Friday, May 23, 2025

సెక్రేటేరియేట్​ ఉద్యోగికి హార్ట్​ స్ట్రోక్​

  • సెక్రేటేరియేట్​ ఉద్యోగికి హార్ట్​ స్ట్రోక్​
  • సచివాలయంలో వేధింపులు
  • సీనియర్​ ఐఏఎస్​ పై ఆగ్రహం

సీనియర్ ఐఏఎస్ అధికారి వేధింపులు భరించలేక సెక్రటేరియట్ ఉద్యోగి గుండెపోటుతో మరణించడం ఉద్యోగ వర్గాల్లో కలకలం రేపింది. రాహుల్ అనే ఉద్యోగి కార్మిక, ఉపాధి కల్పన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాణి కుముదిని వద్ద పీఏగా పని చేస్తున్నాడు. శుక్రవారం పని ఎక్కువగా ఉందని, ఐఏఎస్​ అధికారిణి వేధిస్తున్నారంటూ రాహుల్​ గుండెపొటుతో మరణించినట్లు ఉద్యోగులు ఆరోపించారు. రాహుల్ కు స్ట్రోక్​ రావడంతో వెంటనే నిమ్స్​కు తరలించారు. అయితే, ముందుగా సోమాజిగూడ యశోద కు తరలించాలని భావించగా… అక్కడ వైద్య ఖర్చులు ఎక్కువ అవుతాయని నిమ్స్​కు తరలించినట్లు ఉద్యోగులు ఆరోపించారు. రాహుల్​ మృతి వార్త తెలియగానే.. ఉద్యోగులు సీఎస్​ను కలిసేందుకు వెళ్లారు. రాణి కుముదిని సీరియస్​గా మందలించడంతో ఆయన చనిపోయినట్లు ఆరోపించారు.

అయితే, గత కొన్ని రోజులుగా పని ప్రదేశంలో రాణి కుముదిని ఇబ్బందులకు గురి చేస్తున్నారని తోటి ఉద్యోగులు ఆరోపించారు. సెక్రటేరియ ట్‌లోని రాణి కుముదిని ఛాంబర్ ముందు సచివాలయ ఉద్యోగులు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. చనిపోయిన రాహుల్ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

ప్ర‌దాన వార్త‌లు

కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలపై బీఆర్ఎస్ నేత హరీశ్ రావు తీవ్ర వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com