Tuesday, May 13, 2025

ప్రభాస్‌తో మృణాల్‌ ఇంత పెద్ద ఆఫరా?

‘సీతా రామం’ సినిమాతో నటన పరంగా మంచి మార్కులు కొట్టేసిన బ్యూటీ మృణాల్‌ఠాకూర్‌. టాలీవుడ్ లో తొలి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకుంది ఈ భామ. అప్పటి నుంచి ఆమెకి భారీ ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. ‘హాయ్ నాన్న’ సినిమాతోను ఆకట్టుకున్న మృణాల్, విజయ్ దేవరకొండ కి జోడీగా త్వరలో ‘ఫ్యామిలీ స్టార్’ సినిమాతో పలకరించనుంది.

‘ఫ్యామిలీ స్టార్’ సినిమా విడుదలకి ముస్తాబవుతూ ఉండగానే, ప్రభాస్ సరసన హీరోయిన్‌గా ఆమెకి భారీ ఛాన్స్ కొట్టేసిందనే టాక్ బలంగా వినిపిస్తోంది. ప్రభాస్ నుంచి నాగ్ ఆశ్విన్ దర్శకత్వంలో ‘కల్కి’ .. మారుతీ డైరెక్షన్ లో ‘రాజా సాబ్’ ఆడియన్స్ ను పలకరించనున్నాయి. ఈ రెండు సినిమాలపై అంచనాలు భారీగానే ఉన్నాయి.

ఈ నేపథ్యంలో ప్రభాస్ తన తదుపరి సినిమాను, హను రాఘవపూడి దర్శకత్వంలో చేయనున్నాడు. ‘సీతా రామం’ సినిమాకి పనిచేసిన సాంకేతిక నిపుణులే ఈ సినిమాకి కూడా పనిచేయనున్నారట. కథానాయికగా మృణాల్ ఎంపిక జరిగిపోయిందనే అంటున్నారు. త్వరలోనే అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుందని చెబుతున్నారు.

ఇకపోతే గతంలో ఆమెతో కలిసి సీతారామంలో పనిచేయడం వల్ల డైరెక్టర్ ఈమెని ఎంపిక చేశాడా.. లేక వేరెవరైనా కథకి ఆమె అయితే సెట్‌ అవుతుందని అనుకున్నారా అన్న విషయం తెలియాల్సి ఉంది.

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com