Saturday, September 21, 2024

సమ్మె విరమించిన ఆరోగ్య మిత్రలు

ఆరోగ్య మిత్రల వేతనం
రూ.15,600 నుండి 19,500కు పెంపు
మంత్రి దామోదర్ రాజనర్సింహ
ప్రత్యేక చొరవతో క్యాడర్ మార్పు, వేతనాల పెంపు
మంత్రికి కృతజ్ఞతలు తెలిపిన ఆరోగ్య మిత్రలు

గత పది సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న ఆరోగ్య మిత్రల ప్రధాన డిమాండైనా క్యాడర్ మార్పు (డేటా ఆపరేటర్)ను అంగీకరిస్తూ వేతనాన్ని రూ.15,600 నుండి రూ. 19,500కు పెంచుతూ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ప్రత్యేక తీసుకున్న చొరవ తీసుకుని సమ్మె చేస్తున్న ఆరోగ్య మిత్రలతో శుక్రవారం ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సిఇఒ, ఆరోగ్య మిత్రల సంఘం రాష్ట్ర కమిటీ నాయకులతో మంత్రి చర్చలు జరిపారు. తమ డిమాండ్లపై మంత్రి సానుకూలంగా స్పందించి వేతనాలను పెంచుతూ మంత్రి నిర్ణయం తీసుకోవడంతో సమ్మె విరమిసతూ ఆరోగ్య మిత్రలు లేఖ విడుదల చేశారు. తమ డిమాండ్ల పట్ల ప్రభుత్వం సానుకూలంగా తీసుకున్న నిర్ణయాన్ని ఆరోగ్యం మిత్రలు స్వాగతించారు. యధావిధిగా ఆరోగ్యశ్రీ సేవల విధులలో పాల్గొంటున్నట్టుగా ప్రకటించారు.

ఈ సందర్భంగా మంత్రి దామోదర్ రాజనర్సింహకు ఆరోగ్య మిత్రలు కృతజ్ఞతలు తెలిపారు. ఆరోగ్య మిత్రల బకాయిలు చెల్లించటానికి, సమ్మె కాలంలో ఒడి కింద వేతనాలు చెల్లించాలని సిఇఒకు మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశాలు జారీ చేశారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ అందిస్తున్న ఆరోగ్య సేవలను బలోపేతం చేయడానికి ఆరోగ్య మిత్రలు శక్తి వంచన లేకుండా కృషి చేయాలని మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశించారు.

రాజీవ్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్‌లో పనిచేస్తున్న ఆరోగ్య మిత్రల యూనియన్ నాయకులు చేసిన విజ్ఞప్తిలపై మంత్రి సానుకూలంగా స్పందించి పరిష్కారం అయ్యేలా కృషి చేస్తామన్నారు. గత ప్రభుత్వాలు ఆరోగ్య మిత్రుల సేవలను నిర్లక్ష్యం చేశాయని ఈ సందర్భంగా ఆరోగ్య మిత్రలు ఆవేదన వ్యక్తం చేశారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ సేవలను యధావిధిగా ఆరోగ్యశ్రీ సేవల విధులలో పాల్గొంటున్నట్టుగా ఆరోగ్య మిత్ర యూనియన్ నాయకులు ప్రకటించారు. ఈ చర్చలలో ఆరోగ్య మిత్రుల రాష్ట్ర అధ్యక్షులు గిరి యాదయ్య, ప్రధాన కార్యదర్శి ఎం. కుమార్, ఉపాధ్యక్షులు విష్ణు తదితరులు పాల్గొన్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొట్టడం కుట్రే... ఇందులో జ‌గ‌న్ పాత్ర ఉంది అన్న వర్ల రామయ్య వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular