Sunday, April 28, 2024
Home Blog Page 71

హైద్రాబాద్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత

0

* హైద్రాబాద్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత
* ఐడిఎ బొల్లారంలో డ్రగ్స్ కలకలం
* నిఘా సంస్థలను అప్రమత్తం చేసిన ఇంటర్‌పోల్ ..రంగంలోకి దిగిన డిసిఎ అధికారులు
* పిఎస్‌ఎన్ మెడికేర్ పరిశ్రమలో సోదాలు..తనిఖీల్లో భారీగా పట్టుబడ్డ నిషేధిత డ్రగ్స్
* 8.99 కోట్ల విలువచేసే మెపిడ్రిన్ స్వాధీనం
* పదేండ్లుగా నిరాటంకంగా సాగుతున్న డ్రగ్స్ దందా
* సిగరెట్లలో పెట్టి అమ్ముతున్నట్లు గుర్తింపు

మన తెలంగాణ/హైదరాబాద్/జిన్నారం : హైదరాబాద్ శివారులో మరోసారి డ్రగ్స్ రాకెట్ గుట్టు రట్టయింది. డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డిసిఎ), ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్టుమెంట్ సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించారు. భారీగా డ్రగ్స్‌ను అధికారులు స్వాధీనం చేసు కున్నారు. మొత్తంగా రూ.8.99 కోట్ల రూపాయల విలువచేసే డ్రగ్స్‌ను అధికారులు స్వాధీనం పరుచుకున్నారు. సంగారెడ్డి పరిధిలోని ఐడిఎ బొల్లారంలోని ఫ్యాక్టరీలో డ్రగ్స్ తయారు చేస్తున్నట్లుగా ఇంటర్ పోల్ సమాచారం రావడంతో రంగంలోకి దిగిన పోలీసులు ఇంటర్ పోల్ సహాయంతో పిఎస్‌ఎన్ మెడికేర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో శుక్రవారం సోదాలు చేపట్టారు. నిషేధిత డ్రగ్స్ తయారు చేస్తున్నట్లుగా అధికారులు గుర్తించారు. 90 కిలోల మెపిడ్రిన్ డ్రగ్స్‌ని డ్రగ్ కంట్రోల్ అధికారులు స్వాధీనపరుచుకున్నారు.

గత పది సంవత్సరాల నుంచి డ్రగ్స్ తయారు చేసి విదేశాలకి తరలిస్తున్న సదరు సంస్థ డైరెక్టర్ కస్తూరి రెడ్డి నెమల్లపూడిని అరెస్టు చేశారు. సిగరెట్ ప్యాకెట్లలో డ్రగ్స్‌ను పెట్టి విదేశాలకు తరలిస్తు న్నట్లు గుర్తించారు. మరోవైపు హైదరాబాదులో కూడా డ్రగ్స్ సప్లై చేసినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇంటర్ పోల్ సహాయంతో డ్రగ్స్ రాకెట్టు గుట్టురట్టు చేసినట్లు వి.బి.కమలాసన్ రెడ్డి వెల్లడించారు. పీఎస్‌ఎన్ కంపెనీ పలు దేశాలకు డ్రస్సును సరఫరా చేస్తున్నట్లుగా సమాచారం. ప్రధానంగా యూరప్‌కు భారీ మొత్తంలో డ్రగ్స్‌ను సరఫరా చేసినట్లు పోలీసులు గుర్తించారు. కాగా, పోలీసులు ఎన్ని కఠిన చర్యలు తీసుకుం టున్నా, డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తెలంగాణ ఉండాలన్న ప్రభుత్వ లక్షానికి అనుగుణంగా పోలీసులు ఉక్కుపాదం మోపడంలో తమ సర్వశక్తు లొడ్డుతున్నా డ్రగ్ రాకెట్లు బయటపడుతూనే ఉండటం గమనార్హం. మత్తుకు బానిసగా మారిన యువతను టార్గెట్ చేసుకున్న మాఫియా చివరకు వారినే ఏజెంట్లుగా మార్చి చాపకింద నీరులా తమ సామ్రాజ్యాన్ని పెంచుకుంటూనే పోతుండటం గమనార్హం. డబ్బుల కోసం భావితరాల యువ తను ఈ డ్రగ్స్ ముఠాలు నాశనం చేస్తున్నారు.

