Saturday, May 4, 2024

ప్రధాని మోడీ వ్యాఖ్యలు అర్థరహితం

  • ముస్లిం ఓట్లు బిజెపికి అవసరం లేదా…
  • రాముడి పేరుతో సెంటిమెంట్ ఓట్ల కోసం బిజెపి తాపత్రయం
  • మాజీ పిసిసి అధ్యక్షుడు, విహెచ్

ఈ ఎన్నికల్లో గెలిస్తే దేశ సంపదను, మహిళల పుస్తెలను కాంగ్రెస్ పార్టీ ముస్లింలకు పంచుతుందని ప్రధాని మోడీ ఆరోపిస్తున్నారని మాజీ పిసిసి అధ్యక్షుడు, విహెచ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ రాజ్యాంగంలో అందరూ సమాన హక్కులు ఉంటాయని దానిని బిజెపి నాయకులు మర్చిపోయి మాట్లాడుతున్నారని, ముస్లిం ఓట్లు బిజెపి పార్టీకి పడవని ఇలా ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడడం విడ్డూరంగా ఉందని ఆయన అన్నారు. అన్ని వర్గాలకు న్యాయం చేస్తామని రాహుల్ గాంధీ అంటుంటే, ప్రధాని మోడీ ఎప్పుడైనా పేదల గురించి మాట్లాడారా అని విహెచ్ ఫైర్ అయ్యారు.

రాముడి పేరుతో సెంటిమెంట్ ఓట్లు తీసుకోవాలని బిజెపి చూస్తుందని విహెచ్ ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాకుండా రాహుల్‌గాంధీ ఇచ్చిన హామీలు తప్పక అమలు చేస్తామని, కులగణన గురించి ప్రధాని ఎప్పుడైనా మాట్లాడారా అని విహెచ్ ప్రశ్నించారు. పదేళ్లలో ఎన్ని కోట్ల ఉద్యోగాలు ఇచ్చారు, రైతులకు గిట్టుబాటు ధర ఎందుకు ఇవ్వలేదో చెప్పాలని విహెచ్ డిమాండ్ చేశారు. దేశాన్ని మోడీ అభివృద్ధి చేయలేకనే అయోధ్య రామ మందిరం చూపిస్తున్నారన్నారు. సోనియాగాంధీ ఆరోగ్య కారణాలతో రాజ్యసభకు వెళ్లారని, మన్మోహన్ సింగ్ మీద కూడా దిగజారుడు మాటలు నరేంద్ర మోడీ మాట్లాడుతున్నారని విహెచ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మణిపూర్‌లో మారణహోమం జరుగుతుంటే వెళ్లలేదని, తెలంగాణలో బిజెపికి తగిన బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని విహెచ్ వ్యాఖ్యానించారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బీజేపీ స‌ర్కార్ తెలంగాణ‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర‌ జ‌రుపుతుందా?

Most Popular