్ల లాగా రాముడి, హనుమాన్‌ను బిజెపి వాళ్లు వాడుకుంటున్నారని ఆయన ఆరోపించారు. కెసిఆర్ బస్సు యాత్ర చూస్తుంటే తిక్కలోడు తిరునాళ్లకు పోయినట్టే ఉందని సిఎం రేవంత్ ఎద్దేవా చేశారు. ఎంపి ఎన్నికల్లో బిఆర్‌ఎస్ అభ్యర్థులకు డిపాజిట్ గల్లంతు కావడం ఖాయమన్నారు.

ఆర్టీసీకి ఎగనామం

0
  • ఆర్టీసీకి ఎగనామం
  • లీజ్​ చెల్లించని మాజీ ఎమ్మెల్యే జీవన్​ రెడ్డి
  • సీజ్​ చేస్తామని నోటీసులిచ్చిన ఆర్టీసీ
  • విద్యుత్​ సరఫరాను నిలిపివేసిన ట్రాన్స్​కో

టీఎస్​, న్యూస్​:ఆర్మూర్‌లోని మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి మాల్‌ యాజమాన్యానికి ఆర్టీసీ అధికారులు మళ్లీ నోటీసులు జారీ చేశారు. బకాయిలపై నోటీసులు ఇచ్చినా స్పందించకపోవడంతో హైకోర్టు ఆదేశాలతో స్వాధీనం చేసుకునేందుకు సిద్ధమైనట్లు తెలిపారు. ఆర్మూర్‌లోని మాజీ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి మల్టీప్లెక్స్‌కు ఆర్టీసీ అధికారులు నోటీసులు జారీ చేశారు. అద్దె బకాయల చెల్లింపుపై నోటీసులు ఇచ్చినా జీవన్‌రెడ్డి స్పందించకపోవడంతో హైకోర్టు ఆదేశాలతో స్వాధీనం చేసుకునేందుకు వచ్చినట్లు ప్రకటించారు. మే 9వ తేదీన సాయంత్రం వరకు గడువు ఇస్తున్నట్లు తెలిపారు. ఈ గడువు లోగా రూ.3.14కోట్ల బకాయిలు చెల్లించాలని, లేదంటే స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించారు. విజిలెన్స్‌ సెక్యూరిటీ కరీంనగర్‌ రీజియన్‌ అధికారి బాబురావు, డిప్యూటీ రీజియన్‌ మేనేజర్ శంకర్‌, డిపో మేనేజర్‌ ఆంజనేయులు ఇతర అధికారులు ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాల్​కు వెళ్లి నోటీసులు జారీ చేశారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే వివిధ శాఖలపై సమీక్షలు నిర్వహించారు. అందులో మొదట విద్యుత్ అంశంపై చర్చకు రాగా, అందులో ఆర్మూర్‌లోని జీవన్‌ రెడ్డి మాల్‌పై ప్రస్తావన వచ్చింది. ఆర్మూర్‌లోని స్థానిక బస్టాండ్​ను ఆనుకొని ఆర్టీసీకి చెందిన 7,000 చదరపు గజాల స్థలాన్ని 2013లో విష్ణుజిత్‌ ఇన్‌ఫ్రా డెవలపర్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌ అనే సంస్థకు 33 ఏళ్లు లీజుకు ఇస్తూ ఒప్పందం జరిగింది. ఇందులో కొంతకాలం కిందట జీ-1(జీవన్‌రెడ్డి మాల్‌ అండ్‌ మల్టీప్లెక్స్‌) పేరిట భవన నిర్మాణం చేపట్టి సినిమా హాళ్లు, దుకాణాలు ఏర్పాటు చేశారు. అయితే, సంవత్సరం ప్రాతిపదికన ఆర్టీసీకి చెల్లించాల్సిన అద్దె బకాయిలు రూ.7.23 కోట్లకు చేరటంతో సంస్థ అధికారులు లీజుదారు సంస్థకు నోటీసులు ఇస్తూ వచ్చారు. అయినా ఎంతకూ చెల్లించకపోవడంతో గురువారం హెచ్చరిక ప్రకటన చేశారు. ఆర్టీసీ సిబ్బంది మాల్‌ వద్దకు వెళ్లి మైకులో బహిరంగంగా లీజు బకాయిల వివరాలు వెల్లడించారు. వెంటనే చెల్లించకపోతే స్థలాన్ని తిరిగి స్వాధీనం చేసుకుంటామని ఆర్టీసీ అధికారులు హెచ్చరించారు.

విద్యుత్​ బంద్​

అదేవిధంగా విద్యుత్‌ బిల్లుల బకాయిలు రూ.2.5 కోట్ల వరకు ఉండటంతో మాల్​కు గురువారం కరెంట్ సరఫరాను నిలిపివేశారు. ఈ విషయాన్ని సంబంధిత శాఖ ఏడీఈ శ్రీధర్‌ ధ్రువీకరించారు. ఎప్పటికప్పుడు నోటీసులు పంపుతున్నామని, వాయిదాలు కోరడంతో గడువు ఇస్తూ వచ్చామని ఆర్టీసీ, విద్యుత్‌ శాఖ అధికారులు వివరించారు.

రాజ్యాంగంతో పేదలకు బలమైన శక్తి

0
  • రాజ్యాంగంతో పేదలకు బలమైన శక్తి
  • రిజర్వేషన్లు రద్దు చేస్తే ఊరుకోం
  • కేవలం 2 శాతం మంది బిలీనియర్ల చేతిలో దేశ సంపద
  • కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ

టీఎస్​, న్యూస్​ :దేశంలో రెండు సమూహాల మధ్య ఎన్నికలు జరుగుతున్నాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు. ఒక వర్గం రాజ్యాంగాన్ని రక్షించాలని అంటోందని, మరో సమూహం రాజ్యాంగం అవసరం లేదు, రద్దు చేస్తామని అంటోందని ఆయన దుయ్యబట్టారు. రాజ్యాంగంతోనే దేశంలో పేదలకు బలమైన శక్తి వచ్చిందని, రాజ్యాంగం అనే పుస్తకం మాములు పుస్తకం కాదని, మహా మహా మేధావులు ఏళ్ల తరబడి కృషి చేసి దేశానికి రాజ్యాంగం అందించారని తెలిపారు. ఎంతో గొప్పదైన మన రాజ్యాంగాన్ని మారుస్తామని బీజేపీ నేతలు చెప్తున్నారని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మెదక్ జిల్లా నర్సాపూర్‌లో నిర్వహించిన జనజాతర సభలో పాల్గొన్నారు. విద్య, ఉద్యోగాలు, ఓటుహక్కు అన్నీ మనకు రాజ్యాంగం ద్వారానే వచ్చాయని రాహుల్‌ గాంధీ స్పష్టం చేశారు. రాజ్యాంగంతో పాటు రిజర్వేషన్లు కూడా రద్దు చేయాలని బీజేపీ కుట్ర చేస్తోందని ఆయన దుయ్యబట్టారు. రిజర్వేషన్లు రద్దు చేసేందుకే ప్రభుత్వ రంగ సంస్థలను విక్రయిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వరంగ సంస్థలను విక్రయించి అన్నీ ప్రైవేటుపరం చేస్తున్నారని, క్రమంగా ప్రైవేటీకరణ పెంచి రిజర్వేషన్లు రద్దు చేయాలనేది బీజేపీ ఆలోచన అని పేర్కొన్నారు.

దేశంలో 90 శాతం ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రాజ్యాధికారం దక్కటం లేదని, ఎస్సీ ఎస్టీ బీసీలు మైనార్టీలు ఎంతమంది ఉన్నారో ముందు లెక్కలు తేలాలని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఒకసారి జనగణన చేస్తేనే, ఎవరు ఎంత శాతం ఉన్నారో తెలుస్తుందని తెలిపారు. మోదీ గత పదేళ్లలో విమానాశ్రయాలు, పోర్టులు, భారీ పరిశ్రమలను విక్రయించారని దుయ్యబట్టారు. కేవలం 2శాతం ఉన్న బిలియనీర్ల చేతిలోకి దేశ సంపద అంతా వెళ్తోందని, ప్రపంచంలో ఏ ప్రభుత్వం కూడా ఇంతగా ప్రైవేటును ప్రోత్సహించలేదని తెలిపారు.

బలహీన వర్గాల్లో రాజకీయ చైతన్యం తెచ్చేందుకు కృషి చేస్తున్నట్లు రాహుల్ గాంధీ తెలిపారు. దేశంలోని నిరుపేదలందరితో ఒక జాబితా రూపొందిస్తామని, రైతులు, దళితులు, ఆదివాసీలు, మైనార్టీలతో ఒక జాబితా రూపొందిస్తామన్నారు. ప్రతి పేద కుటుంబం నుంచి ఒక మహిళను ఎంపిక చేసి రూ.లక్ష ఇస్తామని హామీ ఇచ్చారు. మహిళ బ్యాంకు ఖాతాలో రూ.లక్ష డిపాజిట్‌ చేస్తామన్నారు. కుటుంబ ఖర్చుల కోసం ప్రతి పేద మహిళ బ్యాంకు ఖాతాల్లో మహిళల బ్యాంకు ఖాతాల్లో నెలకు రూ.8500 వేస్తామని పేర్కొన్నారు.