Monday, May 13, 2024
Home Blog Page 72

‘స్వయంభూ’లో జాయిన్ అయిన నభా నటేష్

0

‘కార్తికేయ 2’తో దేశవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకున్న నిఖిల్ నటిస్తున్న ‘స్వయంభూ’ ప్రస్తుతం దేశంలోని క్రేజీ ప్రాజెక్ట్‌లలో ఒకటి. లెజెండరీ యోధుడిగా నటిస్తున్న నిఖిల్ పాత్ర కోసం ఆయుధాలు, మార్షల్ ఆర్ట్స్ , గుర్రపు స్వారీలో ఇంటెన్స్ ట్రైనింగ్ తీసుకున్నారు. భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్న ‘స్వయంభూ’ నిఖిల్ 20వ చిత్రం. ఠాగూర్ మధు సమర్పణలో పిక్సెల్ స్టూడియోస్‌పై భువన్ , శ్రీకర్ ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు. స్వయంభూ టాప్-క్లాస్ టెక్నికల్, ప్రొడక్షన్ స్టాండర్డ్స్‌తో రూపొందుతోంది.

ఈ చిత్రంలో సంయుక్త ఒక కథానాయికగా నటిస్తోంది. ఆమె తన పాత్ర కోసం శిక్షణ కూడా తీసుకుంది. మేకర్స్ ఈరోజు ఒక పెద్ద అప్‌డేట్‌తో వచ్చారు. చేతికి గాయమైన నభా నటేష్ మళ్లీ వర్క్ లో చేరారు. ఈ మాస్టర్‌పీస్‌లో ఒక మహిళా ప్రధాన పాత్రను పోషించడానికి ఆమె బోర్డులోకి వచ్చారు. మేకర్స్ ఆమె లుక్ ని రివిల్ చేశారు. నభా గాయం నుంచి కోలుకుని టీంలో చేరినట్లు వీడియోలో ప్రజెంట్ చేశారు. ఈ పాత్ర కోసం ఆమె ట్రాన్స్ ఫర్మేషన్ అద్భుతంగా వుంది. మేకర్స్ విడుదల చేసిన పోస్టర్‌లో, చీరలో నగలతో ఆమె యువరాణిలా కనిపిస్తోంది. నిఖిల్ కూడా వీడియోలో ఆమె లుక్ చూసి ఆశ్చర్యపోతున్నారు.

ఈ చిత్రంలో నభా నటేష్ కీలకమైన, శక్తివంతమైన పాత్రను పోషిస్తోంది. అది పోస్టర్‌లో ఆమె గెటప్, లుక్‌లలో స్పష్టంగా కనిపిస్తుంది. ఆమె పాత్రకు పర్ఫెక్ట్ ఛాయిస్.

ఈ చిత్రానికి కేజీఎఫ్, సలార్ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందించగా, ఎమ్‌. ప్రభాహరన్ ప్రొడక్షన్ డిజైనర్. ఈ చిత్రానికి వాసుదేవ్ మునెప్పగారి డైలాగ్స్ అందిస్తున్నారు.

ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్ర యూనిట్ లో నభా నటేష్ కూడా చేరారు.

మంజుమ్మల్ బాయ్స్ ఎక్స్ ట్రార్డినరీ ఫిల్మ్

0

సౌబిన్ షాహిర్, గణపతి, ఖలీద్ రెహమాన్, శ్రీనాథ్ భాసి ప్రధాన పాత్రలలో చిదంబరం ఎస్ పొదువల్ దర్శకత్వం వహించిన మలయాళ సర్వైవల్ థ్రిల్లర్ ‘మంజుమ్మల్ బాయ్స్’ ఇండస్ట్రీ హిట్ అయ్యింది. మలయాళంలోనే 200 కోట్లకు పైగా గ్రాస్‌తో ఈ సంవత్సరం ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలలో ఒకటిగా నిలిచింది. పరవ ఫిలింస్‌ పతాకంపై బాబు షాహిర్‌, సౌబిన్‌ షాహిర్‌, షాన్‌ ఆంటోని నిర్మించిన ఈ చిత్రం తమిళంలో కూడా మంచి విజయం సాధించింది. పాన్ ఇండియా ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ తెలుగు ప్రేక్షకులకు ముందు ఈ సర్వైవల్ థ్రిల్లర్‌ను తీసుకువస్తోంది. తెలుగు వెర్షన్‌ను నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి సమర్పిస్తున్నారు. ఏప్రిల్ 6న తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేపధ్యంలో మేకర్స్ ప్రీరిలిజ్ ఈవెంట్ ని నిర్వహించారు. నిర్మాతలు వివేక్ కూచిభొట్ల , శశిధర్ రెడ్డి, నవీన్ యెర్నేని, నిరంజన్ రెడ్డితో పాటు చిత్ర యూనిట్ సభ్యులంతా పాల్గొన్న ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది.

ప్రీరిలీజ్ ఈవెంట్ లో నిర్మాత వివేక్ కూచిభొట్ల మాట్లాడుతూ.. ట్రెమండస్ సక్సెస్ ని అందుకున్న ‘మంజుమ్మల్ బాయ్స్’ టీంకి అభినందనలు. తెలుగు రిలీజ్ కి ఆల్ ది బెస్ట్. మైత్రీ శశి గారు ఈ సినిమా రైట్స్ తీసుకున్నామని చెప్పారు. సినిమా గురించి చాలా గొప్పగా వింటున్నాని చెప్పాను. ఈ మధ్య మలయాళం చిన్న సినిమాలు మంచి విజయాలు సాధిస్తున్నాయి. ఎక్కడికి వెళ్ళిన ప్రేమలు, ‘మంజుమ్మల్ బాయ్స్’ చూశారా అని అడుగుతున్నారు. తెలుగులో కూడా ఇంకా మంచి సినిమాలు వస్తాయి. ఈ సినిమాలని ఆదరిస్తే అటువంటు ధైర్యం మనకీ వస్తుంది. టీం అందరికీ మరోసారి ఆల్ ది బెస్ట్’’ తెలిపారు.

యాక్టర్ శ్రీనాథ్ భాసి మాట్లాడుతూ.. మీ అందరి ఆదరణకు ధన్యవాదాలు. పాటలు, ట్రైలర్ అన్నీ అద్భుతంగా వున్నాయి. తెలుగు వెర్షన్ చూడటానికి మేము ఆసక్తిగా ఎదురుచుస్తున్నాం’’ అన్నారు.

యాక్టర్ అరుణ్ కురియన్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఈ వేడుకని ఇంత ఘనంగా నిర్వహించిన మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలకు ధన్యవాదాలు. తప్పకుండా అందరూ సినిమా చూసి మమ్మల్ని సపోర్ట్ చేయాలి’’ అని కోరారు

విష్ణు రవి మాట్లాడుతూ.. ఈ సినిమాలో భాగం కావడం ఆనందంగా వుంది. మీరు కూడా ఈ సినిమాని ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను. అందరూ థియేటర్స్ లోనే చూడండి, మైత్రీ మూవీ మేకర్స్ కి ధన్యవాదాలు’ తెలిపారు

నిర్మాత శశిధర్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ సినిమా రైట్స్ కొనుగోలు చేయడానికి హెల్ప్ చేసిన షాన్, అనుప్ లాల్ కి ధన్యవాదాలు. మొదటి రోజు ఈ సినిమా చూసిన వెంటనే సినిమాని తెలుగులో విడుదల చేయాలని నిర్ణయించుకున్నాం. రవి గారు నవీన్ గారు ఈ సినిమాని ఇక్కడ గ్రాండ్ గా ప్రమోట్ చేయాలని నిర్ణయించారు. ఇది బ్లాక్ బస్టర్ అని ముందే అనుకున్నాం. ఈ సినిమాకి లాంగ్వేజ్ బారియర్ లేదు. ఇది పదిమంది బాల్య స్నేహితులకు సంబధించిన కథ. ఇలాంటి స్నేహితులు జీవితంలో వుండాలని ఎవరైనా కోరుకుంటారు. నా జీవితంలో రవి కూడా లాంటి గొప్ప స్నేహితుడు. నిరాశలో వున్న కాలంలో ఎంతో స్ఫూర్తిని ఇచ్చారు. ఈ రకంగా ఈ సినిమా నా మనుసుకి చాలా దగ్గరరైయింది. ఏప్రిల్ 6న తెలుగులో సినిమా విడుదలౌతుంది. ఏప్రిల్ 5న ప్రిమియర్స్ కూడా వేస్తున్నాం. మలయాళం సినిమా పెయిడ్ ప్రిమియర్స్ వేయడం ఇదే తొలిసారి. ఇది బిగ్ ఎచీవ్మెంట్. ఇది డబ్బింగ్ సినిమాల కాకుండా స్ట్రయిట్ సినిమాలనే దాదాపు 300 వందల స్క్రీన్స్ లో గ్రాండ్ గా విడుదల చేస్తున్నాం. ఈ సినిమా కోసం మాతో కలసి పని చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఇది చాలా పెద్ద సినిమా. అందుకే ఎక్కడా రాజీపడకుండా మైత్రీ సొంత సినిమాలానే చేశాం. అందరికీ ధన్యవాదాలు’’ తెలిపారు