ఉడుకు రక్తం యువత ఆ మత్తుకు బానిసలుగా మారి జీవితాలను నాశనం చేసుకోవడంతో పాటు దేశ ద్రోహులుగా కూడా మారుతున్నారు.. కొందరు డ్రగ్స్ మాఫియాలు తమ స్వప్రయోజనాలకు యువతను బానిసలుగా మారుస్తు న్నాయి. మాదకద్రవ్యాల బారిన పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని పోలీసులు, నిపుణులు పదే పదే సూచిస్తున్నారు. హెచ్చరిస్తున్నారు కూడా. అయితే డ్రగ్స్ మత్తులో పడిన యువత బయటికి రాలేక ఆ ఊబిలోకి దగడమే కాకుండా అదే డ్రగ్స్ కోసం తాము సరఫరాదారులుగా మారుతూ డ్రగ్స్ సామ్రాజ్యాన్ని పెంచి పోషిస్తున్న తీరు విస్మయానికి గురి చేస్తోంది. దేశానికి ఆదర్శంగా నిలవాల్సిన యువత డ్రగ్స్ మాయలో పడటం నిజంగా దురదృష్టకరమన్నారు. డ్రగ్స్ బారిన పడకుండా యువతను రక్షించడం కోసం ఓ వైపు అవగాహనా సదస్సులు, మరోవైపు డ్రగ్స్ కేసులో దొరికితే జీవిత ఖైదు, లేదా ఉరి శిక్షలు ఉంటాయాన్ని పోలీసులు హెచ్చరిస్తున్నా ఫలితం అంతంత మాత్రంగనే ఉండటం గమనార్హం. ఇదే క్రమంలో యువత డ్రగ్స్ బారిన పడకుండా వారి తల్లిదండ్రులు సైతం ఎప్పటికప్పుడు వారిని పర్యవేక్షించి అందుకు అనుగుణంగా వారిని డ్రగ్స్ బారిన పడకుండా జాగరూకత వహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు చెబుతున్నారు.

దానం నాగేందర్ సహా పలువురు ఎంఎల్‌ఎలకు హైకోర్టు నోటీసులు

0

దానం నాగేందర్ సహా పలువురు ఎంఎల్‌ఎలకు హైకోర్టు నోటీసులు ఖైరతాబాద్ ఎంఎల్‌ఎ దానం నాగేందర్ సహా పలువురు ఎంఎల్‌ఎలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. దానం ఎన్నిక రద్దు చేయాలంటూ ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ అభ్యర్థి విజయారెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ విజయ్‌సేన్ రెడ్డి శుక్రవారం విచారణ చేపట్టారు. అసెంబ్లీ ఎన్నికల్లో దానం ఓటర్లను ప్రలోభపెట్టారని.. డబ్బులు పంచడంతో పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టుకు వెల్లడించారు. అలాగే, ఆయన సతీమణి పేరు మీద ఉన్న ఆస్తుల వివరాలను నామినేషన్ పత్రాల్లో వెల్లడించలేదన్నా రు. ఈ వాదనలు విన్న ఉన్నత న్యాయస్థానం వివరణ ఇవ్వాలంటూ దానం నాగేందర్‌కు నోటీసులు జారీ చేసింది.

తదుపరి విచారణను ఏప్రిల్ 18కి వాయిదా వేసింది. ఎన్నికల పిటిషన్లపై వివవరణ ఇవ్వాలంటూ ఐదుగురు ఎంఎల్‌ఎలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. వివిధ అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి గెలుపొందిన అభ్యర్థులను అనర్హులుగా ప్రకటించాలంటూ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఎన్నికల అఫిడవిట్‌లో తప్పుడు సమాచారం దాఖలు చేశారని కొన్ని, డబ్బులు పంచి ఓటర్లను ప్రలోభ పెట్టారని, చట్టప్రకారం నేరమని పిటిషన్ తరపు లాయర్లు పేర్కొ న్నారు. మహబూబ్‌నగర్ ఎంఎల్‌ఎ యెన్నం శ్రీనివాస్‌రెడ్డి ఎన్నికల అఫిడవిట్‌ను సవాల్ చేస్తూ శ్రీనివాస్ గౌడ్, దేవరకద్ర ఎంఎల్‌ఎ మధుసూ దన్‌రెడ్డి ఎన్నికల అఫిడవిట్‌పై ఆల వెంకటేశ్వర్ రెడ్డి చేసిన పిటిషన్‌పై కోర్టు విచారణ చేపట్టింది.

యెన్నంశ్రీనివాస్ రెడ్డి, మధుసూదన్‌రెడ్డికి నోటీ సులు జారీచేస్తు విచారణ ఏప్రిల్ 19కి వాయిదా వేశారు. అసిఫాబాద్ ఎంఎల్‌ఎ కోవా లక్ష్మీ ఎన్నికల అఫిడవిట్‌పై అజ్మీరా శ్యాం, జూబీ ్లహిల్స్ ఎంఎల్‌ఎ మాగంటి గోపీనాథ్ అఫిడవిట్‌పై అజారుద్దీన్, నవీన్ యాదవ్, కూనంనేని సాంబశివరావు ఎన్నికల అఫిడవిట్‌పై నందూ లాల్ అగర్వా ల్ దాఖలు చేసిన పిటిషన్లపై న్యాయస్థానం విచారణ చేపట్టింది. కోవా లక్ష్మీ, మాగంటి గోపీనాథ్, కూనంనేని సాంబశివరావుకి నోటీసులు జారీ చేస్తూ విచారణను వచ్చేనెల 16కి వాయిదా వేశారు. మరికొంత మంది ఎంఎల్‌ఎల ఎన్నికలను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటీషన్‌లు దాఖలయ్యా యి. అవి విచారణకు రానున్నాయి. కాగా, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దానం నాగేందర్ బిఆర్‌ఎస్ తరఫున ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. తాజాగా, ఆయన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. 1994, 1999, 2004లో ఆసిఫ్‌నగర్ నుంచి విజయం సాధించిన దానం 2009, 2018లో మాత్రం ఖైరతాబాద్ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా కూడా పని చేశారు. మారిన రాజకీయ పరిణామాలతో బిఆర్‌ఎస్‌లో చేరారు. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో హస్తం గూటికి చేరారు.

