Wednesday, May 1, 2024

Flood Situation in Dubai: భారత్ నుంచి దుబాయ్ వెళ్లే విమానాలకు తీవ్ర అంతరాయం

12 విమానాలను రద్దు చేసిన విమానయాన సంస్థలు

దుబాయ్‌లో 75 ఏళ్లలో ఎన్నడూ లేనంత భారీ వర్షపాతం నమోదు కావడంతో భారత్ నుంచి దుబాయ్ వెళ్లే విమానాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దాంతో ఎయిర్ ఇండియా, ఎమిరేట్స్, ఇండిగో వంటి ప్రధాన విమానయాన సంస్థలు తమ సర్వీసులను రద్దు చేసినట్లు ప్రకటించాయి. అలాగే హైదరాబాద్ నుంచి దుబాయ్‌కు వెళ్లే 12 విమానాలు కూడా రద్దయ్యాయి.

Also Read: నేటి నుంచి సిఎం రేవంత్ సుడిగాలి పర్యటన

Severe disruption to flights from India to Dubai

ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా దుబాయ్‌కు వెళ్లే అన్ని సర్వీసులను రద్దు చేసినట్లుగా ఆయా సంస్థలు ప్రకటించాయి. దుబాయ్‌లో భారీగా వరదలు రావడంతో షాపింగ్ కాంప్లెక్స్‌లు, మాల్స్ నీట మునిగాయి. దుబాయ్ మెట్రో స్టేషన్‌లో మోకాళ్లలోతు నీరు చేరడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.1949 తరువాత దుబాయ్ లో ఇదే అధిక వర్షపాతం అని అక్కడి వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో స్కూళ్లు, ఆఫీసులకు సెలవులను ప్రకటించారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బీజేపీ స‌ర్కార్ తెలంగాణ‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర‌ జ‌రుపుతుందా?

Most Popular