Thursday, December 26, 2024

‌భూమి లేని నిరుపేదలకు రూ. 12000

సుమారు 15 లక్షల కుటుంబాలకు  లబ్ది
1000 కోట్లు విడుదల చేసే
యోచనలో ప్రభుత్వం మంత్రి పొంగులేటి చిట్‌ ‌చాట్‌..

‌భూమి లేని నిరుపేదలకు 12000 ఇవ్వడం ద్వారా  సుమారు 15 లక్షల కుటుంబాలకు  లబ్ది చేకూరనున్నదని మంత్రి పొంగులేటి  శ్రీనివాస రావు పేర్కొన్నారు. సోమవారం అసెంబ్లీ లాబీలో మీడియాతో మంత్రి  చిట్‌ ‌చాట్‌ ‌నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లా డుతూ..  ఇందుకోసం 1000 కోట్లు విడు దల చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నదని..  సంక్రాతి కి రైతు భరోసాతో పాటు ఆసరా పెన్షన్‌ ‌ల విడుదలకు యత్నిస్తున్నాం. గత రెండు మూడు సంవత్సరాల నుండి పోల్చుకుంటే స్థాంప్స్ ‌మరియు రిజిస్ట్రేషన్‌ ఆదాయం పెరిగింది. గత మూడు నెలల నుండి రియల్‌ ఎస్టేట్‌ ‌పెరిగింది. ఏపీ లో కొత్త గవర్నమెంట్‌ ఏర్పడ్డాక తెలంగాణ రియల్‌ ఎస్టేట్‌ ‌పై కొంత అభద్రత భావం ఉండేది…ఇటీవల ప్లడ్‌ ఎఫెక్ట్ ‌తో అది తొలగిపోయింది. మళ్ళీ ఇప్పుడు అందరు తెలంగాణ బాట పట్టారు. స్పీకర్‌ ‌కు బట్టి పై ప్రైవిలేజ్‌ ‌మోషన్‌ ఇవ్వడం అర్ధరహితం. కార్పొరేషన్‌ ‌లు ఒక్క రూపాయి కూడా స్వంతంగా జనరేట్‌ ‌చేసుకునే పరిస్థితి లేదు. గత ప్రభుత్వం 7లక్షల కోట్ల అప్పు వాస్తవం. ప్రభుత్వంను బదనాం చేయాలని బీఆర్‌ఎస్‌ ‌చూస్తుంది. చర్చ నుండి తప్పించుకునేందుకే అనవసర లొల్లి చేస్తుంది.

బీఆర్‌ఎస్‌ అధినేత కేసిఆర్‌ అసెంబ్లీకి వస్తే బాగుంటది. సన్న వడ్లకు బోనస్‌ ‌వచ్చే పంటకు కూడా ఇస్తాం. కొంతమంది ఆంధ్ర నుండి బోనస్‌ ‌కోసం తెలంగాణ లో వడ్లు అమ్మే ప్రయత్నం ను అడ్డుకుంటున్నాం. ఇండస్ట్రీ పాలసీ లో పెట్టుబడులు ఎవరన్నది ముఖ్యం కాదు. పెట్టుబడులు ఎవరు పెట్టినా తెలంగాణ రాష్ట్రానికి ఉపయోగం జరగాలి. సినీ పరిశ్రమ ను మా ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. మాకు సినిమా వాళ్లు, జర్నలిస్టులు, ప్రజలు అందరు సమానమే అని  పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.  హైదరాబాద్‌ ‌రియలేస్తెట్‌ ‌పడిపోలేదు …చంద్రబాబు రాగానే అక్కడికి పోతుంది అనే ప్రచారం మాత్రమే.  అమరావతి లో వరద వల్ల ఏపీకి ఇన్వెస్ట్మెంట్‌ ‌వెళ్లే పరిస్థితి లేదు. అమరావతిలో వరద వల్ల ఇన్వెస్ట్మెంట్‌ ‌పెట్టే వాళ్లకు బయం పట్టింది. హైదరాబాద్‌ – ‌బెంగుళూరు కు ఇన్వెస్టర్లు వస్తున్నారు.

హైడ్రా బయం ప్రజల్లో మాత్రం లేదు..మొదట్లో తప్పుడు ప్రచారం జరిగినా ఇప్పుడు నిజం తెలిసింది. అప్పుల పై కేటీఆర్‌ ‌బిఆర్‌  ‌నిజాలు తెలుసుకోవాలి. కార్పొరేషన్‌ ‌లోన్స్ ‌తో కలిపి మొత్తం లెక్కలు బయటపెట్టాలి కేటీఆర్‌, ‌బి.ఆర్‌.ఎస్‌ ‌వాళ్ళు. కార్పొరేషన్‌ ‌పేరుతో చేసే అప్పులు సైతం ప్రభుత్వం ఖాతాలోకి వస్తాయి అనేది కేటీఆర్‌ ‌తెలుసుకోవాలి. 7లక్షల 20వేల కోట్లు తెలంగాణ రాష్ట్రానికి అప్పులు ఉన్నాయి. శాసన సభలో ఎవరి పాత్ర వారిదే…ప్రివిలేజ్‌ ‌మోషన్‌ ఇవ్వడం వాళ్ల హక్కు. కేసీఆర్‌ అసెంబ్లీకి రాకుండా కోసరుతో కొట్లాడుతున్నారు. కేసీఆర్‌ అసెంబ్లీకి వస్తె ఆయనతో కూర్చొని మాట్లాడే కోరిక నాకు వ్యక్తిగతంగా ఉంది. స్టాంప్స్ అం‌డ్‌ ‌రిజిస్ట్రేషన్‌ ‌డిపార్ట్మెంట్‌ ‌లో ఆదాయం పెరుగుతుంది. కాంగ్రెస్‌ ఏడాది కాలం పై ఎలాంటి వ్యతిరేకత లేదు…వైఎస్‌ఆర్‌ ‌సమయంలో ఇలానే ప్రచారం జరిగింది. రెండు మూడు ఏళ్ళల్లో అన్ని సర్దుకున్నాయి…వర్షాలు భాగా పడ్డాయి. అదాని విషయంలో కాంగ్రెస్‌ ‌పార్టీ జాతీయ పాలసీ నే రాష్ట్రంలో అమలు జరుగుతుంది.

ప్ర‌దాన వార్త‌లు

అల్లు అర్జున్ పట్ల రేవంత్ రెడ్డి దారుణంగా వ్యవహరిస్తున్నారన్న డీకే అరుణ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com