Tuesday, March 11, 2025

భువనగిరి పాదాల వద్ద గగనమంత ఎత్తున ఎగిసిన అభిమాన కెరటాలు

  • కాంగ్రెస్‌కు.. కామ్రేడ్లకు కుదిరిన దోస్తీ ఇది.. కంచుకోటపై ఎగురుతుంది గెలుపు జెండా
  • ఆసక్తికర ట్వీట్ చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

భువనగిరి పాదాల వద్ద గగనమంత ఎత్తున ఎగిశాయి అభిమాన కెరటాలు. త్యాగాల స్థూపాల సాక్షిగా సాగిన జైత్రయాత్ర ఇది. కాంగ్రెస్‌కు.. కామ్రేడ్లకు కుదిరిన దోస్తీ ఇది.. కంచుకోటపై ఎగురుతుంది గెలుపు జెండా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్ చేశారు. తాజాగా భువనగిరి కాంగ్రెస్ ఎంపి అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి నామినేషన్ సందర్భంగా కార్నర్ మీటింగ్‌లో పాల్గొన్న వీడియోను సిఎం రేవంత్ పోస్ట్ చేశారు. దీంతోపాటు దీనిని ట్వీట్ చేశారు.

కాగా, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని ఇటీవల ప్రకటనలో తాము పోటీలో లేని చోట తప్పకుండా కాంగ్రెస్‌కు మద్దతు ఉంటుందన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే లోక్‌సభ ఎన్నికల్లో కమ్యూనిస్టులతో కలిసి పోటీ చేయాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఇటీవల కామ్రేడ్లతో డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. ఇందుకు సిపిఐ, సిపిఎం పార్టీలు సానుకూలంగానే ఉన్నాయి.

ప్ర‌దాన వార్త‌లు

ఆ మనిషి కార్పొరేట‌ర్‌కు ఎక్కువ... ఎమ్మెల్యేకు త‌క్కువ: పవన్ పై జ‌గ‌న్‌ కామెంట్స్ ను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com