Sunday, May 18, 2025

మత పరమైన విద్వేషాలను ప్రధాని మోడీ రెచ్చగొడుతున్నారు

  • కేంద్ర హోంమంత్రి స్థాయికి తగ్గట్టుగా అమిత్ షా మాట్లాడడం లేదు
  • కాంగ్రెస్ సీనియర్ నేత నిరంజన్ ఆగ్రహం

ప్రధాని మోడీ రోజు మత పరమైన విద్వేషాలు రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నారని, అమిత్ షా కేంద్ర హోంమంత్రి అయి ఉండి ఆయన స్థాయికి తగ్గ మాటలను మాట్లాడడం లేదని కాంగ్రెస్ సీనియర్ నేత నిరంజన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గాంధీభవన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ చిన్నారులను ఎన్నికల్లో పయోగించకూడదని ఈసీ నిబంధనను వారు తుంగలో తొక్కారని ఆయన విమర్శించారు.

బిజెపి గెలిస్తే రాజ్యాంగ పీఠికను సవరిస్తామని బిజెపి ప్రధాన కార్యదర్శి దుష్యంత్ కుమార్ అంటున్నారని, రాజ్యాంగ పీఠికను, సెక్యులర్ పదాన్ని మార్చబోమని రాజనాథ్ సింగ్ చెబుతున్నారని, ఇద్దరిలో ఎవరి మాటలు నమ్మాలో అర్థం కావడం లేదని ఆయన అన్నారు.

ప్ర‌దాన వార్త‌లు

కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలపై బీఆర్ఎస్ నేత హరీశ్ రావు తీవ్ర వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com