శ్రీలీల.. ప్రస్తుతం టాలీవుడ్ యంగ్ అండ్ టాప్ హీరోయిన్. కొద్దిరోజులుగా ఆమెకు ఎందుకోగాని అదృష్టం కలిసి రావడంలేదు. గత ఏడాది 4 సినిమాలు రిలీజైతే.. భగవంత్ కేసరి మినహా మిగిలిన మూడు చిత్రాలు డిజాస్టర్‌గా నిలిచాయి. సినీ పరిశ్రమలో ఏ స్టార్స్ ఎప్పుడు వెలుగుతారో..ఏ స్టార్స్ కు ఎప్పుడు పరిస్దితులు తిరగబడతాయో చెప్పలేము. ఓ శుక్రవారం ఓవర్ నైట్ అప్పటిదాకా ఆ వీధిలో కూడా పెద్దగా తెలియనివారు ప్రపంచానికి పరిచయమై స్టార్స్ గా వెలగటం మొదలవుతుంది. అందుకు ఉదాహరణగా శ్రీలీల ను చెప్పచ్చు. ఆమె నక్క తోకను తొక్కి వచ్చినట్టుంది అంటూంటారు దర్శక,నిర్మాతలు. రాఘవేంద్రరావు పర్యవేక్షణలో వచ్చిన ‘పెళ్ళి సందD’ సినిమాతో సినీరంగంలోకి ఎంట్రీ ఇచ్చిన శ్రీలీలకు మొదటి సినిమాతోనే యూత్‌లో విపరీతమైన క్రేజ్ వచ్చింది. గతేడాది దసరాకు రిలీజైన ఈ చిత్రం యావరేజ్ టాక్ తెచ్చుకుంది. కానీ రిలీజ్‌కు ముందు హైప్ తెచ్చిన పాటలు.. రిలీజ్ తర్వాత శ్రీలీల అందాల ఆరబోతకు యూత్ థియేటర్‌లకు బాగా నే వెళ్లారు. కేవలం శ్రీలీల గురించే ఈ సినిమా ఆడిందంటే అతిశయోక్తి కాదు. నటనకు పెద్దగా ఆస్కారం లేకపోయినా తన గ్లామర్ షోతో యూత్‌ను ఆకట్టుకుంది. ఆ తర్వాత వరస సినిమాలు చేసింది. లాస్ట్ ఇయిర్ ‘ధమాకా’ సినిమా కూడా అంతే. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్ళు సాధించింది. ఈ సినిమాలో కొత్తదనం ఏమి లేకపోయినా రవితేజ కామెడీ, శ్రీలీల గ్లామర్ షోతో లాగేసింది.
అలాగే ‘ధమాకా’లో పర్ఫార్మెన్స్ పరంగా హీరోయిన్ శ్రీలీల పాత్రకు అంతగా స్కోప్ లేదు. దాంతో నటనకు పెద్దగా పని చెప్పే అవసరం రాలేదు. కానీ ఉన్నంతలో బాగానే దుమ్ము రేపింది. ముఖ్యంగా శ్రీలీల తన డ్యాన్స్‌లతో అదరగొట్టింది. రవితేజ పర్‌ఫార్మెన్స్‌కు ఏ మాత్రం తగ్గకుండా డాన్స్‌తో రెచ్చిపోయింది. నిజానికి ఈ సినిమా సక్సెస్‌లో సగం క్రెడిట్ ఈమెకే దక్కుతుంది. రీసెంట్ గా ఓ స్టార్ హీరో సినిమాలో శ్రీలీలతో ఐటెం సాంగ్ చేయించాలని మేకర్స్ భావించారు. ఇదే విషయమై శ్రీలీలను సంప్రదించి భారీ మొత్తంలో రెమ్యునరేషన్ కూడా ఆఫర్ చేశారు. కానీ ప్రస్తుతం సినిమాల్లో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న తరుణంలో ఐటెం సాంగ్స్ చేయడం శ్రీలీలకు ఇష్టం లేదని తెలుస్తోంది. అందుకే కోట్లు ఇచ్చినా సరే ఐటెం సాంగ్స్ చేయనని శ్రీలీల చెప్పేసిందట. గతంలో పుష్ప 2 సినిమాలోనూ ఐటెం సాంగ్ కోసం అడిగితే రిజెక్ట్ చేసిన సంగతి తెలిసిందే.

Related