- మళ్లీ మురళీ ఫస్ట్
- దేశంలో బిలీనియర్లు ఎక్కవ ఉన్నది ఇక్కడే
భాగ్యనగరంలో భాగ్యవంతుల జాబితా రోజురోజుకు పెరిగిపోతోంది. ప్రస్తుతం నగరంలో టాప్ 10 కోటీశ్వరుల జాబితా విడుదలైంది. ఎక్కువ మంది బిలియనీర్లు హైదరాబాద్ లోనే ఉన్నట్లు తేలింది. భారతదేశంలో ఎక్కువమంది కోటీశ్వరులు నివసిస్తున్న నగరాల్లో హైదరాబాద్ మూడోస్థానంలో నిలబడింది. దేశంలో ధనవంతులు అంటే అంబానీ, అదానీ, ప్రపంచంలో ధనవంతులంటే ఎలాన్ మస్క్, జెఫ్ బెజోస్ లాంటి పేర్లు చెబుతాం. కానీ మన తెలుగులో కూడా బిలియనీర్లున్నారు. చిన్నస్థాయిలో తమ వ్యాపారాన్ని ప్రారంభించి అతి పెద్ద వ్యాపార సామ్రాజ్యంగా మార్చినవారు చాలామంది ఉన్నవారు. వారిలో టాప్ 10లో ఉన్నవారి వివరాలను ఓ సంస్థ విడుదల చేసింది.
ప్రధానంగా హైదరాబాద్ నగరంలో దివీస్ లేబరేటరీస్ చైర్మన్ మురళి దివి ప్రథమస్థానంలో నిలిచారు. ఆయన నికర ఆస్తుల విలువ రూ.76,100 కోట్లుగా ఉంది. పదో స్థానంలో బయోలాజికల్ ఇ చైర్ పర్సన్ మహిమ దాట్ల రూ.13,600 కోట్లతో నిలిచారు. హైదరాబాద్‌లో టాప్-10 ధనవంతుల జాబితా ప్రకారం… దివీస్ లేబొరేటరీస్ – మురళి దివి – రూ.76,100 కోట్లు, మేఘా ఇంజనీరింగ్ – పి.పిచ్చిరెడ్డి – రూ.54,800 కోట్లు, మేఘా ఇంజనీరింగ్ – పి.వి.కృష్ణారెడ్డి – రూ.52,700 కోట్లు, హెటెరో లాబ్స్ – బి.పార్థసారధి రెడ్డి – రూ.29,900 కోట్లు, అపర్ణ కన్ స్ట్రక్షన్స్ – ఎస్.సుబ్రమణ్యంరెడ్డి – రూ.22,100 కోట్లు, అపర్ణ కన్ స్ట్రక్షన్స్ – సి.వెంకటేశ్వరరెడ్డి – రూ.21,900 కోట్లు, ఎంఎస్ఎన్ ల్యాబ్స్ – ఎం.సత్యనారాయణరెడ్డి – రూ.18,500 కోట్లు, మైహోం ఇండస్ట్రీస్ – జూపల్లి రామేశ్వరరావు – రూ.18,400 కోట్లు, డాక్టర్ రెడ్డీస్ – కె.సతీష్ రెడ్డి – రూ.18,100 కోట్లు, బయోలాజికల్ ఇ – మహిమ దాట్ల – రూ.13,600 కోట్లుగా నిలిచారు.