Tuesday, April 15, 2025

చెస్ అకాడమీ, ట్యూషన్ సెంటర్ ను ప్రారంభించిన రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్

  • దేవీ నవరాత్రుల సందర్భంగా విశిష్ట చండీహోమంలో పాల్గొన్న మంత్రి దుర్గేష్
  • నిడదవోలులోని గోపవరం శ్రీ గుబ్బాలమ్మ వారి దేవాలయంలో పూజలు నిర్వహించిన మంత్రి
  • రాష్ట్రం సమగ్రాభివృద్ధి చెందాలని కాంక్షించిన మంత్రి దుర్గేష్

రాజమహేంద్రవరం: చెస్ క్రీడకు ఎంతో ప్రాచుర్యముందని, ఇష్టంతో, దీక్షతో ఆడే ఆటగా రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ చెస్ ను అభివర్ణించారు. బుధవారం ఉదయం రాజమహేంద్రవరం జేఎన్ రోడ్డులో చెస్ అకాడమీ మరియు ట్యూషన్ సెంటర్ ను మంత్రి కందుల దుర్గేష్ ప్రారంభించారు. చిన్నారులతో కలిసి చెస్ ఆడారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ క్రీడాకారులు తమ స్థాయిని, నైపుణ్యాన్ని మేధస్సును పెంచుకునేందుకు ఇది చక్కటి వేదిక అని తెలిపారు. చిన్నారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి దుర్గేష్ సూచించారు.

 

అనంతరం శ్రీరాంనగర్ లోని అమ్మవారి ఆలయంలో దేవీ నవరాత్రుల సందర్భంగా నిర్వహించిన విశిష్ట చండీహోమంలో మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు. అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. తర్వాత నిడదవోలులో సమీపంలోని గోపవరం శ్రీ గుబ్బాలమ్మ అమ్మవారి ఆలయంలో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయ ఆవరణలో మంత్రి మొక్కను నాటారు. చిన్నారులకు నోట్ బుక్స్, పుస్తకాలు అందజేశారు. రాష్ట్రం సమగ్రాభివృద్ధి చెందాలని, రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్య, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని మంత్రి కాంక్షించారు. వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య మంత్రి ఆశీర్వచనం అందుకున్నారు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com