Tuesday, May 14, 2024

నవనీత్ శ్రీరామ్‌ దర్శకత్వంలో ప్రియదర్శి

నారాయణ్ దాస్ నారంగ్ ఆశీస్సులతో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి ప్రొడక్షన్ నెం. 9ని అనౌన్స్ చేశారు. తన కెరీర్‌లో వరుసవిజయాలతో దూసుకుపోతున్న ప్రియదర్శి హీరోగా రూపొందనున్న ఈ చిత్రాన్ని రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా సగర్వంగా ప్రెజెంట్ చేస్తోంది. ప్రతిష్టాత్మక టైమ్స్ పవర్ ఉమెన్ 2024 అవార్డును అందుకున్న జాన్వీ నారంగ్‌నిర్మాతగా మేడిన్ ప్రొడక్షన్ గా రూపొందనున్న ఈ చిత్రంతో నవనీత్ శ్రీరామ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. బలగంతో పెద్ద విజయాన్ని అందుకున్న ప్రియదర్శి ఈ ఏడాది ఓం భీమ్ బుష్‌తో బ్లాక్‌బస్టర్‌ని అందుకున్నాడు.

సేవ్ ది టైగర్స్ ఫ్రాంచైజీ తెలుగు ఒరిజినల్ ఆల్ టైమ్‌లో అతిపెద్ద హిట్ గా నిలిచింది. ప్రియదర్శికి వండర్ ఫుల్ ఫిల్మ్స్ లైనప్ లో వున్నాయి. ఈ కొత్త చిత్రం సరికొత్త కాన్సెప్ట్‌తో కూడిన రొమాంటిక్ స్టొరీ, ఇందులో ప్రియదర్శి డిఫరెంట్ హిలేరియస్ పాత్రలో కనిపించనున్నారు. “థ్రిల్-యు ప్రాప్తిరస్తు” అనే క్యాచీది ట్యాగ్‌లైన్. ఈ ట్యాగ్ లైన్ సినిమా ఎలాంటి అనుభూతిని ఇవ్వబోతోందో తెలియజేస్తుంది. జాన్వీ నారంగ్, సునీల్ నారంగ్, భరత్ నారంగ్ మార్గదర్శకత్వంలో కొన్ని కంటెంట్-రిచ్ సినిమాలు చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. తొలి ప్రయత్నంలో వస్తున్న ఈ చిత్రం అన్ని వర్గాలను ఆకట్టుకునే అవుట్-అండ్-అవుట్-ఎంటర్టైనర్ గా ఉండబోతుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బీజేపీ స‌ర్కార్ తెలంగాణ‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర‌ జ‌రుపుతుందా?

Most Popular