Friday, May 17, 2024

ప్రభుత్వ ఉద్యోగులకు 40 శాతం ఫిట్‌మెంట్ వర్తింపజేయండి

పిఆర్సీ కమిటీతో ట్రెసా ప్రతినిధి బృందం భేటీ

రెవెన్యూ ఉద్యోగులకు మెరుగైన పే స్కేల్స్ మంజూరు చేయాలని ట్రెసా ప్రతినిధులు పిఆర్సీ కమిటీని కోరారు. పెరిగిన ధరలకు అనుగుణంగా ప్రభుత్వ ఉద్యోగులకు మెరుగైన పీఆర్సీని మంజూరు చేయాలని కోరుతూ తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు వంగ రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో ట్రెసా ప్రతినిధి బృందం ప్రధాన కార్యదర్శి కె.గౌతమ్ కుమార్‌లు వేతన సవరణ కమిటీ చైర్మన్ శివ శంకర్, ఐఏఎస్ అధ్యక్షతన ఏర్పడిన కమిటీ ఆహ్వానం మేరకు గురువారం బిఆర్కే భవన్ లో జరిగిన సమావేశానికి హాజరయ్యారు.

ఈ సందర్భంగా ప్రభుత్వ పరిపాలనలో కీలకమైన రెవెన్యూ శాఖలో పని చేస్తున్న రెవెన్యూ ఉద్యోగుల పే స్కేల్స్ ఇతర శాఖల ఉద్యోగులతో పోలిస్తే చాలా వ్యత్యాసాలు ఉన్నాయని, అధిక విధులతో ఉన్న జాబ్ చార్ట్‌ను నిర్వహిస్తూ, అధిక పనిఒత్తిడి తో పాటు అత్యవసర సేవల్లో నిరంతరం పని చేస్తున్న రెవెన్యూ ఉద్యోగులకు స్కేల్స్ మంజూరులో జరుగుతున్న వ్యత్యాసాన్ని దీనివల్ల ఉద్యోగులు నష్టపోతున్న విధానాన్ని తెలుపుతూ వీటిని శాస్త్రీయంగా అధ్యయనం చేసి సవరించాలని ట్రెసా ప్రతినిధులు కమిటీ దృష్టికి తీసుకెళ్లారు.

ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు రవీందర్ రెడ్డి , ప్రధాన కార్యదర్శి గౌతమ్ కుమార్‌తో పాటు ట్రెసా ఉపాధ్యక్షుడు బాణాల రాంరెడ్డి, కె.నిరంజన్ రావు, నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు రమన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బీజేపీ స‌ర్కార్ తెలంగాణ‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర‌ జ‌రుపుతుందా?

Most Popular