Monday, July 8, 2024

రాజ్యసభకు కెకె రాజీనామా

ఛైర్మన్‌ ‌ధన్‌కడ్‌కు రాజీనామా పత్రం సమర్పణ

కాంగ్రెస్‌లో చేరిన వెంటనే రాజ్యసభ సభ్యత్వానికి కే కేశవరావు గురువారం రాజీనామా సమర్పించారు. ఈ మేరకు ఆయన రాజ్యసభ చైర్మన్‌ ‌జగ్‌దీప్‌ ‌ధన్‌ఖడ్‌కు రాజీనామా అందజేశారు. గురువారం ఆయన ఛైర్మన్‌ ‌దన్‌కడ్‌ను కలిసి రాజీనామా లేఖను అందచేశారు. బిఆర్‌ఎస్‌ ‌పార్టీ ఆయనను రాజ్యసభకు పంపిన విషయం తెలిసిందే. కాంగ్రెస్‌ ‌జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో బుధవారం కేకే కాంగ్రెస్‌ ‌పార్టీలో చేరారు.

ఆయన పార్టీ మారడంతో రాజీనామా చేశారు. కేశవరావును బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ‌రాజ్యసభకు నామినేట్‌ ‌చేశారు. 2020 సెప్టెంబర్‌లో కేకే రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణం చేశారు. మరో రెండేళ్ల పదవీకాలం ఉండగానే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడంతో ఆయన గత ఏప్రిల్‌లో పార్టీ మారిన విషయం తెలిసిందే. జాతీయ అధ్యక్షుడి సమక్షంలో పార్టీ చేరి.. తాజాగా రాజ్యసభకు రాజీనామా చేశారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ప్రస్తుత పరిస్థితుల్లో జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీ లో అడుగు పెట్టె సాహసం చేస్తాడా?
- Advertisment -

Most Popular