మాదిగ జాతిని బిజెపి, బిఆర్‌ఎస్ పార్టీలు అణగదొక్కాయి

0
  • మాదిగ జాతిని బిజెపి, బిఆర్‌ఎస్ పార్టీలు అణగదొక్కాయి
  • మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్

ఎస్సీ వర్గీకరణ పేరుతో రాజకీయ ప్రయోజనాల కోసం మాదిగలను బిజెపి, బిఆర్‌ఎస్ పార్టీలు వాడుకుంటున్నాయని మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ అన్నారు. శుక్రవారం నాడు గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ రెండున్నర దశాబ్దాలుగా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వర్గీకరణ పేరుతో మాదిగల హక్కులను మోసం చేసే కుట్రలు జరుగుతున్నాయన్నారు. మాదిగ జాతిని బిజెపి, బిఆర్‌ఎస్ పార్టీలు అణగదొక్కాయని ఆయన ధ్వజమెత్తారు. ఏ ఎండకు ఆ గొడుగు పడుతున్న ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగను ఆయన హెచ్చరించారు. మాదిగల ఆత్మ గౌరవాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోడీకి తాకట్టు పెట్టొద్దన్నారు. రిజర్వేషన్లకు మొదటి అడుగు వేసిందే కాంగ్రెస్ అని ఆయన చెప్పారు. పలు సందర్భాల్లో కాంగ్రెస్‌ను న్యాయబద్దంగా రిజర్వేషన్లను అమలు చేయగలదని మందకృష్ణ మాదిగ చెప్పలేదా అని ఆయన ప్రశ్నించారు. ప్రధాని మన్మోహన్ హయాంలో వర్గీకరణ రాష్ట్రాలకు అప్పజెప్పాలని ఉషా మెహ్రా కమిషన్‌ను కాంగ్రెస్ వేసిందని ఆయన తెలిపారు. పదేళ్లపాటు మాదిగలను బిఆర్‌ఎస్, బిజెపి పార్టీలు నిలువునా ముంచాయని ఆయన విరుచుకుపడ్డారు. పదేళ్ల కెసిఆర్ పాలనలో మాదిగలు ఆగమవుతుంటే మంద కృష్ణ మాదిగ ఎక్కడున్నారని ఆయన ప్రశ్నించారు. గ్రామీణ బిడ్డ అయిన తనను గుర్తించి కాంగ్రెస్ ఎమ్మెల్యేను చేసిందని ఆయన తెలిపారు. కాంగ్రెస్ తనకు గాడ్ ఫాదర్ లాంటిదని ఆయన పేర్కొన్నారు. మరో 20 ఏళ్ల పాటు సిఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలో ఉంటుందన్నారు.

సిఎం రేవంత్‌తో మల్లు రవి, సంపత్‌కుమార్‌ల భేటీ
సిఎం రేవంత్‌రెడ్డిని సంపత్‌కుమార్, మల్లు రవిలు శుక్రవారం కలిశారు. నాగర్ కర్నూల్ పార్లమెంట్‌లో కాంగ్రెస్ విజయానికి చేయాల్సిన వ్యూహాంపై వారు ముగ్గురు చర్చించారు. మల్లు రవి, సంపత్ కుమార్‌లతో సిఎం సుదీర్ఘంగా చర్చించారు. నాగర్ కర్నూల్లో విజయం సాధించేందుకు ఇద్దరు నాయకులకు సిఎం రేవంత్ దిశా నిర్దేశం చేశారు. కాగా, అంతకు ముందు మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్‌తో నాగర్ కర్నూల్ కాంగ్రెస్ ఎంపి అభ్యర్థి మల్లు రవి భేటీ అయ్యారు. సంపత్ ఇంటికి వెళ్లి తనకు సహకారం అందించాలని ఆయన కోరారు. నాగర్ కర్నూల్ స్థానాన్ని సంపత్‌కుమార్ కూడా ఆశించారు. అనంతరం వారిద్దరూ సిఎం రేవంత్ ఇంటికి వెళ్లారు.

