Wednesday, April 2, 2025

తెలంగాణ గ్రూప్​ 1 టాపర్లు వీరే

తెలంగాణ గ్రూప్​ 1 ఫలితాల్లో పురుషులతో సమానంగా మహిళలు పోటీ పడ్డారు. టాప్​ 50 ర్యాంకుల్లో 25 మంది, తొలి వంద ర్యాంకుల్లో 41 మంది మహిళలున్నారు. హైదరాబాద్​కు చెందిన లక్ష్మీ దీపిక కొమ్మిరెడ్డి రాష్ట్రంలో ఫస్ట్ ర్యాంక్​ సాధించారు. మెయిన్స్​ పరీక్షల్లో 900 మార్కులకు లక్ష్మీ దీపిక 550 మార్కులు సాధించారు. ఉస్మానియాలో ఎంబీబీఎస్​ పూర్తి చేసిన లక్ష్మీ దీపిక గతంలోనే ఎంపీడీవో సెలెక్టయ్యారు. రెండు సార్లు యూపీఎస్​సీ ఇంటర్వ్యూ కు సెలెక్టయ్యారు. నల్గొండ జిల్లాకు చెందిన దాడి వెంకటరమణ 535.5 మార్కులతో రెండో ర్యాంకు సాధించారు. ఆరేండ్లుగా సివిల్​ సర్వీసెస్‌కు ప్రిపేరవుతున్న వెంకటరమణ.. గ్రూప్‌-1 ఫస్ట్ అటెంప్ట్ లోనే సత్తా చాటడం విశేషం. ఇటీవల టీజీపీఎస్సీ ప్రకటించిన జూనియర్‌ లెక్చరర్‌ సివిక్స్‌ పోస్టుకు, డివిజనల్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌ పోస్టుకు ఎంపికయ్యారు. గ్రూప్‌-2లో 378వ ర్యాంకు సాధించారు.

మల్టీ జోన్‌-1 కేటగిరీలో టాపర్‌గా హనుమకొండ జిల్లాకు చెందిన తేజస్వినిరెడ్డి (532.5 మార్కులు) నిలిచారు. మొత్తం మీద నాలుగో ర్యాంకు సాధించారు. ఆమె ప్రస్తుతం మండల పంచాయతీ అధికారిగా విధులు నిర్వహిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా మీర్‌పేట కార్పొరేషన్‌ జిల్లెలగూడకు చెందిన సిద్ధాల కృతిక గ్రూపు-1లో 532 మార్కులతో రాష్ట్రస్థాయిలో 5వ ర్యాంకు సాధించారు. నాలుగు సార్లు సివిల్స్‌ కు ప్రయత్నించిన కృతికకు మంచి ర్యాంకు రాలేదు. ఇటీవల గ్రూప్‌-4లో 511వ ర్యాంకు సాధించి వాణిజ్య పన్నుల శాఖలో జూనియర్‌ అసిస్టెంట్‌ ఉద్యోగంలో చేరారు. తాజాగా గ్రూప్‌-1లో రాష్ట్రస్థాయి ఐదో ర్యాంకు సాధించారు.నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణానికి చెందిన పూనాటి హర్షవర్ధన్‌ గ్రూప్‌-1లో రాష్ట్రస్థాయిలో ఆరో ర్యాంకు, మల్టీ జోన్‌-2 స్థాయిలో నాలుగో ర్యాంకు సాధించాడు. బిట్స్‌ పిలానీ లో ఇంజనీరింగ్​ చదివిన హర్షవర్ధన్​ రూ.27 లక్షల వార్షిక వేతనంతో ఓ ప్రైవేట్‌ సంస్థలో ఉద్యోగం చేశారు. ఉద్యోగం మానేసి సివిల్ప్​కు ప్రిపేరవుతున్నాడు.

మహిళలే
రాష్ట్రస్థాయి సివిల్‌ సర్విసు కొలువులుగా భావించే గ్రూప్‌–1 ఉద్యోగ నియామకాలకు సంబంధించిన అర్హత పరీక్షల ఫలితాల్లో మహిళలు టాపర్లుగా నిలిచారు. మల్టీజోన్‌–1, మల్టీజోన్‌–2 రెండుచోట్లా టాప్‌ ర్యాంకులను మహిళా అభ్యర్థులే సాధించారు. మల్టీజోన్‌–2లో టాప్‌ స్కోర్‌ 550 మార్కులు కాగా.. మల్టీజోన్‌–1లో 532.5 మార్కులు టాప్‌ స్కోర్‌గా ఉన్నాయి. గ్రూప్‌–1 మెయిన్స్‌ పరీక్షలకు సంబంధించి జనరల్‌ ర్యాంకింగ్‌ జాబితా (జీఆర్‌ఎల్‌)ను తెలంగాణ పబ్లిక్‌ సర్విస్‌ కమిషన్‌ ఆదివారం విడుదల చేసింది. ఉగాది పండుగ సందర్భంగా అభ్యర్థులకు తీపికబురు అందించే ఉద్దేశంతో తెలుగు నూతన సంవత్సరం తొలి రోజున జీఆర్‌ఎల్‌ను విడుదల చేసినట్లు కమిషన్‌ వర్గాలు తెలిపాయి.

