Sunday, May 19, 2024

హైదరాబాద్ పార్లమెంట్ కో ఆర్డినేషన్ సమావేశంలో భగ్గుమన్న విభేదాలు

నాయకుల జోక్యంతో సద్దుమణిగిన వివాదం
పార్లమెంట్ ఎన్నికల వేళ టికాంగ్రెస్‌లో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. సోమవారం గాంధీభవన్‌లో జరిగిన హైదరాబాద్ పార్లమెంట్ కో-ఆర్డినేషన్ సమావేశంలో నేతల మధ్య ఘర్షణ తలెత్తింది. హైదరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి సమీరుల్లాఖాన్ ముందే ఇరువర్గాలు ఘర్షణకు దిగాయి. కార్యకర్తలు తీవ్ర ఆవేశంతో ఒకరిపై మరొకరు దూసుకెళ్లారు.

పక్కనే ఉన్న నేతలు వెంటనే అప్రమత్తమై కార్యకర్తలను అదుపు చేయడంతో గొడవ సద్దుమణిగింది. స్వయంగా కో-ఆర్డినేషన్ మీటింగ్‌లోనే కేడర్ గొడవకు దిగడంతో తీవ్ర అసహనానికి గురైన ఎంపి అభ్యర్థి సమీరుల్లాఖాన్ మీటింగ్ మధ్యలో నుంచి వెళ్లిపోయారు. పోలింగ్‌కు మరో వారం రోజుల సమయం మాత్రమే ఉండటం, మరోవైపు కేడర్ మాత్రం వర్గ విభేదాలతో ఏకంగా గాంధీ భవన్‌లోనే ఘర్షణకు దిగడం అధికార పార్టీలో హాట్ టాఫిక్‌గా మారింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బీజేపీ స‌ర్కార్ తెలంగాణ‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర‌ జ‌రుపుతుందా?

Most Popular