కాంగ్రెస్ పార్టీలో రెండో జాబితా చిచ్చు

0
  • కాంగ్రెస్ పార్టీలో రెండో జాబితా చిచ్చు
  • ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు లేఖ

కాంగ్రెస్ పార్టీలో రెండో జాబితా చిచ్చు రేపింది. బిఆర్‌ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ముగ్గురు నేతలకు టికెట్లు ఇవ్వడంపై కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ నిరంజన్ ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు లేఖ రాశారు. సికింద్రాబాద్ నుంచి దానం నాగేందర్, మల్కాజ్ గిరి నుంచి సునీతా మహేందర్ రెడ్డి, చేవెళ్ల రంజిత్ రెడ్డికి టికెట్ ఇవ్వడంపై ఆయన అభ్యంతరం తెలిపారు. తెలంగాణ ప్రజలు బిఆర్‌ఎస్ పార్టీని ఓడించి రాష్ట్రంలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొచ్చారని, కానీ, వారిని నామినేట్ చేయడం ద్వారా ప్రజల అంచనాలకు విరుద్ధంగా వ్యవహారిస్తున్నట్టయ్యిందని, ఇది కాంగ్రెస్ కేడర్‌ను అవమానించడమే కాకుండా వారిని నిరుత్సాహపరుస్తుందని ఆయన ఈ లేఖలో పేర్కొన్నారు.

కాంగ్రెస్ పార్టీలో తెలంగాణ లేబర్ పార్టీ విలీనం

0

లోక్ సభ ఎన్నికల ముందు తెలంగాణలో కీలక పరిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్ పార్టీలో తెలంగాణ లేబర్ పార్టీ విలీనమయ్యింది. శుక్రవారం గాంధీ భవన్‌లో టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో లేబర్ పార్టీ అధ్యక్షుడు రమేష్ తో పాటు వందలాది మంది కార్యకర్తలు కాంగ్రెస్‌లో చేరారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పేదలకు అండగా ఉండే పార్టీ అని అన్నారు. లేబర్ పార్టీని మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందన్నారు. సిఎం రేవంత్ రెడ్డి, ఏఐసిసి ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ సూచన మేరకు విలీనం చేసుకున్నామని ఆయన తెలిపారు. పార్టీలో రమేశ్‌కు తగిన గౌరవం, ప్రాధాన్యత ఇస్తామన్నారు.

కన్జర్వేషన్ జోన్‌లోనూ నిర్మాణాలు..!

0

గత అసెంబ్లీ ఎన్నికల వేళ హెచ్‌ఎండిఏ మాస్టర్‌ప్లాన్ 2031లో మార్పులు చోటుచేసుకోవడంతో రియల్టర్లు, డెవలపర్లు తమ భూములను వివిధ జోన్లకు మార్పు చేయాలంటూ గత ప్రభుత్వానికి సిఎల్‌యూ కింద (ఛేంజ్ ఆఫ్ ల్యాండ్) కింద దరఖాస్తులు చేసుకున్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం హెచ్‌ఎండిఏ మాస్టర్ ప్లాన్‌లో 12 జోన్లు ఉండగా 41 శాతం వ్యవసాయం మాత్రమే చేయాలన్న తలంపుతో కొన్నింటిని కన్జర్వేషన్ జోన్‌లుగా అప్పటి ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో ఓపెన్ స్పేస్ జోన్‌లో కూడా మార్పు చేస్తూ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంది. ఇదే అదునుగా కొందరు రియల్టర్‌లు కన్జర్వేషన్ జోన్‌లోనూ అనుమతులు లేకుండా విల్లాలు, అపార్ట్‌మెంట్‌ల నిర్మాణాలను చేపడుతున్నా స్థానిక అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఏడు జిల్లాలు…70 మండలాల్లోని ప్రతి సర్వే నెంబర్‌ను…

గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు శివారు ప్రాంతాలు మెరుగైన అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం హెచ్‌ఎండిఏ మాస్టర్‌ప్లాన్ 2031 ఏర్పాటు చేసింది. హెచ్‌ఎండిఏ విస్తరించి ఉన్న 7,257 కిలోమీటర్ల పరిధిలోని ఏడు జిల్లాలు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, యాదాద్రి జిల్లాల్లోని 70 మండలాల్లోని ప్రతి సర్వే నెంబర్‌ను మాస్టర్‌ప్లాన్‌లోని ఓ జోన్ కిందకు తీసుకొచ్చారు.

