Monday, May 20, 2024

Stone attack on Jagan: జగన్‌పై రాయి దాడి .. తీవ్రంగా స్పందించిన కేంద్ర ఎన్నికల సంఘం

  • బస్సు యాత్రలో సీఎం జగన్‌పై రాయితో దాడి
  • చిలుకలూరిపేటలో మోదీ సభలో భద్రతా వైఫల్యం
  • వరుస ఘటనలపై కేంద్ర ఎన్నికల కమిషన్ సీరియస్

టీఎస్‌ ఏపీః ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విజయవాడలో శనివారం రాత్రి జరిగిన రాళ్ల దాడి ఘటనపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. ఈ ఘటనపై ఆరా తీసిన ఈసీ.. పూర్తి వివరాలతో నివేదిక కోరింది. ఇదే సమయంలో ఎన్నికల వేళ వీఐపీల భద్రతలో వరుస వైఫల్యాలపై అసహనం వ్యక్తం చేసింది. గత నెల చిలకలూరిపేటలో ప్రధాని నరేంద్ర మోదీ సభ, విజయవాడలో సీఎం జగన్ రోడ్‌షోలో రాళ్లదాడిపై పలు ప్రశ్నలు సంధించింది. రాజకీయ హింసాత్మక ఘటనలు చోటుచేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించింది. ఇప్పటికే ప్రధాని సభలో భద్రతా వైఫల్యంపై ఐజీ, ఎస్పీలపై ఈసీ వేటువేసిన సంగతి తెలిసిందే.

ఈ ఘటనతో రెండు తెలుగు రాష్ట్రాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. దాడిపై ప్రధాని మోదీ, తమిళనాడు సీఎం స్టాలిన్, కేటీఆర్ తో పాటు సినీ ప్రముఖులు కూడా స్పందించారు. ఈ ఘటనను ఖండించడమే కాక.. ఇలాంటి సంఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా.. కేంద్ర ఎన్నికల సంఘం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా జగన్ పై జరిగిన రాళ్ల దాడి ఘటనపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ గా స్పందించింది.

ఈ ఘటనపై ఆరా తీసిన ఈసీ.. పూర్తి వివరాలతో నివేదిక కోరింది. అంతేకాక ఎన్నికల వేళ వీఐపీల భద్రతలో వరుస వైఫల్యాలు చోటు చేసుకోవడంపై ఈసీ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. గత నెల చిలకలూరిపేటలో ప్రధాని నరేంద్ర మోదీ సభ, ఇప్పుడు విజయవాడలో సీఎం జగన్ రోడ్‌షోలో రాళ్లదాడిపై పలు ప్రశ్నలు సంధించింది. రాజకీయ హింసాత్మక ఘటనలు చోటుచేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు ఆదేశించింది. ఇప్పటికే ప్రధాని మొదీ సభలో చోటు చేసుకున్న భద్రతా వైఫల్యం తీవ్రంగా స్పందించిన ఈసీ.. ఐజీ, ఎస్పీలపై వేటు వేసిన సంగతి తెలిసిందే.

ఈసీ ఆదేశాలతో పోలీసులు రంగంలోకి దిగారు. ఘటన జరిగిన ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు. అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. కేసు విచారణ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. దాడికి సంబంధించి ప్రాథమిక నివేదికను విజయవాడ సీపీ క్రాంతి రాణా ఈ రోజు సాయంత్రానికి ఈసీకి అందజేయనున్నారు. వీళ్లు కాకుండా ఎక్కడికక్కడ స్థానిక పోలీసులు కల్పించే భద్రత అదనం. అయినా సీఎంపైకి రాయి విసిరి, గాయం చేయగలిగారంటే భద్రతాపరంగా పోలీసులు ఎంత ఘోరంగా విఫలమయ్యారో అర్థమవుతోందని ప్రజలు పెదవి విరుస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బీజేపీ స‌ర్కార్ తెలంగాణ‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర‌ జ‌రుపుతుందా?

Most Popular