Wednesday, March 12, 2025

ఏపీ-తెలంగాణలోనే భారీ గణనాధుడు

వినాయక చవితి పండగను దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులంతా భక్తి శ్రద్దలతో చేసుకుంటున్నారు. ఊరు వాడ అంతా గణనాధుల ప్రతిమలను ప్రతిష్టించి పూజలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోనే భారీ గణపతిని విశాఖపట్నంలో ఏర్పాటు చేశారు. వైజాగ్ ఇండస్ట్రియల్ ఏరియ్ అయిన గాజువాక డిపో వద్ద లంబోధర ట్రస్టు ఆధ్వర్యంలో అత్యంత భారీ వినాయకుడిని ఏర్పాటు చేస్తున్నారు.

ఈ క్రమంలో విగ్రహానికి శుక్రవారం తుదిరూపుకు సంబందించిన పనులను పూర్తి చేశారు. ఈ భారీ గణనాధునిడిని కాలుష్య రహితంగా రూపు దిద్దే క్రమంలో బొడ్డ గణపయ్య నుదుట నామాలు అలంకరణ ప్రక్రియ చేపట్టారు. అంతే కాకుండా పూర్తిస్థాయిలో బెల్లం వినాయక విగ్రహంగా శుక్రవారం అర్ధరాత్రి ఒంటిగంట వరకు పనులు కొనసాగాయని నిర్వాహకులు చెప్పారు. శనివారం సాయంత్రం ఈ భారీ వినాయకుడు తొలి పూజలు జరగనున్నాడు. తెలుగు రాష్ట్రాల్లోనే భారీ వినాయకుడిగా రికార్డు నెలకొల్పుతున్న భారీ నణనాధునిడిని చూసేందుకు ఆంతా ఆసక్తి చూపుతున్నారు.

ప్ర‌దాన వార్త‌లు

ఆ మనిషి కార్పొరేట‌ర్‌కు ఎక్కువ... ఎమ్మెల్యేకు త‌క్కువ: పవన్ పై జ‌గ‌న్‌ కామెంట్స్ ను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com