జనరల్‌ ఇంగ్లిష్‌లో అర్హత సాధించిన వారే జాబితాలో..
రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో 563 గ్రూప్‌–1 ఉద్యోగాల భర్తీకి గతేడాది ఫిబ్రవరి 19న టీజీపీఎస్సీ నోటిఫికేషన్‌ జారీ చేసింది. మొత్తం 4,03,465 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. గతేడాది జూన్‌ 9న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించింది. జూలై 7వ తేదీన ఫలితాలను విడుదల చేసింది. 1:50 నిష్పత్తిలో అభ్యర్థులను షార్ట్‌లిస్ట్‌ చేసి 31383 మందిని మెయిన్స్‌ పరీక్షలకు ఎంపిక చేసింది. మెయిన్స్‌ పరీక్షలు గతేడాది అక్టోబర్‌ 21 నుంచి 27 వరకు నిర్వహించింది.

మొత్తం 31,403 మంది పరీక్షలకు హాజరు కాగా.. 21,093 మంది మాత్రమే మొత్తం 7 పేపర్లూ రాశారు. ఈ నెల 10న అభ్యర్థుల ప్రొవిజినల్‌ మార్కుల జాబితాను కమిషన్‌ విడుదల చేయగా..మార్కుల రీకౌంటింగ్‌కు దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 24 వరకు కమిషన్‌ అవకాశం కలి్పంచింది. ఈ ప్రక్రియ పూర్తి కావడంతో అభ్యర్థులు ఏడు పేపర్లలో సాధించిన మొత్తం మార్కుల వివరాలతో కూడిన జీఆర్‌ఎల్‌ను కమిషన్‌ తాజాగా వెబ్‌సైట్‌లో అందుబాటులోకి ఉంచింది. జనరల్‌ ఇంగ్లీ‹Ùలో అర్హత సాధించిన అభ్యర్థులు మాత్రమే జనరల్‌ ర్యాంకింగ్‌ జాబితాలో ఉన్నారు.

అభ్యర్థి లాగిన్‌లో మార్కుల మెమోలు
పేపర్ల వారీగా అభ్యర్థుల మార్కులను కమిషన్‌ విడుదల చేసింది. అభ్యర్థుల లాగిన్‌లో మెమోలు అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు వారి టీజీపీఎస్సీ ఐడీ, హాల్‌టికెట్, పుట్టిన తేదీ, రిజిస్టర్డ్‌ మొబైల్‌ నంబర్‌కు వచ్చే ఓటీపీల ద్వారా లాగిన్‌ అయ్యాక పేజీని తెరిచి మెమోను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని టీజీపీఎస్సీ స్పష్టం చేసింది. ఈ మెమోలు ఏప్రిల్‌ 5వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయని కమిషన్‌ కార్యదర్శి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అయితే జీఆర్‌ఎల్‌ ఏప్రిల్‌ 28వ తేదీ వరకు నెలరోజుల పాటు అందుబాటులో ఉంటుందని వివరించారు. ప్రస్తుతం విడుదల చేసిన జీఆర్‌ఎల్‌ ఆధారంగా త్వరలో 1:2 నిష్పత్తిలో ప్రాథమిక ఎంపిక జాబితాను విడుదల చేయనున్నట్లు కమిషన్‌ వర్గాలు తెలిపాయి.

అలాఎంపికైన అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన చేపట్టిన తర్వాత తుది ఎంపిక జాబితాను ప్రకటిస్తారు. అభ్యర్థులు అన్నిరకాల ఒరిజినల్‌ ధ్రువపత్రాలతో పాటు అనెక్జర్‌–6 ప్రకారం నిర్దేశించిన డాక్యుమెంట్లను అందుబాటులో ఉంచుకోవాలని టీజీపీఎస్సీ స్పష్టం చేసింది. ఇలావుండగా హైకోర్టు ఆదేశాలతో మెయిన్స్‌ పరీక్షలు రాసిన అభ్యర్థుల (స్పోర్ట్స్‌ కోటా విషయంలో 20 మంది కోర్టును ఆశ్రయించారు) వివరాలను విడుదల చేయలేదు. లాగిన్‌ విషయంలో అభ్యర్థులకు ఏవైనా సాంకేతిక సమస్యలు ఎదురైతే కమిషన్‌ టెక్నికల్‌ డెస్‌్కను 040–23542185, 040–23542187 ఫోన్‌ నంబర్లలో లేదా ‘హెల్ప్‌డెస్‌్క(ఎట్‌) టీఎస్‌పీఎస్సీ. జీఓవీ. ఇన్‌’లో సంప్రదించవచ్చని టీజీపీఎస్సీ తెలిపింది.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com