నిర్మాత నవీన్ యెర్నేని మాట్లాడుతూ.. ఈ సినిమాని యుఎస్ లో చూశాను. ఎక్స్ ట్రార్డినరీ ఫిలిం. ఈ మధ్య కాలంలో చూసిన బెస్ట్ ఫిలిం. సినిమా యూనిట్ అందరికీ అభినందనలు. ఈ సినిమా ఇప్పటికే 200 కోట్లకు పైగా కలెక్ట్ చేసి బిగ్ హిట్ అయ్యింది. తెలుగు లో కూడా పెద్ద విజయాన్ని సాధిస్తుంది. తెలుగు ప్రేక్షకులందరు ఇష్టపడతారు. విజువల్స్, మ్యూజిక్ ఎక్స్ ట్రార్డినరీ. ఏప్రిల్ 6న సినిమా రిలీజ్ చేస్తున్నాం. తప్పకుండా థియేటర్స్ కి వచ్చి చూడండి. ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తారు’ అన్నారు.

నిర్మాత నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. ‘మంజుమ్మల్ బాయ్స్’ టీంకు అభినందనలు. తెలుగు వెర్షన్ ని విడుదల చేయడానికి అవకాశం ఇచ్చిన షాన్ కు ధన్యవాదాలు. ఏప్రిల్ 6న సినిమా విడుదలౌతుంది. 5న స్పెషల్ ప్రిమియర్స్ వేస్తున్నాము. మలయాళంలానే తెలుగులో కూడా సినిమా పెద్ద విజయం సాధిస్తుందని భావిస్తున్నాం.

దర్శకుడు చిదంబరం మాట్లాడుతూ.. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలకు ధన్యవాదాలు. మాకు ఇంత గొప్పగా స్వాగతం పలికిన అందరికీ ధన్యవాదాలు. అందరూ ఏప్రిల్ 6న థియేటర్స్ కి వచ్చి ‘మంజుమ్మల్ బాయ్స్’ నమి చూడండి. మీ స్పందన కోసం ఎదురుచూస్తున్నాం” అన్నారు.

డైరెక్టర్ పరశురామ్ లేకుంటే “ఫ్యామిలీ స్టార్” లేదు

0

డైరెక్టర్ పరశురామ్ లేకుంటే “ఫ్యామిలీ స్టార్” లేదు – విజయ్ దేవరకొండ

సినిమా అనేది డైరెక్టర్ విజన్ అని నమ్మే హీరో విజయ్ దేవరకొండ. అందుకే నిన్న జరిగిన ఫ్యామిలీ స్టార్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దర్శకుడు పరశురామ్ పై ప్రశంసలు కురిపించారు. పరశురామ్ లేకుంటే ఫ్యామిలీ స్టార్ సినిమా లేదని చెప్పారు విజయ్. దూలపల్లి మైసమ్మగూడలోని నరసింహారెడ్డి ఇంజినీరింగ్ కాలేజ్ లో నిర్వహించిన ఈ ప్రీ రిలీజ్ వేడుకలకు పెద్ద సంఖ్యలో స్టూడెంట్స్ హాజరయ్యారు. ఈ సందర్భంగా

హీరో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ – ఫ్యామిలీ స్టార్ నా కెరీర్ లో ఒక ఇంపార్టెంట్ మూవీ. పరశురామ్ నాకు ఈ కథ చెప్పినప్పుడు మా నాన్న గుర్తుకువచ్చాడు. ఈ సినిమాలో నా పర్ ఫార్మెన్స్ నెక్ట్ లెవెల్ అని పరశురామ్ అంటున్నాడు. కానీ నేను చేసిన పర్ ఫార్మెన్స్ కు మొత్తం క్రెడిట్ పరశురామ్ కే ఇవ్వాలి. ఈ సినిమాకు హార్ట్ అండ్ సోల్ పరశురామ్. ఆయన లేకుంటే ఫ్యామిలీస్టార్ సినిమానే లేదు. ఈ సినిమాకు ఎన్ని అవార్డ్స్ వచ్చినా ఆ క్రెడిట్ అంతా పరశురామ్ కే దక్కుతుంది. అన్నారు.