12 జోన్‌లు… 21 రకాలుగా విభజన…

హెచ్‌ఎండిఏ మాస్టర్‌ప్లాన్‌లో వ్యవసాయ (కన్జర్వేషన్) జోన్, రెసిడెన్షియల్ జోన్, కమర్షియల్ జోన్, మాన్యుఫాక్చరింగ్ జోన్, బయో కన్జర్వేషన్ జోన్, ఓపెన్ స్పేస్ జోన్, రీక్రియేషన్ జోన్ ఇలా 12 జోన్‌లను 21 రకాలుగా విభజించారు. మాస్టర్‌ప్లాన్ 2031లో ఏ జోన్ కింద నిర్ణయించారో ఆ ప్రకారంగానే సంబంధిత సర్వే నెంబర్‌లలో ఉన్న స్థలాన్ని వినియోగించాల్సి ఉంటుంది. దానికి అనుగుణంగా అధికారులు వాటికి అనుమతులు ఇవ్వాల్సి ఉంటుంది. మాస్టర్‌ప్లాన్‌ను స్థానిక ప్రజల అవసరాలకు అనుగుణంగా జోన్ మార్పును సంబంధిత శాఖ మంత్రి ఆమోదం ప్రకారం చేసుకోవచ్చన్న నిబంధన కూడా ఉంది. ఇందుకోసం ఛేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్ (సీఎల్‌యూ)లో దరఖాస్తు చేస్తే సంబంధిత శాఖ మంత్రి మార్పు చేస్తారు. అయితే 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు హెచ్‌ఎండిఏకు వచ్చిన సిఎల్‌యూ దరఖాస్తులను రాష్ట్ర ప్రభుత్వం పెద్దఎత్తున పరిష్కారం చేసింది. ఆ మేరకు హెచ్‌ఎండిఏ మాస్టర్‌ప్లాన్‌లో నిర్ణయించిన వివిధ జోన్లను మార్పు చేస్తూ హెచ్‌ఎండిఏ నోటిఫికేషన్లు జారీ చేసింది.

గుట్టుచప్పుడు కాకుండా వెంచర్లు

ఈ నేపథ్యంలోనే గత అసెంబ్లీ ఎన్నికల ముందు గత ప్రభుత్వం కొన్ని జోన్‌లను మార్పు చేయడంతో కొందరు రియల్టర్లు తక్కువ ధరకే భూములు వస్తున్నాయంటూ ఆ జోన్‌ల పరిధిలో వందలాది ఎకరాలను కొనుగోలు చేశారు. ప్రస్తుతం గుట్టుచప్పుడు కాకుండా ఆ భూముల్లో వెంచర్లు చేస్తున్నారు. స్థానిక సంస్థలు, హెచ్‌ఎండిఏ, రెవెన్యూ అధికారులకు ముడుపులు ముట్టచెప్పి అనుమతులు లేకుండానే ప్లాట్లతో పాటు నిర్మాణాలను చేపట్టి యథేచ్ఛగా ఈ దందాను కొనసాగిస్తున్నారు. ఇలా పలు జిల్లాలోని కన్జర్వేషన్ జోన్‌లలో ప్లాట్లతో పాటు నిర్మాణాలను చేపడుతుండడం విశేషం. కన్జర్వేషన్ జోన్‌లో అనుమతులు లేకుండా విల్లాలు, అపార్ట్‌మెంట్‌లు నిర్మిస్తున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే కన్జర్వేషన్ జోన్‌లో ఉన్న వ్యవసాయ భూములకు నాలా కన్వర్షన్ చేసి వాటిని ప్లాట్‌లుగా విభజించి కనీసం స్థానిక సంస్థల అనుమతులను తీసుకోకుండానే ఈ విక్రయాలు చేపడుతున్నారని స్థానికులు ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినట్టుగా సమాచారం.

కన్జర్వేషన్ జోన్ నిబంధనలు ఇలా..

హెచ్‌ఎండిఏ 12 జోన్లలో కన్జర్వేషన్ జోన్ 41 శాతం పాత్ర పోషిస్తోంది. మాస్టర్ ప్లాన్ 7,200 చదరపు కి.మీ.లలో 2,421 చ.కి.మీ. కన్జర్వేషన్ జోన్‌గా ఉంటుంది. వ్యవసాయం, వ్యవసాయ ఆధారిత అభివృద్ధి ఈ ప్రాంతంలో చేయాల్సి ఉంటుంది. కన్జర్వేషన్ జోన్‌లో ఎలాంటి నిర్మాణాలకు అనుమతులు లభించవు. ఈ ప్రాంతంలో హెచ్‌ఎండిఏ అనుమతులు రావు, లే ఔట్లు వేయకూడదు. పండ్లు, కూరగాయలు, పౌల్ట్రీలకు మాత్రమే ఇక్కడ అనుమతులు లభిస్తాయి. రవాణా సదుపాయాలకు కూడా అనుమతులు ఇస్తారు. పరిశ్రమలు, ఇండ్ల నిర్మాణాలకు మాత్రం అనుమతులు ఇవ్వరు. ఈ నిర్మాణాలపై నిషేధం 100 శాతం ఉంటుంది. అయినా కొందరు రియల్టర్‌లు యథేచ్ఛగా నిర్మాణాలు కొనసాగిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని తెలుస్తోంది.

ఏసీబీకి చిక్కిన మహిళా ఆణి ముత్యం సబ్ రిజిస్ట్రార్ తస్లీమా

0
  • ఆదివారం రోజున కూలి పని చేస్తుంది.
  • కరోనా సమయంలో ఈవిడ గారు వెరీ “ఫేమస్”..

