* పార్లమెంట్ ప్లాన్స్
* కాంగ్రెస్‌లో చేరికల వ్యూహం
టీఎస్ న్యూస్: రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరని అంటారు. వికారాబాద్ జిల్లా రాజకీయాల్లో నిప్పు, ఉప్పుగా ఉన్న రేవంత్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి కుటుంబాలు ఇపుడు ఏకం కావడం విశేషం. 2018 ఎన్నికల్లో రేవంత్‌రెడ్డి ఓటమే ధ్యేయంగా బీఆర్‌ఎస్ అధిష్టానం అప్పటి మంత్రి పట్నం మహేందర్‌రెడ్డికి బాధ్యతలు అప్పగించింది. అప్పుడు ఆయన తన సోదరుడు పట్నం నరేందర్‌రెడ్డిని కొడంగల్ నుంచి రంగంలోకి దింపి.. తన అనుభవాన్ని, అధికారాన్ని ఉపయోగించి రేవంత్‌రెడ్డిని సొంత నియోజకవర్గంలో తొలిసారి ఓటమి పాలు చేశారు. ఆ తర్వాత రేవంత్‌రెడ్డి మల్కాజిగిరి ఎంపీగా గెలవడం, పీసీసీ అధ్యక్షుడి పదవి పొందడంతో పాటు ఒంటి చేత్తో శాసనసభ ఎన్నికల్లో కాంగ్రె్‌సను అధికారంలోకి తీసుకు రావడం జరిగింది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్‌లో తిరిగి రేవంత్‌రెడ్డితో తలపడిన మహేందర్‌రెడ్డి సోదరుడు నరేందర్‌రెడ్డి ఓటమి పాలయ్యారు. ఇప్పుడు అదే రేవంత్‌రెడ్డి సమక్షంలో పట్నం మహేందర్‌రెడ్డి దంపతులు కాంగ్రె్‌సలో చేరనుండటం విశేషం.
లోక్‌సభ ఎన్నికల్లో మెజార్టీ సీట్లే లక్ష్యంగా కాంగ్రెస్ పావులు కదుపుతోంది. కీలకమైన చేవెళ్ల స్థానం నుంచి బలమైన అభ్యర్థిని దింపాలని కసరత్తు చేస్తోంది. అయితే అందుకు తగ్గట్టే మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి ఫ్యామిలికీ టికెట్ కేటాయించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. పట్నం మహేందర్‌రెడ్డి, ఆయన సతీమణి వికారాబాద్ జడ్పీచైర్మన్ సునీతారెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకోడం ఖరారైంది. సునీతారెడ్డి.. బీఆర్ఎస్కు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. గతంలోనే సీఎం రేవంత్‌రెడ్డిని కలిశారు. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు తన కుమారుడు పట్నం రినీష్ రెడ్డి, పలువురు పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధులతో కలిసి గాంధీ భవన్‌లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్ మున్షీ, సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో ఆమె కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఈ నేపథ్యంలోనే బీఆర్‌ఎస్ పార్టీకి రాజీనామా చేసినట్లు సునీతారెడ్డి ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రం పున:నిర్మాణం కోసం సీఎం రేవంత్‌రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు సునీతారెడ్డి చెప్పారు. పట్నం కుటుంబం అభిమానులు, బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తల అభిప్రాయం మేరకు కాంగ్రెసలో చేరాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆమె వెల్లడించారు. సునీతారెడ్డి, రినీ్‌షరెడ్డితో పాటు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి తమ అభిమానులు, బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు చెబుతున్నారు.
చేవెళ్ల ఎంపీ టికెట్ ఖరారు?