పరశురామ్ తో కలిసి గీత గోవిందం అనే బ్లాక్ బస్టర్ మూవీ చేశారు విజయ్. ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ మీద కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఈ నెల 5వ తేదీన వరల్డ్ వైడ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది ఫ్యామిలీ స్టార్.

విశాఖపట్నంలో ఘోర రోడ్డు ప్రమాదం

0

విశాఖపట్నంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వ్యాన్‌ను ట్రక్కు ఢీకొనడంతో ముగ్గురు మృతి చెందగా, మరో 10 మంది గాయపడ్డారు. ఈ ఘటన పెందుర్తి అక్కిరెడ్డిపాలెంలో జరిగింది. వ్యాన్‌లో ప్రయాణిస్తున్న హనుమంతు ఆనందరావు (45), హనుమంతు శేఖర్‌రావు (15), చింతాడి ఇందు (65) ట్రక్కుని ఢీకొట్టిన ఘటనలో అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

గాయపడిన వారిని వెంటనే చికిత్స నిమిత్తం కేజీహెచ్‌ ఆస్పత్రికి తరలించారు. చనిపోయిన వారంతా ఏలూరు జిల్లా తాళ్లపూడి మండలం తిరుగుడుమెట్ట చెందిన వారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పెందుర్తి పోలీసులు కేసు నమోదు చేశారు. శ్రీకాళం జిల్లా పొందూరులో వివాహానికి వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగిందని పోలీసులు చెప్పారు. ప్రమాదంపై పోలీసులు తదుపరి విచారణ ప్రారంభించారు.

లైంగిక దాడి బాధితురాలిని కోర్టు హాలు లోనే దుస్తులు విప్పమన్న మేజిస్ట్రేట్..

0
  • లైంగిక దాడి బాధితురాలిని కోర్టు హాలు లోనే దుస్తులు విప్పమన్న మేజిస్ట్రేట్..
  • దళిత యువతిపై ముగ్గురు వ్యక్తుల అత్యాచారం..
  • గాయాలు చూపించమన్న మేజిస్ట్రేట్..
  • నిరాకరించి పోలీసులకు ఫిర్యాదు చేసిన యువతి..

అత్యాచార బాధిత యువతి (18) ని దుస్తులు విప్పి గాయాలు చూపించాలని ఆదేశించిన రాజస్థాన్‌ లోని కరౌలి జిల్లా మేజిస్ట్రేట్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. మార్చి 30న బాధిత దళిత యువతి ఫిర్యాదు మేరకు హిందౌన్ కోర్టు మేజిస్ట్రేట్‌పై కేసు నమోదు చేసినట్టు డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్సీ-ఎస్టీ) సెల్ మినా మీనా తెలిపారు.

బాధిత యువతి దుస్తులు విప్పేందుకు నిరాకరించిందని, వాంగ్మూలం నమోదు చేసిన తర్వాత మేజిస్ట్రేట్‌పై ఆమె ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. ఆమె ఫిర్యాదు మేరకు మేజిస్ట్రేట్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభమైనట్టు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. రాజస్థాన్ హైకోర్టు విజిలెన్స్ రిజిస్ట్రార్ అజయ్ సింగ్ జాట్ నేతృత్వం లోని బృందానికి కేసును బదిలీ చేసినట్టు పేర్కొన్నారు. వాంగ్మూలం నమోదు చేసేందుకు నిన్న అజయ్‌ సింగ్ బాధిత బాలికను కలిశారు. కాగా, బాధిత యువతిపై మార్చి 19న ముగ్గురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు..

ఏపీ నుంచి ఎన్నికల్లో పోటీ చేయాలనుంది: మాజీ ఎంపీ జయప్రద..

0

ఏపీ నుంచి ఎన్నికల్లో పోటీ చేయాలనుంది: మాజీ ఎంపీ జయప్రద..

స్టార్ క్యాంపెయినర్‌గా కూడా ఏపీ ఎన్నికల్లో ప్రచారం చేయాలనుందని వెల్లడి.అంతా పార్టీ నిర్ణయంపై ఆధారపడి ఉందని వ్యాఖ్య.పుట్టిన రోజు సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మాజీ ఎంపీ జయప్రద..

రూ. 50 కోట్ల విలువైన గోల్డెన్ టాయిలెట్ చోరీ..!

0

చోరీకి వస్తువు ఏదైతే ఏంటి, బంగారంతో చేసింది అయితే చాలు అనుకున్నాడో దొంగ.. ఏకంగా రూ. 50 కోట్ల విలువైన గోల్డెన్ టాయిలెట్ దొంగిలించాడు. ఇంగ్లండ్ లోని బ్లెన్హెమ్ ప్యాలెస్ కు చెందిన ఈ 18 క్యారెట్ల గోల్డ్ కమోడ్ను 2019లో ఆర్ట్ ఎగ్జిబిషన్ లో ప్రదర్శనకు ఉంచగా జేమ్స్ షీన్ చోరీ చేశాడు. తాజాగా అతను దోషిగా తేలాడు. కాగా రూ. 4.19 కోట్ల విలువైన వస్తువుల చోరీ కేసులో జేమ్స్ 17 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్నాడు.

నేడు ప్రమాణ స్వీకారం చేయనున్న కొత్తగా ఎన్నికైన రాజ్యసభ సభ్యులు..

0

ఢిల్లీ:నేడు ప్రమాణ స్వీకారం చేయనున్న కొత్తగా ఎన్నికైన రాజ్యసభ సభ్యులు.రాజ్యసభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేయనున్న ఏపీకి చెందిన వై.వీ. సుబ్బారెడ్డి, మేడా రఘునాథ రెడ్డి, గొల్ల బాబూరావు.తెలంగాణ నుంచి ఎన్నికైన బీఆర్ఎస్‌ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర..

రాజ్యసభ సభ్యురాలిగా సోనియా గాంధీ ప్రమాణ స్వీకారం..

0

న్యూఢిల్లీ: రాజ్యసభ సభ్యురాలిగా కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ గురువారం ప్రమాణ స్వీకారం చేశారు..

సోనియా గాంధీతో రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ ప్రమాణ స్వీకారం చేయించారు. సోనియా గాంధీ రాజ్యసభ సభ్యురాలిగా బాధ్యతలు చేపట్టడం ఇదే తొలిసారి..

ఈ కార్యక్రమంలో ఏఐసీసీ మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ, ఇతర కాంగ్రెస్ ముఖ్య నేతలు పాల్గొన్నారు..

మరో మైలురాలను సాధించిన ఈసీఐఎల్ సంస్థ

0

2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ. 3వేల కోట్ల టర్నోవర్

నగరంలోని Electronics Corporation of India Limited (ECIL) ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్) సంస్థ మరో మైలురాలను సాధించింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.3వేల కోట్ల టర్నోవర్ ను సాధించి అగ్రగామిగా నిలిచింది. మేక్ ఇండియా స్ఫూర్తితో దేశంలోని పలు పరిశోధన సంస్థలకు కావలసిన ఉత్పత్తులను ఈసీఐఎల్ రూపొందిస్తూ తన ఉనికిని చాటుకుంటుంది.

గత ఆర్థిక సంవత్సరంలో… సాధారణ ఎన్నికలకు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లను, న్యూక్లియర్ ఫ్లవర్ ప్లాంట్లకు కావలసిన రేడియేషన్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ సెక్యూరిటీ సిస్టం , కంట్రోల్ సిస్టమ్స్, కమ్యూనికేషన్ రేడియస్ టూ ఆర్మూర్డ్ ఫోర్సెస్, ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాలతోపాటు పలు భారీ పరిశ్రమలకు తమ ఉత్పత్తులను అందజేసినట్లు తెలిపారు.

ఇందులో అధికంగా ఏరోస్పేస్, డిఫెన్స్, ఆర్మూర్డ్ పో, న్యూక్లియర్, సెంట్రల్ స్టేట్ పోలీస్, పారా మిలిటరీ ఫోర్సెస్, పలు ప్రభుత్వ సంస్థలతో తమ వ్యాపారాలను కొనసాగించినట్లు తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇదే చొరవతో ఈసీఐఎల్ సంస్థ మరింత సరికొత్త పరిజ్ఞానంతో తమ ఉత్పత్తులను అందజేస్తూ ముందుకు సాగుతుందని ఈసీఐఎల్ యాజమాన్యం బుధవారం ఓ ప్రకటనలో పేర్కొంది.