Thursday, December 26, 2024

పాత పెన్షన్ స్కీమ్ పునరుద్దరించాలి టిజిఓ కేంద్ర సంఘం డిమాండ్

రాష్ట్రంలో కాంట్రిబ్యూషన్ పెన్షన్ రద్దు చేసి పాత పెన్షన్ స్కీమ్‌ను పునరుద్దరించాలని తెలంగాణ గెజిటెడ్ అధికారుల కేంద్ర సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. తెలంగాణ గెజిటెడ్ అధికారుల కేంద్ర సంఘం కార్యవర్గ సమావేశం నాంపల్లిలోని టిజివో భవన్‌లో గురువారం జరిగింది. అధ్యక్షులు ఏలూరి శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వివిధ అంశాలపై చర్చించి పలు తీర్మానాలు ఆమోదించారు. ఈ సమావేశంలో కేంద్ర కార్యవర్గ సభ్యులందరు పాల్గొన్నారు. ప్రభుత్వం, ఉద్యోగుల కాంట్రిబ్యూషన్ సమాన నిష్పత్తిలో చేసి ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఇహెచ్‌ఎస్)ను వెంటనే అమలు పరచాలని, ట్రస్టులో ఉద్యోగులకు సమాన భాగస్వామ్యం కల్పించాలని, పెండిగ్‌లో ఉన్న మూడు డిఎలను వెంటనే ఎలక్షన్ కమీషన్ అనుమతితో విడుదలచేయాలని, తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖలో పెండింగ్‌లో ఉన్న అన్ని బిల్లులను (సప్లమెంటరీ) వెంటనే చెల్లించాలని సమావేశం తీర్మానాలు ఆమోదించింది. రాష్ట్ర విభజన సమయంలో ఎపికి కేటియించిన 144 ఉద్యోగులను ఎన్నికల సంఘం అనుమతితో వెంటనే అమలుపరచాలని, రెండవ పిఆర్‌సి మధ్యంతర ఉపశమనంను 5 శాతం నుండి 20 శాతానికి పెంచాలని, వైద, ఆరోగ్య శాఖకు సంబంధించిన జివో 142 పునసమీక్షించాలని, కొత్తగా ఏర్పడిన జిల్లాలలో,

గతంలో ఉన్న జిల్లాల ప్రకారం అన్ని విభాగాలలో అదనపు క్యాడర్‌ను వెంటనే మంజూరు చేయాలని, ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే సాధారణ బదిలీలను కౌన్సిలింగ్ పద్దతిలో నిర్వహించాలని, ప్రస్తుతం 1వ పిఆర్‌సి అమలు నోచుకొని ఉద్యోగులకు, చివరి అవకాశంగా మరొ మూడు నెలలు జిల్లాస్థాయి హెచ్‌ఒడిలకు అధికారం ఇస్తూ గడువు ఇవ్వాలని, సాధారణ ఎలక్షన్స్లో ఎంసిసి, ఎఫ్‌ఎస్‌టి, ఎస్‌ఎస్‌టి, విఎస్‌టి, సెక్టరోల్ ఆఫీసర్స్, ఎక్స్‌పెండీచర్ అబ్జర్వర్, నోడల్ ఆఫీసర్ తదితర డ్యూటిలను నిర్వహిస్తున్న అధికారులకు ఒక నెల వేతనం అన్ని జిల్లాలలో ఏకరూపంగా చెల్లించాలని, జిల్లాస్థాయి, డివిజన్ స్థాయి, మండలస్థాయి అధికారుల పట్ల అవమానకరంగా, అనుచితంగా ప్రవర్తిస్తున్న కొంత మంది జిల్లా కలెక్టర్ల పై తగు చర్యలు తీసుకోవాలని, మండలస్థాయి, డివిజన్ స్థాయి, జిల్లాస్థాయి, రాష్ట్రస్థాయి అధికారులు అద్దె వాహనాలపై చెల్లింపులను వెంటనే విడుదల చేయాలని, 2024 మార్చి 31, లోపు వున్న పెండింగ్ బిల్లులు అన్నింటిని రిషెడ్యూల్ చేయాలని సమావేశంలో తీర్మానాలు ఆమోదించారు. ఈ తీర్మానాల కాపీల వినతిని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, మంత్రివర్గ ఉపసంఘానికి, త్రిసభ్య కమిటిని (అధికారిక) కలిసి అందజేయడం జరుగుతుందన్నారు. సమావేశంలో టిజివో కేంద్ర సంఘం ప్రధాన కార్యదర్శి ఎ. సత్యనారాయణ అసోసియేట్ అధ్యక్షులు బి.శ్యామ్, ఉపాధ్యక్షులు ఎ.జగన్ మోహన్ రావు, కోశాధికారి ఎమ్. ఉపేందర్ రెడ్డి, జాయింట్ సెక్రటరీ ఎ.పరమేశ్వర్రెడ్డి, మహిళా ప్రతినిధి జి.దీపారెడ్డి, అర్గనైజింగ్ సెక్రటరీ ఎమ్. రామకృష్ణ గౌడ్, కార్యనిర్వాహక సభ్యుడు సి.యాదగిరి, సలహదారులు టి.రవీందర్ రావు, జి.పురుషోత్తమ్ రెడ్డి, వి.సురేష్ తదితరులు పాల్గొన్నారు.

ప్ర‌దాన వార్త‌లు

అల్లు అర్జున్ పట్ల రేవంత్ రెడ్డి దారుణంగా వ్యవహరిస్తున్నారన్న డీకే అరుణ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com