మహబూబాబాద్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారుల దాడులు నిర్వహించగా రూ. 19 వేల లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా సబ్ రిజిస్ట్రార్ తస్లీమా పట్టుబడ్డారు. వాటితో పాటు డాక్యుమెంట్ రైటర్ల నుంచి రూ. 1,78,000 తీసుకున్న అమౌంట్ ను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కాగా,తస్లీమా ములుగు సబ్ రిజిస్ట్రార్ గా గతంలో పని చేసిన సమయంలో వ్యవసాయ కూలీగా, చాలా ఫేమస్ అయింది.

బిజెపి దేశాన్ని దోచుకుంటుంది

0
  • బిజెపి దేశాన్ని దోచుకుంటుంది
  • కాంగ్రెస్ అకౌంట్లను మోడీ సర్కారు సీజ్ చేసింది

బిజెపి దేశాన్ని దోచుకుంటుందని, కాంగ్రెస్ అకౌంట్లను మోడీ సర్కారు సీజ్ చేసిందని పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల ముందు ఇలా అకౌంట్స్ క్లోజ్ చేయడం బిజెపి రాజకీయ దిగజారుడు తనానికి నిదర్శనమని ఆయన మండిపడ్డారు. ఉన్న డబ్బులు ఖర్చు చేయకుండా ఆంక్షలు పెట్టడం ఏమిటి..? అని ఆయన ప్రశ్నించారు. అంతేకాకుండా రాజకీయ పార్టీలు ఇన్‌కంటాక్స్ పరిధిలోకి రావని ఆయన వెల్లడించారు. కానీ, బిజెపి పార్టీ కాంగ్రెస్ అకౌంట్స్‌పై ఐటీ అధికారులతో ఇబ్బంది పెడుతుందని, బిజెపి మమ్మల్ని తప్పుపడుతూ వాళ్లు సత్యమంతుల లాగా మట్లాడుతున్నారని మహేశ్ కుమార్ గౌడ్ ధ్వజమెత్తారు. బాండ్ల దోపిడీ ప్రపంచంలోనే పెద్ద దోపిడీ అని, బాండ్లన్నీ బిజెపి ఖాతాలోకి వెళ్లాయన్నారు.

మోడీ దిష్టిబొమ్మ దహనం
నల్లకుంట చౌరస్తాలో హైదరాబాద్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ మోత రోహిత్ ఆధ్వర్యంలో మోడీ దిష్టిబొమ్మ దహనం చేశారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన బ్యాంక్ ఖాతాలను కేంద్ర ప్రభుత్వం ఫ్రీజ్ చేయడానికి నిరసనగా ఈ కార్యక్రమం చేపట్టినట్టు రోహిత్ తెలిపారు. బిజెపి ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలని, పిరికిపంద చర్యలు మానుకోవాలని యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ మోత రోహిత్ ఈ సందర్భంగా హెచ్చరించారు.

బీఆర్​ఎస్​కు విరాళాలు అందుకేనా?

0
  • క్విడ్ ప్రోకో
  • బీఆర్​ఎస్​కు విరాళాలు అందకేనా..?
  • గులాబీ పార్టీకి రూ. 1322 కోట్లు
  • జాబితాలో మెఘాదే తొలి స్థానం
  • రూ. 28.75 కోట్లు ఇచ్చిందెవరు?

టీఎస్​, న్యూస్​:
ఎలక్టోరల్ బాండ్ల విరాళాల్లో బీఆర్ఎస్​కు భారీ విరాళాలు వచ్చాయి. సుప్రీం కోర్టు ఆదేశాలతో ఎలక్టోరల్​ బాండ్ల వ్యవహారంలో దాతల పేర్లు బయటికి వచ్చాయి. దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీలకు ఇచ్చిన విరాళాల జాబితా ఎలా ఉన్నా.. రాష్ట్రంలో మాత్రం బీఆర్ఎస్ కు మొత్తం రూ. 1,322 కోట్లు బాండ్ల రూపంలో వచ్చాయి. బీఆర్ఎస్ కు డొనేషన్లు ఇచ్చన వారిలో మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ అగ్రస్థానంలో నిలిచింది. ఈ కంపెనీ రెండు దఫాలుగా రూ. 195 కోట్లను విరాళంగా అందించింది. ఇక, రాష్ట్రంలోని ఫార్మా కంపెనీలు కూడా అప్పటి అధికార పార్టీపై కనకవర్షాన్ని కురిపించాయి. ప్రధానంగా ఎన్నికలకు ముందు కోట్ల రూపాయలను విరాళాలుగా ఇచ్చారు. ఫార్మా కంపెనీలది పెద్దవాటా అయితే.. ఆ తర్వాత రియల్​ ఎస్టేట్​ కంపెనీలు నిలిచాయి. అయితే, భారీస్థాయిలో విరాళాలు ఇచ్చిన కంపెనీలకు అప్పటి అధికార పార్టీ నుంచి ఏదో ఒక రూపంలో ప్రయోజనం కల్గిందనే అంశం ఇప్పుడు హాట్​ టాపిక్​గా మారింది. భూముల కేటాయింపులు, పదవులు, కంపెనీలకు రాయితీలు.. ఇలా ప్రభుత్వం నుంచి సాయాన్ని తీసుకున్న కంపెనీలు.. ఎలక్టోరల్​ బాండ్ల రూపంలో అప్పటి అధికార పార్టీకి విరాళాలు ఇచ్చారు.