వికారాబాద్ జడ్పీ చైర్‌పర్సన్ సునీతారెడ్డి చేవెళ్ల ఎంపీ టికెట్ ఆశిస్తున్నారు. ఈ మేరకు కాంగ్రెస్ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతోనే వారు సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి పార్టీలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు తెలిసింది. తాండూరు ఎమ్మెల్యే టికెట్ మహేందర్‌రెడ్డి ఆశించగా మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డికి బీఆర్‌ఎస్ కేటాయించింది. దీంతో పాటు మరో నేత మెతుకు ఆనంద్‌తో నెలకొన్న విభేదాల కారణంగానే మహేందర్‌రెడ్డి దంపతులు బీఆర్‌ఎ్‌సను వీడుతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా చేవెళ్ల ఎంపీ టికెట్‌పై మాజీ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి ఆశలు పెట్టుకున్నారు. తనకు ఎంపీ టికెట్ వస్తుందనే నమ్మకంతో ఉన్నారు. టికెట్ కోసం గట్టి ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది.
హ్యాట్రిక్ జడ్పీ చైర్‌పర్సన్..
పదేళ్లకు బీఆర్‌ఎ్‌సకు గుడ్ బై..!
సునీతారెడ్డి హ్యాట్రిక్ జడ్పీ చైర్‌పర్సన్‌గా ఘనత సాధించారు. రెండు పర్యాయాలు ఉమ్మడి రంగారెడ్డి జడ్పీ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు నిర్వహించిన సునీతారెడ్డి ప్రస్తుతం వికారాబాద్ జడ్పీ చైర్‌పర్సన్‌గా కొనసాగుతున్నారు. మూడుసార్లు జడ్పీ చైర్‌పర్సన్‌గా చేసిన ఘనత సునీతారెడ్డికే దక్కింది. 2006లో టీడీపీలో చేరి రాజకీయ రంగ ప్రవేశం చేసిన సునీతారెడ్డి ఆ ఏడాదిలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో జడ్పీటీసీగా విజయం సాధించి జడ్పీ చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. 2011లో రెండోసారి జడ్పీ చైర్‌పర్సన్‌గా ఎన్నికైన ఆమె 2014 ఎన్నికలకు ముందు తన భర్త పట్నం మహేందర్‌రెడ్డితో పాటు ఆయన సోదరుడు పట్నం నరేందర్ రెడ్డి తదితరులు టీడీపీకి రాజీనామా చేసి కేసీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్ (బీఆర్ఎస్)లో చేరారు. ఇదిలా ఉంటే, రెండేళ్ల కిందట మర్పల్లి మండలం పట్లూరులో స్వంత పార్టీ నాయకులే తన వాహనాన్ని అడ్డుకుని వీరంగం సృష్టించిన ఘటనపై అధిష్ఠానం స్పందించక పోవడం పట్ల ఆమె తీవ్ర ఆవేదనకు గురయ్యారు, అప్పటి మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పట్నం మహేందర్‌రెడ్డి, సునీతారెడ్డి, నరేందర్‌రెడ్డి, అప్పటి వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ తదితరులను హైదరాబాద్‌కు పిలిపించి వారి మధ్య సయోధ్య కుదిర్చేందుకు ప్రయత్నించినా ఆమె తన అసంతృప్తిని వెళ్లగక్కారు. అప్పటి నుంచి చాలావరకు ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాలకు దూరం ఉంటూ వచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆమె పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారం చేయకుండా దూరంగా ఉన్నారు. కొంతకాలంగా మహేందర్‌రెడ్డి దంపతులు కాంగ్రెస్ పార్టీలో చేరతారనే ప్రచారం జరిగింది. చివరకు శుక్రవారం సునీతారెడ్డి, ఆమె కుమారుడు రినీ్‌షరెడ్డి తమ అభిమానులు, వెంట వచ్చే నాయకులు, కార్యకర్తలతో కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. సునీతారెడ్డి రెండు పర్యాయాలు టీడీపీ నుంచి జడ్పీ చైర్‌పర్సన్‌గా ఎన్నిక కాగా, మూడోసారి బీఆర్‌ఎస్ నుంచి ప్రాతినిథ్యం వహించారు. కాగా, దశాబ్ద కాలం పాటు బీఆర్‌ఎస్ పార్టీలో కొనసాగిన సునీతారెడ్డి ఎట్టకేలకు ఆ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ గూటికి చేరారు.