Sunday, May 19, 2024

రైతులకు గుడ్​ న్యూస్​ రైతు భరోసా కు రూ. 2 వేల కోట్లు

పంట పరిహారానికి 15 కోట్లు విడుదల

రాష్ట్రంలో పంట నష్టపోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్న రైతాంగానికి రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో పంట నష్టపోయిన బాధిత రైతులకు పంట నష్టం నిధులు విడుదల చేసింది ప్రభుత్వం. ఈ మేరకు జీవో విడుదల చేసింది. పంట నష్టం నిధులు విడుదల చేసేందుకు ఎన్నికల కమిషన్ అనుమతి ఇవ్వడంతో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జీవో విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 15,814 ఎకరాల్లో పంట నష్టం జరుగగా.. 15,246 మంది రైతులకు రూ. 15.81 కోట్ల నిధులు విడుదల చేసింది ప్రభుత్వం. కాగా, రాష్ట్రంలో అత్యధికంగా కామారెడ్డిలో 10,000 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు ప్రభుత్వం పేర్కొంది.

అదేవిధంగా రైతుభరోసా కింద రూ. 2 వేల కోట్లను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 5 ఎకరాలకుపైబడిన రైతులకు పంట పెట్టుబడి సాయాన్ని పెండింగ్​ పెట్టారు. ఈ సొమ్మును విడుదల చేస్తూ ప్రభుత్వం సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిధులను రైతుల ఖాతాల్లో జమ చేసింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బీజేపీ స‌ర్కార్ తెలంగాణ‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర‌ జ‌రుపుతుందా?

Most Popular