28.75 కోట్లు ఎవరిచ్చారు
ఎలక్టోరల్ బాండ్ల వ్యవహారంలో దాతల పేర్లు బయటికి వచ్చాయి. బీఆర్ఎస్ కు మొత్తం రూ. 1,322 కోట్లు బాండ్ల రూపంలో వచ్చాయి. బీఆర్ఎస్ కు డొనేషన్లు ఇచ్చన వారిలో మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ అగ్రస్థానంలో నిలిచింది. ఈ కంపెనీ రెండు దఫాలుగా 195 కోట్ల రూపాయలను విరాళంగా అందించింది. ఓ అనౌన్ డోనర్ 28.75 కోట్ల రూపాయలను బీఆర్ఎస్ కు అందించడం చర్చనీయాంశంగా మారింది. జాబితాలో అందరి పేర్లు కనిపిస్తున్నారు.. ఏడో నంబర్ గడిలో అనౌన్ డోనర్.. బ్రాకెట్లో నాట్ అవైలబుల్ అని ఉంది. ఇంతకూ ఎవరా అనౌన్ డోనర్ అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కేసీఆర్ హయాంలో నిర్మితమైన కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన పలు కాంట్రాక్టుల్లో మేఘా సంస్థ పనులు చేసింది. పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టు పనులు సైతం మేఘా కంపెనీకే దక్కడం గమనార్హం. ఈ సంస్థ 195 కోట్ల సమర్పించుకోవడం విశేషం. ఆ తర్వాత స్థానంలో ఫార్మా కంపెనీలు నిలిచాయి. హెటిరో డ్రగ్స్ నుంచి రెండు దఫాలుగా యాభై కోట్ల రూపాయలు విరాళంగా వచ్చాయి. అయితే ఈ సంస్థ ఎండీకి రాజ్యసభ ఎంపీ పదవి దక్కడం గమనార్హం. మూడో స్థానంలో రియల్ ఎస్టేట్ సంస్థలు ముందున్నాయి. ఇందులో ఎమ్మెల్సీ వెంకటరామిరెడ్డి సమీప బంధువుకు సంబంధించిన రాజ్ పుష్ప ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఉంది. ఈ సంస్థ బీఆర్ఎస్ పార్టీకి రూ. 20 కోట్లు బాండ్ల రూపంలో సమర్పించింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికలకు ముందు మూడు దఫాలుగా బీఆర్ఎస్ పార్టీకి వెయ్యి కోట్ల రూపాయలు బాండ్ల రూపంలో రావడం విశేషం. కరోనా కష్టసమయంలో రెట్టింపు ధరలకు మందులు, ఇంజక్షన్లు అమ్ముకున్న సంస్థలన్నీ అప్పటి అధికార బీఆర్ఎస్ పార్టీకి నిధుల వరద పారించినట్టు తెలుస్తోంది. ప్రతి ఉప ఎన్నికకు ముందు గులాబీ పార్టీకి విరాళాల రూపంలో భారీగా నిధులు వచ్చాయి. 2021లో దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికలకు ముందు రూ.85 కోట్లు బాండ్లుగా వచ్చాయి. 2022లో మునుగోడు ఉప ఎన్నికలకు ముందు 92 కోట్లు ఎలక్టోరల్ బాండ్ల రూపంలో వచ్చాయి. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఒకే రోజు 663 కోట్ల రూపాయలు బాండ్ల రూపంలో రావడం గమనార్హం.

భూమి తీసుకున్న సంస్థ కూడా..!
బీఆర్‌ఎస్‌కు ఎక్కువగా విరాళం ఇచ్చిన మరో కంపెనీ కిటెక్స్. కాకతీయ టెక్స్‌టైల్ పార్కు కోసం రైతుల నుంచి సేకరించిన 187 ఎకరాల భూమిని కేటాయించారు. కేరళకు చెందిన టెక్స్‌టైల్ గ్రూప్ కిటెక్స్ కంపెనీ నవంబర్ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్​కు ఎలక్టోరల్ బాండ్ల ద్వారా రూ.25 కోట్లు విరాళంగా ఇచ్చింది. రాష్ట్రంలోని వరంగల్ జిల్లా గీసుగొండ మండలం శాయంపేట్ హవేలిలో రైతులు నిరసనలు తెలిపినప్పటికీ కిటెక్స్‌కు 187 ఎకరాల భూమిని కేటాయించారు. ఇక్కడ ప్రభుత్వం 731 కుటుంబాల నుంచి 1,190 ఎకరాల భూమిని సేకరించి, వారికి రూ.88 కోట్ల పరిహారం ఇచ్చింది. ముందుగా కిటెక్స్​కు 187 ఎకరాలు కేటాయించిన తరువాత, కిటెక్స్ దాని కాంపౌండ్ వాల్‌ను వాస్తుకు అనుగుణంగా మార్చడానికి అదనంగా 13.2 ఎకరాలను కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. దీనికి కూడా అప్పటి ప్రభుత్వం వెనకాడలేదు. రైతుల నుంచి వ్యతిరేకత వచ్చినా రెవెన్యూ అధికారులు భూములను సర్వే చేశారు. మార్కెట్‌లో ఎకరం రూ.50 లక్షలు ఉన్నప్పటికీ పరిహారం కింద ఎకరాకు రూ.10 లక్షలు మాత్రమే ఇచ్చారని రైతులు రోడ్డెక్కారు. వరంగల్‌లోని కాకతీయ అపెరల్‌ పార్క్‌లో కాకుండా రంగారెడ్డిలో మరో ఫ్యాక్టరీకి కూడా భూమి ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే కిటెక్స్ చిల్డ్రన్‌వేర్ రూ.9 కోట్లు విరాళం అందించగా, కిటెక్స్ గార్మెంట్స్ రూ.16 కోట్లు విరాళంగా ఇచ్చినట్లుగా వెల్లడవుతున్నది.

