Saturday, April 27, 2024

కారోల్‌ పై ట్రంప్‌ లైంగిక దాడి-కోర్టుతీర్పు

న్యూయార్క్ : అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ 76 ఏళ్ల వయసులో ఆయనను అత్యాచార కేసులు వెంటాడుతున్నాయి. యవ్వనంలో చేసిన తప్పులు ప్రస్తుతం పాములై పగ తీర్చుకుంటున్నట్లుగా కనిపిస్తోంది. అమెరికన్ మాజీ కాలమిస్ట్ జీన్ కారోల్ (79)గతంలోడోనాల్డ్ ట్రంప్ మీద అత్యాచార ఫిర్యాదు చేసింది. డొనాల్డ్ ట్రంప్ తన మీద అత్యాచారం చేశాడని రచయిత ఈ జీన్ కారొల్ ఆరోపించారు. తాను ఎంత మొత్తుకున్నా వినలేదని తెలిపారు. దీంతో తాను చాలా నష్టపోయానని అంటున్నారు.

1996లో ట్రంప్ తన మీద లైంగిక దాడి చేశాడని ఆరోపణలు చేస్తుంది. . మనహోటల్ లోని ఓ డిపార్ట్మెంటల్ స్టోర్ లో 1996లో డోనాల్డ్ ట్రంప్ జీన్ కారొల్ కు ఎదురయ్యారు. తన స్నేహితురాలైనా మరో మహిళకి లోదుస్తులను బహుమతిగా ఇవ్వాలని దానికోసం తన సలహా కావాలని అడిగారు. ట్రంప్ అదంతా సరదాగా అడగడంతో అతనికి సహాయం చేసే ఉద్దేశంతో ఆమె అతనితోపాటు ఆరో ఫ్లోర్ కి వెళ్ళింది.

వీరు వెళ్లేసరికి సదర సెక్షన్ లో ఎవరూ లేరు. ఆ సమయంలో దుస్తులు మార్చుకునే ట్రయల్ రూంలోకి వచ్చిన డోనాల్డ్ ట్రంప్ జీన్ కారోల్ మీద అత్యాచారానికి పాల్పడ్డాడు. అని ఆమె తరపు న్యాయవాది చెబుతున్నారు. అయితే అప్పట్లో అత్యాచార బాధితురాలుగా తనను తాను చూసుకోవడం ఇష్టపడని కారొల్.. దీంతోపాటు ఆ ఘటనతో షాక్ లో ఉండడంతో పోలీసులకు ఫిర్యాదు చేయలేదని న్యాయవాది చెప్పుకొచ్చారు.

కారోల్, ఎల్లే మ్యాగజైన్ మాజీ కాలమిస్ట్, ఆమె దావా 1995 చివరలో లేదా 1996 ప్రారంభంలో బెర్గ్‌డార్ఫ్ గుడ్‌మాన్ డిపార్ట్‌మెంట్ స్టోర్ డ్రెస్సింగ్ రూమ్‌లో ట్రంప్ తనపై అత్యాచారం చేశాడని చెప్పింది. అప్పట్లో తాను దీనిమీద మాట్లాడితే.. ట్రంప్ తన ట్రూత్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లో తన రేప్ క్లెయిమ్‌ను బూటకం, అబద్ధం “పూర్తి కాన్ జాబ్” అని పిలవడం ద్వారా తన పరువు తీశారని… ఆమె తను ఆ “రకం” కాదని, అందుకే తన పరువు, ప్రతిష్టల్ని తిరిగి పొందడానికే దావా వేసినట్లు కారోల్ చెప్పారు.

#MeToo ఉద్యమం నుండి ప్రేరణ పొందిన కారోల్ 2019లో ముందుకు వచ్చారు. ఈ జీన్‌ కారోల్‌ పై లైంగింక దాడికి ట్రంప్‌ పాల్పడినట్లు న్యాయవాదులు నిర్ధారించారు. ఇకపోతే “ఇది రేప్ క్లెయిమ్, ఇది రేప్ కేసు కావడంతో జ్యూరీ దానిని తిరస్కరించినట్లు అతని న్యాయవాది జో టాకోపినా కోర్టు వెలుపల చెప్పారు. ట్రంప్‌ను జ్యూరీ దోషిగా అతను ఈ ఘటనకి పాల్పడినట్లు న్యాయస్థానం నిర్ధారణ చేసింది. ట్రంప్ న్యాయవాదులు కొత్త విచారణను కోర్డులో కోరడం జరిగింది.

అతను నిర్దోషి..
ట్రంప్‌ న్యాయవాదులు కోర్టులో కొత్త విషయాన్ని వాధినకు తీసుకువచ్చారు. ఇది ఏ మాత్రం కూడా లైంగిక దాడి కాదని కేవలం తనకు ఒక ఆశీర్వాదం లాంటిదని దీనిని లైంగిక దాడిగా పరిగణించవద్దని ట్రంప్‌ తరపు న్యాయవాదులు వాదించారు. ఈ సివిల్‌ దావాలో ట్రంప్‌కు వ్యతిరేకంగా జ్యూరీ 5మిలియన్ల డాలర్లను విధించడం సరికాదని న్యాయవాదులు వాధిస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బీజేపీ స‌ర్కార్ తెలంగాణ‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర‌ జ‌రుపుతుందా?

Most Popular