Sunday, May 19, 2024

కీలక నేత చెప్తేనే చేశాం…

  • కీలక నేత చెప్తేనే చేశాం
  • ప్రణీత్​రావు రిమాండ్​రిపోర్ట్​లో వెల్లడి
  • కోర్టుకు నివేదించిన పోలీసులు

టీఎస్​, న్యూస్​ : బీఆర్ఎస్​ కీలక నేత ఇచ్చిన నెంబర్లను ట్యాప్​ చేశానని, ఎస్​బీఐ మాజీ చీఫ్​ ప్రభాకర్​రావు నుంచి వచ్చిన సమాచారాన్ని తిరిగి బీఆర్ఎస్​ కీలక నేతకు చేరవేశామని ఫోన్ ట్యాపింగ్​ ప్రధాన నిందితుడు ప్రణీత్​రావు వెల్లడించారు. ఈ మేరకు ప్రణీత్​రావుతో పాటుగా తాజాగా అరెస్ట్​ అయిన అడిషనల్​ఎస్పీ భుజంగరావు, తిరుపతన్న రిమాండ్​ రిపోర్ట్​ను పోలీసులు కోర్టుకు నివేదించారు. స్పెషల్​ ఇంటలీజెన్సీ బ్రాంచ్​ మాజీ చీఫ్​ ప్రభాకర్​రావు చెబితేనే ట్యాపింగ్​ చేశామని ఈ సందర్భంగా వెల్లడించారు. రాష్ట్రంలో జరిగిన ఉప ఎన్నికలన్నింటా ఆయా పార్టీలు నేతల ఫోన్లన్నీ ట్యాప్​ చేశామని తెలిపారు. అంతేకాకుండా ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో ఫోన్లు ట్యాప్​ చేసినట్లు నిందితులు ఒప్పుకున్నారు.

ఒక్కొక్కటిగా వెలుగులోకి..!
రాష్ట్రంలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో దిమ్మతిరిగిపోయే నిజాలు బయటపడుతున్నాయి. ఇప్పటికే ప్రణీత్ రావు, తిరుపతన్న, భుజంగరావు విచారించగా.. వాళ్లు వెల్లడించిన సంచలన విషయాలను పోలీసులు రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొన్నారు. అరెస్ట్ అయిన ముగ్గురు అధికారులు కూడా మాజీ ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు చెప్తేనే చేశామని వెల్లడించినట్టు రిపోర్టులో పేర్కొన్నారు. అయితే.. ప్రణీత్ రావును ఏడు రోజుల కస్టడీకి తీసుకున్న పోలీసులు ఈ కేసుకు సంబంధించిన పలు కీలక విషయాలు రాబట్టినట్టు తెలుస్తోంది.

ALSO READ: మెమోలు, షోకాజ్‌లు ఇచ్చినా మేమింతే..!

“ప్రభాకర్ రావు చెప్తేనే ఫోన్ ట్యాపింగ్ చేశా. పలు సందర్భాల్లో భుజంగరావు, తిరుపతన్న ఇచ్చిన నెంబర్లను టాప్ చేశాను. ఎన్నికల సమయంలో వందల మంది రాజకీయ నేతల ఫోన్లు ట్యాప్ చేశాం. రాజకీయ నేతల కదలికలు నిధుల సమీకరణపై దృష్టి పెట్టాం. పలువురు రాజకీయ నేతల ఫోన్లతో పాటు వారి కుటుంబ సభ్యులు, అనుచరుల ఫోన్లు కూడా ట్యాప్ చేశాం. రాష్ట్రంలోని వ్యాపారవేత్తలతో పాటు సమాజంలో పేరు ఉన్న కొందరి ఫోన్లు కూడా టాప్ చేశాం. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రోజు కూడా ప్రభాకర్ రావు చెప్పిన తీరుగానే వ్యవహరించాను.” అని ప్రణీత్ రావు వెల్లడించినట్టు రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు. ట్యాపింగుకు సంబంధించిన మెయిన్ డివైస్‌ని పూర్తిగా ధ్వంసం చేశానని ప్రణీత్ రావు వెల్లడించారు. మొత్తం 17 కంప్యూటర్లలో ఉన్న హార్డ్ డిస్కులు అన్నింటినీ ధ్వంసం చేసినట్టుగా చెప్పారు. హార్డ్ డిస్కులు, ప్రధాన డివైస్‌ని కట్టర్‌తో ముక్కలు ముక్కలుగా కట్ చేశామని తెలిపారు. ముక్కలుగా చేసిన హార్డ్ డిస్కులు, డివైజ్‌లను తీసుకువెళ్లి మూసీ నదిలో పడేశామని వివరించారు. అంతేకాకుండా.. రెండు లాగర్ రూములలో ఉన్న డాక్యుమెంట్లు అన్నింటినీ తగలబెట్టేసామని ప్రణీత రావు.. విచారణాధికారులకు చెప్పుకొచ్చారు.

అంతేకాకుండా ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలోనూ ఫోన్లు ట్యాపింగ్​ చేశామని ప్రణీత్​రావు తెలిపాడు. 2019 జనరల్​ ఎలక్షన్స్​, మునుగోడు, హుజురాబాద్​, దుబ్బాక ఉప ఎన్నికల సమయంలోనూ ఫోన్లను ట్యాంరింగ్​ చేవామని, తాజాగా అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ ప్రత్యర్థుల డబ్బులే టార్గెట్​గా ట్యాంపరింగ్​ పాల్పడినట్లు ప్రణీత్​రావు ఒప్పుకున్నాడు.

బీఆర్ఎస్​ కీలక నేత నుంచి నెంబర్లు
ఇక, భుజంగరావు కూడా కీలక విషాలు వెల్లడించినట్టు పోలీసులు రిమాండ్​రిపోర్ట్​లో పేర్కొన్నారు. బీఆర్ఎస్ కీలక నేత ఇచ్చిన నెంబర్లనే ట్యాప్ చేశామని భుజంగరావు తెలిపారు. బీఆర్ఎస్ నేత ఇచ్చే నెంబర్లను ఎప్పటికప్పుడు ప్రణీతరావుకి పంపించేవాళ్లమని, ప్రణీత్ రావు ఇచ్చే సమాచారాన్ని తిరిగి బీఆర్ఎస్ కీలక నేతకు చేరేవేశామని వివరించారు. గత అసెంబ్లీ ఎన్నికల ముందు చాలామంది రాజకీయ నేతల ఫోన్లను వారి కుటుంబ సభ్యుల నెంబర్లను ట్యాప్ చేశామని భుజంగరావు వెల్లడించినట్టుగా రిపోర్టులో పోలీసులు తెలిపారు. మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధా కిషన్ రావు ఇచ్చే నెంబర్లను ప్రణీతరావుకి ఇచ్చానని తిరుపతన్న తెలిపారు. హైదరాబాద్ సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు డీసీపీ షేర్ చేశారని, ఆయన చెప్పిన నెంబర్లతో పాటు కొంతమంది కదిలికలను కూడా ట్రాక్ చేశామని చెప్పినట్లు రిమాండ్​ రిపోర్ట్​లో వెల్లడించారు. చెప్పుకొచ్చారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బీజేపీ స‌ర్కార్ తెలంగాణ‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర‌ జ‌రుపుతుందా?

Most Popular