Friday, February 7, 2025

సామాజిక న్యాయమే మా ధ్యేయం

రాహుల్‌ ‌గాంధీ స్ఫూర్తితో కుల గణన  సర్వే
•అంకెల గారడీ తో అనుమానాలు సృష్టించొద్దు
•సద్విమర్శలను హూందాగా స్వీకరిస్తాం
•ప్రతిపక్షాల అనుమానాలను నివృత్తి చేసేందుకు సిద్ధం
•ప్రభుత్వ చిత్తశుద్దిని శంకించొద్దు
•రాష్ట్ర శాసనసభలో మంత్రి ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి

సామాజిక న్యాయానికి కాంగ్రెస్‌ ‌పార్టీ కట్టుబడి ఉందని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి కెప్టెన్‌ ఎన్‌. ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ ‌పార్టీ అధినేత,లోక్‌ ‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌ ‌గాంధీ స్ఫూర్తితో రాష్ట్రంలో కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం సామాజిక ఆర్థిక,విద్య, ఉద్యోగ, రాజకీయ కుల గణన సర్వే నిర్వహి ంచిందని ఆయన తెలిపారు మంగళ వారం రాష్ట్ర శాసనసభలో కుల గణనపై జరిగిన చర్చలో బిజెపికి చెందిన సభ్యుడు పాయల్‌ ‌శంకర్‌ ‌లేవనెత్తిన సందేహాలపై ఆయన తీవ్రంగా స్పందించారు.

సామాజిక ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ, కుల గణన సర్వే భారీ స్థాయిలో జరిగిన కసరత్తు అని ఆయన అన్నారు. అంకెల గారడీ తో అనవసరంగా ప్రజల్లో అపోహలు సృష్టించవద్దని ఆయన విపక్షాలకు హితవు పలికారు అప్పటి బిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర సర్వేలో ఓసిల శాతం 21% ఉండగా అది ఇప్పుడు 15% నికి తగ్గిందన్నారు. అదే విధంగా సమగ్ర సర్వేలో బిసిల శాతం 51% ఉండగా అది తాజాగా నిర్వహించిన సర్వేలో బీసీల శాతం 56% నికి పెరిగిందన్నారు.గణాంకాలు ఇంత స్పష్టంగా ఉంటే ప్రజల్లో గందరగోళం సృష్టించేందుకు విపక్షాలు రాద్ధాంతం చేస్తున్నారన్నారు.

సద్విమర్శలను హుందాగా స్వీకరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని,తప్పులు గుర్తిస్తే సరిదిద్దుకోవడంలో వెనకకు పోమని ఆయన తేల్చి చెప్పారు . ప్రతిపక్షాలకు అనుమానాలు ఉంటే ప్రజెంటేషన్‌ ‌ద్వారా నివృత్తి చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు ఈ తరహా సామాజిక ఆర్థిక,విద్య,ఉద్యోగ,రాజకీయ, కుల గణన సర్వే యావత్‌ ‌భారతదేశంలో ఎక్కడా జరగలేదన్నారు. కొత్తగా ఏర్పడ్డ తెలంగాణా రాష్ట్రాన్ని పదేళ్ల పాటు పాలించిన పార్టీ ఈ ఊసే ఎత్తలేదన్నారు. ప్రధాని మోదీతో సహా బిజెపి పాలిత రాష్ట్రాల్లో సామాజిక సర్వే ఎందుకు నిర్వహించలేదో బిజెపి నాయకులు వివరణ ఇవ్వాలని మంత్రి ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి డిమాండ్‌ ‌చేశారు మూడు కోట్ల 70 లక్షలున్న రాష్ట్ర జనాభాలో కులగణన సర్వే బృందం 3.54 లక్షల మందిని వ్యక్తిగతంగా కలిసి వివరాలు సేకరించినట్లు ఆయన వివరించారు.

150 ఇండ్లకు యూనిట్‌ ‌చొప్పున మార్కింగ్‌ ‌చేసి ప్రభుత్వ ఉద్యోగులకు శిక్షణ ఇచ్చి సర్వే నిర్వహించినట్లు ఆయన వెల్లడించారు.  ప్రతి మందికి ఒక సూపర్‌ ‌వైజర్‌ ‌ను నియమించి ఈ ప్రక్రియ పూర్తి చేశామన్నారు.మొత్తం ఈ సర్వేలో లక్షా మూడు వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొన్నారన్నారు అంతే గాకుండా 76 వేల మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లు రాత్రి పగుళ్లు శ్రమించి సృష్టించిన చారిత్రాత్మక ఘట్టం ఇది అన్నారు. 4 ఫిబ్రవరి 2024 న మొదలు పెట్టిన ఈ ప్రక్రియ సరిగ్గా సంవత్సరం తిరిగే సరికి అంటే 4 ఫిబ్రవరి 2025 నాటికి 160 కోట్ల ఖర్చు చేసి పూర్తి చేసిన ఘనత ముమ్మాటికీ రాష్ట్ర ప్రభుత్వానీకె దక్కుతుందన్నారు. బిసి, ఎస్సి, ఎస్టి, మైనారిటీల అభ్యున్నతికి కాంగ్రెస్‌ ‌పార్టీ చిత్తశుద్ధితో పని చేస్తుందన్నారు.అటువంటి మా చిత్తశుద్ధిని శంకించ వద్దన్నారు. కుల గణన సర్వే భారతదేశ చరిత్రలోనే సరికొత్త అధ్యాయంగా ఆయన అభివర్ణించారు.  ప్రభుత్వ చిత్తశుద్దిని శంకించి ప్రజల్లో తప్పుడు సమాచారంతో అపోహలు అనుమానాలు సృష్టించ వద్దన్నారు.

ప్ర‌దాన వార్త‌లు

తెలంగాణపై బీజేపీకి చిత్తశుద్ధి లేదని తేలిపోయిందన్న కవిత వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com