Wednesday, November 6, 2024

Rave party in KTR brother in law: కేటీఆర్ బావమరిది ఫామ్‌హౌస్‌లో రేవ్ పార్టీ .. కేసు నమోదు

జన్వాడ ఫామ్ హౌస్ మరోసారి వివాదాలకు కేంద్రబిందువైంది. వార్తల్లోకెక్కింది. మాజీ మంత్రి, భారత్ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల అలియాస్ రాజేంద్ర ప్రసాద్ పాకాలకు చెందిన ఈ ఫామ్ హౌస్‌లో రేవ్ పార్టీ నిర్వహించడం దీనికి కారణం.ఈ రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. ఫామ్ హౌస్ యజమాని రాజ్ పాకాల సహా పలువురిపై కేసు నమోదు చేశారు. ఈ రేవ్ పార్టీలో పాల్గొన్న విజయ్ మద్దూరి అనే వ్యక్తితో పాటు మరొకరు డ్రగ్స్ తీసుకున్నట్లు అనుమానాలు వ్యక్తం కావడంతో వారిని వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి పంపించారు.

జన్వాడ ఫామ్ హౌస్‌లో రేవ్ పార్టీ జరుగుతున్నట్లు పక్కా సమాచారం అందడంతో శనివారం రాత్రి నార్సింగి పోలీసులు, స్పెషల్ ఆపరేషన్స్ టీమ్, ఎక్సైజ్ అధికారులు, స్నిఫర్ డాగ్స్ సిబ్బంది జాయింట్ ఆపరేషన్‌ చేపట్టారు. ఈ సందర్భంగా రేవ్ పార్టీలో పాల్గొన్న 35 మందిని అరెస్ట్ చేశారు. అరెస్టయిన వారిలో 21 మంది పురుషులు, 14 మంది మహిళలు ఉన్నారు. ఫామ్ హౌస్ నుంచి భారీ సంఖ్యలో మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ రేవ్ పార్టీలో పాల్గొన్న విజయ్ మద్దూరి అనే వ్యక్తి కొకైన్ తీసుకున్నట్లు అనుమానాలు వ్యక్తం కావడంతో పాజిటివ్ టెస్ట్‌లను నిర్వహించారు. తదుపరి వైద్య పరీక్ష కోసం ఆసుపత్రికి తరలించారు. అతనిపై నార్కొటిక్స్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ చట్టంలోని సెక్షన్ 27 కింద కేసు నమోదు చేశారు.

ఎలాంటి అనుమతులు, ఎక్సైజ్ లైసెన్స్ గానీ లేకుండా ఈ రేవ్ పార్టీలో విచ్చలవిడిగా మద్యాన్ని విక్రయించినందు వల్ల ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ అధికారులు రాజ్ పాకాలపై సెక్షన్ 34 ఏ, 34 (1), 9 కింద కేసులు నమోదు చేశారు. అనధికారంగా మద్యం విక్రయించడం, మాదక ద్రవ్యాల వినియోగం కింద కేసులు పెట్టారు.జన్వాడ ఫామ్ హౌస్‌పై గతంలో వివాదాలు చెలరేగిన విషయం తెలిసిందే. బఫర్ జోన్ పరిధిలో దీన్ని నిర్మించారని, హైడ్రా కూల్చివేస్తుందంటూ వార్తలొచ్చాయి. ఇది కేటీఆర్‌దేనంటూ అప్పట్లో విమర్శలు తలెత్తాయి. దీన్ని ఆయన తోసిపుచ్చారు. తన పేరు మీద ఎలాంటి ఫామ్ హౌస్‌లు లేవని తేల్చి చెప్పారు. ఇప్పుడు ఈ ఫామ్ హౌస్ ఆయన బావమరిదిదని తేలడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

మూసీ ప్రాంతంలో కేసీఆర్‌కు ఇల్లు, బెడ్ ఏర్పాటు చేసిన కాంగ్రెస్ నాయకుల నిర్ణయాన్ని మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular