Friday, May 9, 2025

రాజాసింగ్​.. లోన్​ ఈఎంఐ చెల్లించడం లేదట

టెలీ కాలర్​పై మండిపడ్డ ఎమ్మెల్యే

టీఎస్​, న్యూస్​: టెలీ కాలర్‌పై గోషా మహాల్ ఎమ్మెల్యే, బీజేపీ నాయకుడు రాజా సింగ్ మండిపడ్డారు. “ మీరు బైక్‌ కొనుగోలు కోసం లోన్ తీసుకున్నారు.. బ్యాంక్ లోన్ చెల్లించాలంటూ” ఎమ్మెల్యే రాజా సింగ్‌కు మంగళవారం ఓ ప్రైవేట్ బ్యాంక్‌ తరఫున టెలీ కాలర్ ఫోన్ చేశారు. ఎవరి పడితే వారు నెంబర్ ఇస్తే.. ఇలా కాల్ చేస్తారా? అంటూ సదరు టెలీ కాలర్‌పై ఎమ్మెల్యే రాజసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం టెలీ కాలర్‌తో ఎమ్మెల్యే రాజాసింగ్ మాట్లాడుతూ.. నేను ఇర్ఫాన్ కాదమ్మ.. ఎమ్మెల్యే రాజసింగ్‌నని ఆమెకు స్పష్టం చేశారు.

అయితే, షేక్ మహమ్మద్ పేరు మీద వాహనం తీసుకున్నారని, ఆ క్రమంలో ఇర్ఫాన్ పేరుతో మీ నంబర్ ఇచ్చారని ఎమ్మెల్యే రాజా సింగ్‌కు టెలీకాలర్ వివరించింది. బైక్ లోన్ తీసుకున్న వాళ్లు మీ నెంబర్ ఇచ్చారని.. ఈ నేపథ్యంలో మీకు కాల్ చేశానని టెలీ కాలర్ ఎమ్మెల్యే రాజా సింగ్‌కు తెలిపింది. అందుకు రాజాసింగ్​ వివరణ ఇస్తూ.. తన గురించి.. గూగల్, యూ ట్యూబ్‌లలో సెర్చ్ చేసి తెలుసుకోవాలంటూ.. టెలీ కాలర్‌కు ఎమ్మెల్యే రాజసింగ్ సూచించారు. మరోవైపు బైక్ లోన్ తీసుకొన్న వ్యక్తులు.. ఎమ్మెల్యే రాజాసింగ్ ఫోన్ నెంబర్ ఇచ్చినట్లు సదరు బ్యాంక్ సిబ్బంది గుర్తించారు.

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com