క్విడ్ ప్రోకో జరిగిందా..?
ఎలక్టోరల్ బాండ్ల వ్యవహారంలో భారీగా డబ్బును విరాళంగా ఇచ్చిన సంస్థలకు గులాబీ పార్టీ ఎలాంటి మేలు చేసి ఉంటుంది..? సదరు సంస్థ వ్యాపారాలేంటి..? అన్న అంశాలు చర్చకు వస్తున్నాయి. విరాళాలు అందించి తమ పనులను చేయించుకున్నారా..? అన్నది హాట్ టాపిక్ గా మారింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో కీలక భాగస్వామిగా ఉన్న మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ ఫ్రాస్టక్చర్ కంపెనీ రెండు దఫాలుగా 195 కోట్ల రూపాయలను బాండ్ల రూపంలో ఇవ్వడం గమనార్హం. కరోనా కష్టకాలంలో ప్రజలపై పెనుభారం మోపుతూ ఇష్టం వచ్చిన ధరలకు రెమిడెసివిర్ ఇంజక్షన్లు అమ్మకున్న సంస్థలు కూడా అప్పటి అధికార పార్టీకి భారీగానే విరాళాలు అందించాయని తెలుస్తోంది. జవహర్ లాల్ నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్డు ను 30 సంవత్సరాలపాటు లీజుకు తీసుకున్న ఆర్బీఐ ఇన్ ఫ్రా కంపెనీ రూ. 25 కోట్ల రూపాయలను విరాళంగా అందించింది. ఇవన్నీ చూస్తుంటే భారీ ఎత్తున క్విడ్ ప్రోకో జరిగిందా..? అన్నది హాట్ టాపిక్ గా మారింది.

ఎన్నికల వేళ డబ్బుల వరద
ప్రతి ఎన్నికల సమయంలో గులాబీ పార్టీకి నిధులు వరదలా వచ్చాయి. ఇవన్నీ బాండ్ల రూపంలో వచ్చినవే. 2018 నుంచి 2023 వరకు మూడు ఉప ఎన్నికలు జరిగాయి. 2021లో దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రాంలింగారెడ్డి మరణంలో అక్కడ ఉప ఎన్నిక వచ్చింది. అదే ఏడాది ఈటల రాజీనామాతో హుజూరాబాద్ లో ఉప ఎన్నిక జరిగింది ఈ రెండు ఉప ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టీకి ఎలక్టోరల్ బాండ్ల రూపంలో 85 కోట్ల రూపాయలు రావడం గమనార్హం. 2022లో మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. దీంతో అక్కడ కూడా ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ సమయంలో బీఆర్ఎస్ పార్టీకి రూ. 92 కోట్లు విరాళంగా వచ్చాయి. అసెంబ్లీ ఎన్నికల సమయంలో 881 కోట్ల రూపాయలు అధికార పార్టీకి విరాళంగా వచ్చాయి.

హైదరాబాద్ లో వైన్స్ షాప్ లు బంద్

0

టీఎస్​, న్యూస్​ :హోలీ పండుగ సందర్భంగా హైదరాబాద్ లో పోలీసులు ఆంక్షలు విధించారు. మార్చి 25న ఉదయం 6 గంటల నుంచి 26 ఉదయం 6 గంటల వరకు మద్యం షాపులు మూసి వేస్తున్నట్లు సైబరాబాద్ సీపీ అవినాష్ మొహంతి ఈరోజు ఆదేశాలు జారీ చేశారు. హోలీ వేడుకల్లో పాల్గొనే వారు ఇతరులకు ఇబ్బంది కలుగకుండా చూడాలని సిటీలో తిరిగే వాహనదారులపై రంగులు చల్లరాదన్నారు. వాహనాలపై పబ్లిక్ రోడ్స్ లో గుంపులుగా తిరుగుతూ న్యూసెన్స్ చేయొద్దని సూచించారు.