Friday, May 17, 2024

తెలంగాణ నుంచి లోక్సభ బరిలో రాహుల్ గాంధీ

లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో పోటీ చేయాలని రాహుల్ గాంధీ గారిని కోరిన ఇండియన్ ఓవరసీస్ కాంగ్రెస్ నేతలు, సానుకూలంగా స్పందించిన రాహుల్ గాంధీ

రెండు రోజుల పర్యటన నిమిత్తం లండన్ వెళ్లిన రాహుల్ గాంధీని గురువారం నాడు ఇండియన్ ఓవర్సీస్ యు.కే. శాఖ ఉపాధ్యక్షులు, తెలంగాణ వాసి రంగుల సుధాకర్ గౌడ్ రాహుల్ గాంధీ గారిని కలుసుకున్నారు.

రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో తెలంగాణ నుండి పోటీ చేయాలని ఆయన కోరారు.

రాహుల్ గాంధీ తెలంగాణ నుండి పోటీ చేస్తే ఆ ప్రభావం తెలంగాణపైనే కాకుండా దక్షిణ భారతదేశంపై ఉంటుందని, కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు సునాయాసంగా గెలుస్తుందని సూచించారు.

తన విజ్ఞప్తికి రాహుల్ గాంధీ గారు సానుకూలంగా స్పందించారని ఆయన తెలిపారు. సుధాకర్ గౌడ్ వెంట యు.కే.ఓవర్సీస్ తెలంగాణ నాయకులు గంప వేణుగోపాల్ తదితరులు ఉన్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బీజేపీ స‌ర్కార్ తెలంగాణ‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర‌ జ‌రుపుతుందా?

Most Popular