Saturday, September 21, 2024

శ్రీరామచంద్రుడి నిజమైన వారసుడు రాహుల్ గాంధీయే

  • శ్రీరామచంద్రుడి నిజమైన వారసుడు రాహుల్ గాంధీయే
  • అధికారంలో నుంచి వచ్చిన లీడర్ మోడీ
  • ప్రజల నుంచి వచ్చిన లీడర్ రాహుల్ గాంధీ
  • రాహుల్‌గాంధీకి, మోడీకి చాలా వ్యత్యాసం ఉంది

శ్రీరామచంద్రుడి నిజమైన వారసుడు రాహుల్ గాంధీయేనని సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పేర్కొన్నారు. గాంధీభవన్‌లో ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ అధికారంలో నుంచి వచ్చిన లీడర్ మోడీ అయితే, ప్రజల నుంచి వచ్చిన లీడర్ రాహుల్ గాంధీ అని ఆయన కొనియాడారు. ప్రధాని మోడీ సీల్డ్‌కవర్‌లో వచ్చిన నేతగా ఆయన అభివర్ణించారు. రాహుల్‌గాంధీ చరిత్ర, రాజకీయం మీద బిజెపి నేతలు అతిగా మాట్లాడుతున్నారని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి మండిపడ్డారు. బిజెపి నాయకులకు తానొకటి స్పష్టంగా చెబుతున్నానని, దేశ రాజకీయాలు రాహుల్ గాంధీ, మోడీ చుట్టే తిరుగుతున్నాయన్నారు. రాహుల్‌గాంధీకి, మోడీకి చాలా వ్యత్యాసం ఉందని ఆయన పేర్కొన్నారు. రాహుల్ గాంధీ ప్రధాని కావాలి అనుకుంటే యూపిఏ హయాంలోనే ప్రధాని అయ్యే వారని, మన్మోహన్ సింగ్ ప్రధాని కావాలన్న ఉద్ధేశ్యంతోనే రాహుల్ గాంధీ ఆయన్ను ప్రధాని చేశారన్నారు.

కిషన్ రెడ్డి, ఈటల, బండి సంజయ్‌లు జై శ్రీరామ్ అనకతప్పదు

మోడీ సీల్డ్ కవర్ గుజరాత్ సిఎం అని జగ్గారెడ్డి ఎద్దేవా చేశారు. అద్వానీ రథయాత్ర పూర్తయ్యాక, మోడీని గుజరాత్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా సీల్డ్‌వర్‌లో ఎంపిక చేశారన్నారు. రథయాత్రకు ముందు మోడీ అంటే ఎవరో గుజరాత్, దేశానికి తెలియదన్నారు. దానిపై బిజెపి నేతలు వివరణ ఇవ్వగలరా? అని ఆయన ప్రశ్నించారు. రాహుల్ గాంధీ అనేక రాష్ట్రాల సిఎంలను సీల్డ్ కవర్‌లో డిసైడ్ చేస్తారని, సిఎంలను డిసైడ్ చేసే రాహుల్‌కు, సీల్డ్ కవర్ సిఎం మోడీకి చాలా తేడా ఉందని జగ్గారెడ్డి ఎద్దేవా చేశారు. మోడీ ప్రధాని కాకముందు ఏ పోరాటం చేశారో బిజెపి నేతలు చెప్పాలని జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. పేదల కోసం రాముడు పాలన చేశారని, గుడి నిర్మాణం చేస్తే రాముడు సంతోషిస్తానని చెప్పలేదని జగ్గారెడ్డి పేర్కొన్నారు. కిషన్ రెడ్డి, ఈటల, బండి సంజయ్‌లు రాజకీయంగా బతకాలంటే జై శ్రీరామ్ అనకతప్పదని జగ్గారెడ్డి స్పష్టం చేశారు.

గుళ్లు కడితే ఉద్యోగాలు వస్తాయా?

రామాలయ నిర్మాణంతో దేశంలో సమస్యలు పోయాయా అని జగ్గారెడ్డి ప్రశ్నించారు. గుళ్లు కడితే ఉద్యోగాలు వస్తాయా? యువత ఆలోచించాలని ఆయన పిలుపునిచ్చారు. శ్రీరామచంద్రుని నిజమైన వారసుడు రాహుల్ గాంధీయేనని ఆయన పేర్కొన్నారు. మోడీ ఎప్పుడు ప్రజలతో మమేకమైన నాయకుడు కాదని, మహాత్మా గాంధీ స్వాతంత్య్ర ఉద్యమంలో కాలినడక చేసిన మాదిరి రాహుల్ గాంధీ దేశ వ్యాప్తంగా పాదయాత్ర చేశారని, పేదలను అభివృద్ధి పథంలోకి తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నారని ఆయన వివరించారు. ఎస్సీ, ఎస్టీ, బిసి,మైనారిటీ అన్ని వర్గాల ప్రజలను ఆర్థికంగా బలోపేతం కోసం ఆలోచన చేసే వ్యక్తి రాహుల్ గాంధీ అని, మేధావులతో క్షేత్రస్థాయి పరిస్థితులను తెలుసుంటూ ప్రజల అవసరాలను గుర్తిస్తున్నారన్నారు. ప్రజల కష్ట, నష్టాలను తెలుసుకునేందుకు భారత్ జోడో, న్యాయ యాత్రలను రాహుల్‌గాంధీ చేశారన్నారు. తెలంగాణలో 14 స్థానాలు ఇచ్చి రాహుల్ గాంధీని ప్రధానిగా చేసుకునేందుకు వెన్నెముకలుగా మన ఎంపిలు నిలుస్తారన్నారు. సీట్ల కేటాయింపులతో సమస్యలు పరిష్కారం అయిపోవని, కొందరికీ సీట్ల విషయంలో అన్యాయం జరగవచ్చని, కానీ, అది ఒక్కరి సమస్య కాదని ఆయన అన్నారు. 65 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో రూ. 56 లక్షల కోట్లు అప్పు ఉంటే పదేళ్ళలో మోడీ పాలనలో అప్పులు డబుల్ అయ్యాయన్నారు. మోడీకి రాముడు అప్పులు చేయమని చెప్పారా? ఏ గ్రంథంలో అప్పులు చేయమని ఉందో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొట్టడం కుట్రే... ఇందులో జ‌గ‌న్ పాత్ర ఉంది అన్న వర్ల రామయ్య వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular